గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, తిథి: బ.చవితి ఉ.9.45 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ధనిష్ఠ ఉ.11.45 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.7.12 నుండి 8.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.33 నుండి 7.17 వరకు, అమృత ఘడియలు: తె.5.06 నుండి 6.47 వరకు (తెల్లవారితే ఆదివారం).
సూర్యోదయం : 5.33
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఇంటాబయటా అనుకూలం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: కొత్త పరిచయాలు. ఊహించని విధంగా ధనలాభం. ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.
మిథునం: మిత్రులతో కలహాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనులు కొన్ని మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనారోగ్యం. పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
సింహం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కన్య: సన్నిహితుల నుంచి ధనలాభం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
తుల: ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
వృశ్చికం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.
ధనుస్సు: మీ శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
మకరం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కుంభం: సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తిలాభం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
మీనం: సన్నిహితులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.


