TG: సివిల్స్ విజేతలకు సీఎం అభినందనలు | CM Revanth congratulates Civil Services winners | Sakshi
Sakshi News home page

TG: సివిల్స్ విజేతలకు సీఎం అభినందనలు

Mar 6 2026 7:30 PM | Updated on Mar 6 2026 9:06 PM

CM Revanth congratulates Civil Services winners

సాక్షి, హైదరాబాద్:  సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో విజయం సాధించిన  తెలంగాణ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్టం నుంచి 20 మంది సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించగా వారందరినీ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

యుపీఎస్సీ నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో పేదవారు ఉంటారని గుర్తించిన ప్రభుత్వం వారికి  అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని  అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా మెయిన్స్ రాసే విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. 

అయితే గతేడాది సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు  రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారిలో  51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వారందరికీ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో  నగదుని  అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement