
భూకైలాస్ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా, తాండూరు మండలంలోని అంతారం తాండలో ఉంది.

ఈ శివాలయంలో భక్తులు నీళ్లలో నడుచుకుంటూ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటూ వెళ్లి గర్భాలయంలోకి చేరుకుంటారు.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

తాండలో కొలువైన పరమశివుడిని దర్శించుకుంటే సకల కష్టాలు పోతాయనేది భక్తుల నమ్మకం.

ఈ ఆలయంలో కాలభైరవుడు, 65 అడుగుల ఎత్తులో ఉన్న శివుని విగ్రహం, వీరభద్రుడు, హనుమంతుడు, నవగ్రహాలు, అయ్యప్ప స్వామి, సాయిబాబా ఆలయం, వినాయకుని ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, రాఘవేంద్ర స్వామి ఆలయం, సీతారామ ఆలయం, పంచముఖి హనుమాన్ దేవాలయం, కాళికాదేవి ఆలయం ఉన్నాయి.

ఈ ఆలయాన్ని వాటర్ థీమ్ టెంపుల్ భూకైలాస్ అని కూడా పిలుస్తారు.

హైదరాబాదు నుంచి వచ్చేవారు ముందుగా తాండూరు చేరుకోవాలి. తాండూరు నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.












