నాదిర్ గోద్రెజ్‌ను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానిస్తున్న మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు
రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల కేంద్రం ఏర్పాటు
సుమారు 4 వేల మందికి ఉపాధి అవకాశాలు
యూపీసీ వోల్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం
రూ.623 కోట్లతో శంషాబాద్, గాగిల్లాపూర్‌లో ‘స్నైడర్ ఎలక్ట్రిక్’ విస్తరణ
దావోస్ సదస్సులో సీఎం రేవంత్ కీలక సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను దేశంలో ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. యూపీసీ వోల్ట్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఈ మేరకు యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రెన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై జరిపిన చర్చల ఫలితంగా ఈ ఎంవోయూ కుదిరింది.
నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ భాగస్వామ్యంతో యూపీసీ వోల్ట్ సంస్థ ఆవిర్భవించింది. కాగా ఎంవోయూ ప్రకారం ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు దానికి అవసరమయ్యే విద్యుత్ కోసం 100 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును సంస్థ నెలకొల్పుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శంషాబాద్, గాగిల్లాపూర్‌లో ‘స్నైడర్’విస్తరణ
రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా’రూ.623 కోట్లతో శంషాబాద్, గాగిల్లాపూర్‌లో తమ యూనిట్లను విస్తరించనుంది. దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన భేటీలో ఆæ కంపెనీ సీఈవో దీపక్ శర్మ ఈ మేరకు ప్రకటన చేశారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. స్నైడర్ ఎలక్ట్రిక్‌కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి.
‘ఐనాక్స్’తో మంత్రుల భేటీ
తెలంగాణను కాలుష్య రహి త మహానగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌తో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశ మయ్యారు. సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు. ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ: సీఎం రేవంత్
కృత్రిమ మేధస్సు (ఏఐ)లో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా భవిష్యత్ తరాల కోసం నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. దావోస్ వేదికగా ప్రారంభించిన తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (టీఏఐహెచ్)కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జరిపిన చర్చల ఫలితంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు
కుదుర్చుకున్నాయి.
⇒ బ్రిటన్‌కు చెందిన విద్యా, పబ్లిíÙంగ్ సంస్థ పియర్సన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలో ఏర్పాటు కానున్న ‘గ్లోబల్ ఏఐ అకాడమీ’కి పియర్సన్ సహకారం అందిస్తుంది.
⇒ జార్జ్ టౌన్ యూనివర్సిటీకి చెందిన ‘ఏఐ కోల్యాబ్ సంస్థ’తో కుదిరిన మరో ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
⇒ దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్‌తో కుదిరిన ఎంఓయూ ద్వారా రాష్ట్రంలో స్టార్టప్‌ల అభివృద్ధికి అవకాశాలు అన్వేíÙంచనున్నారు.
గోద్రెజ్ చైర్మన్‌తో మంత్రులు భేటీ
గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌తో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దావోస్‌లో సమావేశమయ్యారు. ఆయిల్ పామ్ సాగులో ఏఐ సాంకేతికత వినియోగం, హైదరాబాద్‌లో ఉన్న గోద్రెజ్ క్రీమ్‌లైన్ డెయిరీ ప్లాంట్‌ను రూ.150 కోట్ల పెట్టుబడితో విస్తరించే అవకా శాలపై చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీ నివాస ప్రాంతంలో భారీ గృహ నిర్మాణాల ప్రాజెక్టులు చేపట్టే అంశంపైనా చర్చించారు. హైదరాబాద్‌ను సందర్శించాల్సిందిగా నాదిర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.


