గచ్చిబౌలిలో పేలిన హీలియం గ్యాస్‌ బెలూన్‌ | Helium Gas Balloon Explodes in Gachibowli Hyderabad | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలిలో పేలిన హీలియం గ్యాస్‌ బెలూన్‌

Mar 6 2026 7:50 PM | Updated on Mar 6 2026 8:54 PM

Helium Gas Balloon Explodes in Gachibowli Hyderabad

హైదరాబాద్‌:  నగరంలోని గచ్చిబౌలిలో హీలియం గ్యాస్‌ బెలూన్‌ పేలి నలుగురికి గాయాలయ్యాయి. బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌ ప్రాంగణంలో అడ్వర్టైజ్‌మెంట్‌ గ్యాస్‌ బెలూన్‌ పేలింది. ఓ  కన్వెన్షన్ లో  హొలీ ఈవెంట్ లో అడ్వర్టైజ్మెంట్ కోసం బెలూన్ ఏర్పాటు చేశారు. అయితే అది గాలికి ఎగిరి వచ్చి బ్రహ్మకుమారీస్ ప్రాంగణంలో పడింది. 

దీన్ని  బ్రహ్మకుమారీస్‌ వాలంటరీలు తీయడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలింది,. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ​గాయపడిన వారిని వెంటనే ఉస్మాన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement