దావోస్: గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అపర కుబేరుడు ఎలాన్ మస్క్ దుమ్మెత్తి పోశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని బోర్డ్ ఆఫ్ పైస్ (శాంతి ముక్కలు)గా మార్చుకుంటే సరిపోతుందని పరోక్షంగా దుయ్యబట్టారు.
దావోస్ వేదికగా కొనసాగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫిక్ అధ్యక్షత వహిస్తున్న ప్యానల్ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ట్రంప్ బోర్డు పీస్ బదులుగా పైస్ అని ఉండాలని మస్క్ సూచించారు. ‘నేను పీస్ సమ్మిట్ ఏర్పాటు గురించి విన్నాను. అది పీసా లేదంటే గ్రీన్‌లాండ్ పైస్,వెనిజువెలా పీస్ అని నేను అనుకున్నాను’. మనకు కావాల్సింది పైస్ కాదు పీస్ అంటూ నిశబ్ధంగా ఉన్న ఆడియెన్స్‌తో నవ్వులు పూయించారు.
ELON MUSK: "I heard about the formation of the peace summit? And I was like, is that piece or peace? Like little piece of Greenland a little piece of Venezuela." 😂 pic.twitter.com/QxmbOrH2wC
— DogeDesigner (@cb_doge) January 22, 2026


