సాక్షి హైదరాబాద్: యుఏఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే మేటి నగరంగా నిర్మించడానికి యూఏఈ సహాకారం అందించనుంది. ఈ మేరకు దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో భేటీ అయి ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టును వేగవంతంగా నిర్మించేందుకు ఇరువైపులా జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
కాగా హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు మండలంలోని ముచ్చర్ల, మీర్‌ఖాన్‌పేట గ్రామాల మధ్య సుమారు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. దీనిలో 11 టౌన్‌షిప్‌లను నిర్మించనున్నారు.


