ఐపీఎస్‌ పోస్టుకు సిద్ధార్థ్‌ కౌశల్‌ గుడ్‌బై..! | Siddharth Kaushal bids farewell to IPS post | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ పోస్టుకు సిద్ధార్థ్‌ కౌశల్‌ గుడ్‌బై..!

Jul 2 2025 3:57 AM | Updated on Jul 2 2025 3:34 PM

Siddharth Kaushal bids farewell to IPS post

ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ వేధింపులు ఐపీఎస్‌ అధికారులనూ హడలెత్తిస్తు­న్నాయి. ప్రభుత్వ వేధింపులు, అవమానా­లతో విసి­గివేసారిపోయిన ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ కౌశల్‌ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాల­యంలో ఎస్పీ(అడ్మిన్‌)గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ­(వీఆర్‌ఎస్‌) కోసం దరఖాస్తు చేశారని పోలీసు­వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ కౌశల్‌ దాదాపు నెల రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్య­తలు నిర్వర్తించారు. 

గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఐపీఎస్‌ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టంది. డీజీ స్థాయి అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, పీవీ సునీల్‌ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్‌ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి  సస్పెండ్‌ చేసింది. 

వెయిటింగ్‌లో ఉంచిన 24 మంది ఐపీఎస్‌ అధికారుల్లో కొందరికి చాలా నెలల తరువాత ప్రాధా­న్యం లేని పోస్టుల్లో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవి శంకర్‌ రెడ్డి, రిషాంత్‌ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వనే లేదు. ఇక రెడ్‌ బుక్‌ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్‌ బ్రిజ్‌­లాల్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవ­డం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశ­మైంది. 

ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్‌ కౌశల్‌ స్వచ్ఛంద ఉద్యోగ విరమ­ణకు దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీసు శాఖలో పరిస్థితి చక్కబడుతు­ందని భావించినా ఆ సూచ­నలు ఏవీ కనిపించడం లేదని ఆయ­న నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. వీఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఆమోదించిన తరు­వాత ఢిల్లీలో కార్పొ­రేట్‌ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement