breaking news
Data Center
-
సూటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఒక స్పష్టమైన తేడా ఉంది. చంద్రబాబు దాదాపు రోజు ఎక్కడో చోట ఉపన్యాసం ఇస్తుంటారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన అలవాటు అది. ఆయన ఏ ఆరోపణ అయినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేయగలరు. కాని జగన్ అందుకు పూర్తి భిన్నంగానే ఉంటారు. రోజూ మీడియాలో కనిపించాలన్న తాపత్రయం వైఎస్ జగన్‌కు ఉండదు. పక్షానికో, నెలకో మీడియాతో మాట్లాడినా లేదంటే ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆ సందర్భంగా ఏమి చెప్పదలిచినా అత్యధిక శాతం ఆధారాలతో సహా తన వాదన వినిపిస్తారు. జగన్ చెప్పే విషయాలను ఖండించలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఏవేవో ఇతర పిచ్చి విమర్శలు చేస్తుంటారు. మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇది గత ఏడాదిన్నరగా సాగుతున్న వ్యవహారమే!. కొద్ది రోజుల క్రితం జగన్ మీడియా సమావేశంపెట్టి కొన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. ఆ సందర్భంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన గూగుల్ డాటా సెంటర్.. దాని మూలం ఎక్కడ నుంచి వచ్చింది?.. తన హయాంలో వచ్చిన ఆదాని డేటా సెంటర్ కు దీనికి ఉన్న లింక్ ఏమిటి?.. విశాఖకు తన హయాంలో జరిగిన మంచి ఏమిటి?.. తదితర విషయాలపై సాక్ష్యాధారాలు చూపిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ డాటా సెంటర్ ను స్వాగతించిన తీరు ఆసక్తికరంగా ఉంది. దాని వల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందా? రాదా? అనేదానితో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా ఆయన స్వాగతించడం విశేషం. అదే సమయంలో.. తాను తీసుకు వచ్చిన అదాని డాటా సెంటర్‌కు కొనసాగింపే ఈ గూగుల్ డాటా సెంటర్ అని సశాస్త్రీయంగా రుజువు చేశారాయన. అక్టోబర్ మొదటివారంలో గూగుల్ సంస్థ ఎపి ప్రభుత్వ ఐటి కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ అదానీ సంస్థలకు భూములు కేటాయించాలని కోరిన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. అంతవరకు ఇదేదో గూగుల్ సంస్థ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నదని భ్రమించినవారికి నిజం ఏమిటో తెలిసినట్లైంది. అదానీ డాటా సెంటర్‌కు తన హయాంలో జీవో ఇచ్చి శంకుస్థాపన చేసిన వైనం, అలాగే సీ సబ్ కేబుల్ ను సింగపూర్ నుంచి తీసుకు రావడానికి ఆ దేశప్రభుత్వంతో తన హయాంలో జరిగిన సంప్రదింపుల లేఖలుమొదలైన వాటన్నింటిని ప్రజలకు చూపించారు. ఇప్పుడు రూ. 87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నది ఆ అదానీ గ్రూపేనని.. మొత్తం నిర్మాణం పూర్తి అయిన తర్వాత గూగుల్ దానిని లీజుకు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ..చంద్రబాబు మాత్రం అదానీ పట్ల కనీస కృతజ్ఞత చూపలేదని, అదానీ పేరు చెబితే తనకు(జగన్‌కు) ఎక్కడ పేరు వస్తుందోననే అలా చేశారని వివరించారు. నిజంగానే అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అదానీకి ప్రాదాన్యత ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్తపడడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ ను చంద్రబాబు, లోకేష్ లు సాదించారన్న ప్రచారం చేస్తున్న తరుణంలో దానిని జగన్ పటాపంచలు చేసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమి చేశారన్నదానితో సంబంధం లేకుండా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. విశాఖ డేటా సెంటర్ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఎక్కడా చంద్రబాబు, లోకేష్‌ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనించాల్సిన అంశం. ఇది ఆ ఇద్దరికీ నిరాశ కలిగించి ఉండొచ్చు. ఒక వేళ సుందర్ పిచాయ్ వీరికి నేరుగా లేఖ రాసి ఉంటే గనుక.. ఎల్లో మీడియా భూమ్యాకాశాలు దద్దరిల్లేలా హోరెత్తించి ఉండేవేమో!. ఇదే సందర్భంలో.. జగన్ చాలా స్పష్టంగా డాటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని, ఎకో సిస్టమ్ అభివృద్ది అవుతుందని, అందుకే ఆ సమయంలో తాము అదానీని డాటా సెంటర్‌తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, రీక్రియేషన్ సెంటర్ తదితర సంస్థలు ఏర్పాటు చేసి 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న షరతు పెట్టామని చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు. తన హయాంలో 300 మెగావాట్ల డాటా సెంటర్‌కు ప్లాన్ చేస్తే.. దాని కొనసాగింపుగా ఇప్పుడు వెయ్యి మెగావాట్ల సెంటర్ ను ప్లాన్ చేశారని వివరించారు. అలా డాటా సెంటర్ క్రెడిట్‌ను చంద్రబాబు చోరి చేశారని జగన్ ఎత్తిపొడిచారు. అయితే.. ఇప్పటిదాకా దీనికి నేరుగా ప్రభుత్వ పక్షాన ఎవరూ సమాధానం ఇవ్వలేకపోయారు!. జగన్ ఏదో ఈ డాటా సెంటర్‌కు అడ్డుపడుతున్నారన్న ప్రచారం చేయాలని తలపెట్టిన టీడీపీకి.. ఆ పార్టీ అనుకూల మీడియాకు ఇది పెద్ద ఎదురు దెబ్బ కూడా. దీనికి తోడు హైదరాబాద్ కు సంబందించి చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాన్ని కూడా ఆయన పూర్వపక్షం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం నుంచి హైదరాబాద్ తో చంద్రబాబుకు సంబందం ఎక్కడ ఉందని, ఈ కాలంలో జరిగిన అభివృద్దికి వైఎస్ఆర్, కేసీఆర్ కారణమని స్పష్టం చేశారు. అలాగే తొలుత నేదురుమల్లి జనార్దనరెడ్డి హయాంలో రాజీవవ్ గాంధీ సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేసిన ఫోటోను, తదుపరి ప్రైవేటు సంస్థ ద్వారా ఒక భవనం కట్టించి దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టి,మొత్తం నగరాన్ని తానే కట్టించానని బిల్డప్ ఇస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటిలో ఏ ఒక్కదానిని ఖండించలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు బృందానిదే అని చెప్పాలి. దానికి కారణం జగన్ ఏమి చెప్పినా సాక్ష్యాధారాలతో సహా మాట్లాడడమే. మరో వైపు మంత్రి లోకేష్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.86 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. జగన్ మాదిరి ఎక్కడా ఆధారాలు ప్రదర్శించలేదు. అందుకే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక వ్యాఖ్య చేశారు. గూగుల్ కంపెనీతో ఆ మేరకు ప్రకటన ఇప్పిస్తే తాము లోకేష్ కు సన్మానం చేస్తామని ప్రకటించారు. లోకేష్ సలహాదారులు ఎవరో కాని, బాగా అబద్దాలు చెప్పించారనిపిస్తుంది. దాని వల్ల ఆయన ప్రతిష్టకు నష్టం అని కూడా వారు భావించినట్లు లేదు. తీరా చూస్తే అసలు గూగుల్‌కు ప్రపంచం అంతా కలిపి 1.83 వేల మంది ఉద్యోగులు ఉంటే.. ఒక్క విశాఖ పట్నంలోనే అంతమంది ఎలా వస్తారన్న సింపుల్ కొశ్చెన్ కు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు. జగన్ టైంలో అదానీకి ప్రధానంగా భూమి మాత్రమే సమకూర్చితే.. ఇతర రాయితీలు భారీ ఎత్తున ఇవ్వలేదు. కాని చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 22వేల కోట్ల మేర రాయితీలు, అది కూడా కేవలం 200 ఉద్యోగాల కల్పించబోతున్న సంస్థకు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ సందర్భంలో ఎల్లోమీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేసే యత్నం చేసింది. విశాఖపై సాక్షి పత్రిక విషం చిమ్మిందని నీచమైన అసత్యాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళే యత్నం చేసింది. నిజానికి గతంలో జగన్ విశాఖకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ నగరంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎన్ని దారుణమైన కధనాలు రాసింది పాత పత్రికలు, అప్పటి వీడియోలు చూస్తే తెలుస్తుంది. అసలు అదానీకి మొత్తం కొండ అంతా రాసిచ్చేశారని డాటా సెంటర్ ఏర్పాటు నేపధ్యంలో విషం చిమ్మింది ఎల్లో మీడియా. అంతేకాదు.. ఆ రోజుల్లో విశాఖ వద్ద సముద్ర మట్టం పెరుగుతోందని, చాలా ప్రమాదాలు ఉన్నాయని కూడా ఆ సందర్భంలో అబద్దాలను సృష్టించి ప్రజలను భయపెట్టే యత్నం చేశారు. సముద్రం తీరాన భోగాపురం, మూల పేట వరకు రోడ్డు వేయాలని సంకల్పిస్తే.. ఇళ్లకు నష్టం జరుగుతుందని ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేశారు.ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారు. గూగుల్ డాటా సెంటర్ అనండి.. మరొకటనండి.. ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు. అలాగని, దానివల్ల వచ్చే సమస్యల గురించి ప్రశ్నించడం తప్పని కూటమి ప్రభుత్వం అంటున్నా.. ఎల్లో మీడియా ఏడుపు లంఖించుకున్నా.. అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కచ్చితంగా ఎలాంటి సందేహాలు ఉన్నా, నివృత్తి చేసి ముందుకు వెళితే మంచిదని చెప్పాలి. నకిలీ మద్యం మాఫియా, ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిన వైనం, పంటలకు గిట్టుబాటు దరలు లేక రైతులు పడుతున్న పాట్ల గురించి కూడా ఇలాగే ఆదారాలతో జగన్ ప్రసంగించారు. జగన్ వేసిన ప్రశ్నలకు జవాబు ఇచ్చే పరిస్తితి లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏదో విధంగా ఎదురుదాడి చేసి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకుంది. అదానీ డాటా సెంటర్ కు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలకు.. చంద్రబాబు లేదంటే లోకేష్‌లు నేరుగా పాయింట్ వైజ్ జవాబు ఇచ్చి ఉంటే అర్దవంతంగా ఉండేది. ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టే పాలన సామర్ధ్యంలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్ అని జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధవంతం అనిపిస్తాయి.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
Janatantram: క్రెడిట్ చోరీ.. డెబిట్ బదిలీ
-
క్రెడిట్ చోరీ... డెబిట్ బదిలీ!
నిజాలపై నివురు కప్పడం, అసత్యాలకు అలంకారం చేయడం ఇప్పుడొక రాజకీయ క్రీడ. ఇందులో చంద్రబాబు, ఆయన బృందం ఆరితేరిన ఆటగాళ్లని ప్రశస్తి. ఈ ఖ్యాతిలో సింహభాగం యెల్లో మీడియాకు దక్కుతుంది. ఈ మీడియా గత మూడు దశాబ్దాలుగా ఊదరగొట్టిన ఫలితంగా, తెలుగునాట ప్రత్యామ్నాయ మీడియా నిలబడకుండా చేసిన కుట్రల కారణంగా నిజంగానే చంద్రబాబును ఒక ఐటీ నిపుణుడిగా, దూరదృష్టి గల విజనరీగా నమ్మేవారి సంఖ్య గణనీయంగానే ఉన్నది. సాంఘిక శాస్త్రాల అధ్యయనానికి దూరమై ప్రాపగాండా ప్రవాహంలో కొట్టుకుపోయే నవతరంలో కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి.ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటో తెలిసిన వారు లేకపోలేదు. అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. కానీ నిజం నిద్ర లేచే సరికే అబద్ధం ఊరేగివస్తుందంటారు కదా! అదే జరుగుతున్నది. చంద్రబాబుకు విజనరీ వేషం వేయడానికి యెల్లో మీడియా పౌండ్రక వాసుదేవ పాత్రను కాపీకొట్టినట్టుంది. వసుదేవుని కుమారుడు గనుక శ్రీకృష్ణ పరమాత్మను వాసుదేవుడంటారు. ఆ వసుదేవునికి ఇంకో కొడుకుండేవాడట! ఆయనకు కొందరు ‘వాలతుల్యుల’తో కూడిన ఒక కోటరీ ఉండే దట! అసలైన వాసుదేవుడివి నువ్వేనంటూ ఈ కోటరీ ఉబ్బేయ డంతో ఆయన కూడా నెమలి పింఛం ధరించడం, పిల్లనగ్రోవి పట్టుకోవడం సహా కృష్ణ వేషధారణ వేయడం మొదలు పెట్టాడట! అంతటితో ఆగలేదు – తన వేషాన్ని వేసుకోవద్దని శ్రీకృష్ణుడినే బెదిరించేదాకా వెళ్లాడు.ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొన్నటి మీడియా సమావేశంలో ఇటువంటి పౌండ్రక వాసు దేవ ఇమేజ్‌నే చీల్చి చెండాడారు. నేటి తరం రాజకీయ నేతల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయన ప్రెస్మీట్లను గానీ, ఇతర కార్యక్రమాలను గానీ ఒక్క ‘సాక్షి’ యూ–ట్యూబ్ ప్లాట్‌ఫామ్ వీడియోల్లోనే 50 లక్షల మందికి పైగా వీక్షిస్తారు. ‘సాక్షి’ టీవీ, దాని డిజిటల్ ప్లాట్ ఫామ్లతోపాటు ఇతర దృశ్య మాధ్యమాలతో కలిపితే ఈ సంఖ్య ఒక్కరోజులోనే కోట్లలో ఉంటున్నది. దీనికి పత్రికా పాఠకులు, డిజిటల్ ఎడిషన్లలో చదివే వారి సంఖ్య తోడవుతుంది. ఆయన మెసేజ్‌లు ఈ స్థాయి విస్తృతికి చేరడమే కాదు, వాటికి విశ్వస నీయత కూడా ఎక్కువ. జగన్మోహన్రెడ్డి ప్రసంగాల్లో ఊకదంపుడు తక్కువ. సూటిగా తాను చెప్పదల్చుకున్న పాయింట్‌ను ప్రస్తావించడం, అందుకు సాక్ష్యంగా సాధికారికమైన లెక్కల్ని ఉటంకించడం, డాక్యుమెంట్లను ప్రదర్శించడం ఆయన అనుస రించే పద్ధతి. ఈ వైఖరి కారణంగా కూటమి సర్కార్ బండారాన్ని ఏడాదికాలంలోనే బట్టబయలు చేయగలిగారు.గురువారం జరిగిన మీడియా సమావేశంలో నాలుగు అంశాలపై జగన్ మాట్లాడారు. ముఖ్యంగా సర్కార్ ఆడుతున్న కల్తీ లిక్కర్ నాటకంపైనా, డేటా సెంటర్‌కు సంబంధించి చేస్తున్న క్రెడిట్ చౌర్యంపైనా సుదీర్ఘంగా మాట్లాడారు. ‘క్రెడిట్ చోరీ’ అనే మాటను కాయిన్ చేస్తూ, సైబర్ టవర్స్, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు దాకా హైదరాబాద్ నిర్మాతగా బాబు తగిలించుకున్న నకిలీ మెడల్స్‌ను పీకిపారేశారు. ఆరెకరాల స్థలంలో లక్షా నలభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ‘సైబర్ టవర్స్’కు ‘హైటెక్ సిటీ’ అని నామకరణం చేసి ప్రచారం చేసుకున్న వైనాన్ని ఆయన ఎండగట్టారు. ఆ భవనానికి కూడా అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించి, భూసేకరణతోపాటు తొలి దశ నిర్మాణం కూడా పూర్తిచేసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు, ఆయన హయాంలోనే ప్రారంభమై పూర్తిచేసుకొని వినియోగంలోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 12 కిలోమీటర్ల ‘పీవీ ఎక్స్ ప్రెస్ వే’లు హైదరాబాద్ నగరాభివృద్ధికి వన్నెలద్దిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెదిగే నాటికి రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.5,660 కోట్లు మాత్రమే. దేశంలో నాలుగో స్థానం. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల లోనే రాష్ట్రం రెండో స్థానానికి ఎగబాకింది. ఎగుమతుల విలువ రూ.32,500 కోట్లకు చేరింది. కేసీఆర్ పదేళ్ళ పాలన తర్వాత ఆ ఎగుమతులు రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయి. తాను న్యూయార్క్‌లో ఉన్నానా, హైదరాబాద్‌లో ఉన్నానా అని హీరో రజనీకాంత్‌కు ఆశ్చర్యం కలిగించిన దృశ్యాలన్నీ కేసీఆర్ కాలంలోనే ఆవిష్కృతమయ్యాయి. ఇలాంటి వాస్తవాలతో పొంతన లేకుండా వందిమాగధ మీడియా బృందంచే బాబు వేయించు కున్న వీరతాళ్ల బాగోతాన్ని జగన్ విప్పిచెప్పారు. అన్నిటికంటే ముఖ్యం – తాజా డోల్బాజా విశాఖ డేటా సెంటర్.ఈ డేటా సెంటర్ మీద టీడీపీ యెల్లో మీడియా సృష్టించిన సంరంభాన్ని, జగన్ మీడియా సమావేశానికి ముందూ, వెనకగా విభజించాలి. గురువారానికి ముందు ఆ సందడే వేరు! సాక్షాత్తూ గూగుల్ సంస్థే ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ చంద్రబాబు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సిద్ధమైందని ప్రచారం చేశారు. జరిగిన నేపథ్యాన్ని, అంతకుముందే పడిన పునాదిని మరుగునపెట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే హోరు. చంద్రబాబంటే డేటా సెంటర్లు, అమరా వతి నిర్మాణాలు – జగనంటే మటన్ షాపులు, చికెన్ సెంటర్లని ప్రచారం చేశారు. జగనంటే పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, అందరికీ ఆరోగ్యశ్రీ, ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్, 30 లక్షలమంది ఇళ్లు – ఇళ్ల స్థలాలు, అధికార వికేంద్రీకరణ, రైతు భరోసా కేంద్రాలు అనే విషయాన్ని జనం మరిచిపోయి ఉంటారని వారి నమ్మకం కావచ్చు. గురువారం నాటి జగన్ సమావేశం తర్వాత టీడీపీ నేతలు, యెల్లో మీడియాల సందడి తేలు కుట్టిన దొంగల చందంగా మారింది.ప్రతిపక్ష నేత వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నవంబర్లోనే విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. డేటా సెంటర్‌కు డేటా తీసుకురావడానికి వీలుగా సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవునా సబ్‌సీ (సముద్ర మార్గం) కేబుల్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 9నే లేఖ రాసింది. ఈ లేఖ కాపీని కూడా ఆయన విడుదల చేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్‌తో అదానీ సంస్థకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో అప్పుడే ప్రచురితమైన వార్తా కథనం కటింగ్‌ను జగన్ విడుదల చేశారు. అంటే మూడేళ్ళుగా ఈ రంగంలో అదానీ గ్రూప్, గూగుల్ కలిసి పనిచేస్తున్నాయి. 2023 మే నెలలో విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. అంతకుముందటి రెండేళ్ళలో ఎక్కువకాలం కోవిడ్ పరిస్థితులు న్నాయని గమనంలో ఉంచుకోవాలి.ఇప్పుడు కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకున్న వెయ్యి మెగావాట్ల గూగుల్ సెంటర్, 2023లో జగన్ శంకు స్థాపన చేసిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే! ఈ డేటా సెంటర్‌కు అవసరమైన సబ్ సీ కేబుల్, డేటా ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన పూర్వరంగం జగన్ హయాంలోనే సిద్ధమైంది. కేవలం డేటా సెంటర్ మాత్రమే అయితే ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండదు కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, పాతిక వేలమందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కార్ షరతు పెట్టింది. ఇప్పుడు ముందుకొచ్చిన విస్తరణలో అటువంటిదేమీ కనిపించలేదు. కేవలం డేటా సెంటర్ మాత్రమే. దాని ఏర్పాటుకు దోహదం చేసిన పూర్వరంగంలోని అదానీ– గూగుల్ గ్రూప్‌తో పాటు అప్పటి జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం పాత్రధారులే! పాత్రధారులందరినీ మరుగునపెట్టి, కేవలం గూగుల్కూ, చంద్రబాబుకూ మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా వచ్చిన కొత్త ప్రాజెక్టుగా కూటమి సర్కార్ ప్రచారం చేసుకున్న తీరును జగన్ ప్రశ్నించారు.‘క్రెడిట్ చోరీ’ అనే పదబంధం కొత్తది కావచ్చు కానీ, ఇతరుల క్రెడిట్‌ను చంద్రబాబు కోసం యెల్లో మీడియా కొట్టేస్తుందనే విషయం చాలాకాలంగా తెలిసిందే. ఈ విధానా నికి ఇంకో పార్శ్వం కూడా ఉన్నది. అదే డెబిట్ బదిలీ. తాము తప్పు చేస్తూ, ఆ తప్పును ప్రత్యర్థుల ఖాతాలో వేయడం! మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన నకిలీ లిక్కర్ తయారీ అంశం ఈ కోవలోనిదే. రాష్ట్రవ్యాప్తంగా ఒక పరిశ్రమ మాదిరిగా విరాజిల్లుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాన్ని ఫోటోలతో సహా ఆయన మీడియా ముందు బహిరంగపరిచారు. ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం, పర వాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరుల గురించే ఆయన ప్రస్తావించినప్పటికీ ఇటువంటి కార్ఖానాలు ఇంకా డజన్లకొద్దీ ఉన్నట్టు సమాచారం.నకిలీ మద్యం తయారీ – అమ్మకాలపై కూటమి ప్రభుత్వం ప్రారంభం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపి స్తున్నది. ఈ రంగంలో అనుభవం ఉన్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి పోటీకి నిలిపారు. ఈ కార్యక్రమంలో మరో ‘నిపుణుడు’ జనార్దన్‌రావు కూడా పాల్గొన్నట్టు వార్తలు, ఫోటోలు బయటకు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం షాపుల వ్యవస్థ ఈ నకిలీ మద్యం ప్రవాహానికి అనుకూలించదు. అందువల్ల దాన్ని రద్దు చేయాలి. మద్యం అలవాటును నియంత్రించే ఉద్దేశంతో జగన్ ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థను తొలగించారు. బెల్ట్‌షాపులను, పర్మిట్ రూములను పూర్తిగా తొలగించారు. లైసెన్స్డ్ మద్యం షాపులను కూడా కుదించి, ప్రభుత్వ రంగంలోనే నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు సాగించారు.సామాజిక ప్రయోజనాల రీత్యా, ఆరోగ్యాల రీత్యా కూడా అది మంచి వ్యవస్థ. దాన్ని తొలగించి ప్రైవేట్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాలంటే ఉన్న వ్యవస్థ మంచిది కాదని ప్రచారం చేయాలి. కూటమి సర్కార్ అదే పని చేసింది. వ్యాపారాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించి అమ్మకాలను ప్రోత్సహించినట్లయితే, బెల్ట్ షాపులకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చినట్లయితే, మద్యం తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా అనుమతులిచ్చి నట్లయితే అందులో స్కామ్ ఉండేందుకు అవకాశం ఉంటుంద నేది కామన్సెన్స్. ఇవేమీ లేని వ్యవస్థలో స్కామ్ జరిగిందనేది ఏడాది కాలంగా సర్కార్ చేస్తున్న న్యూసెన్స్. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి డైలీ సీరియల్ మాదిరిగా ఈ కేసును నడుపుతున్నారు. జగన్ హయాంలో స్కామ్ జరిగిందని నమ్మించడానికి అనేకమంది ముఖ్యనాయకులను, ప్రముఖ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా సరే, ఒకరిద్దరిని బెదిరించి తీసుకున్న వాఙ్మూలాల ఆధారంగా ఈ కేసు నడుస్తున్నది. ఈ దర్యాప్తు నిర్వా కాన్ని చూసి పలుమార్లు న్యాయస్థానం కూడా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అయితే అసలు ఉద్దేశం వేరు. ఈ కేసు పేరుతో రచించే బేతాళ కథలతో మీడియాను ముంచెత్తుతూ, నిశ్శబ్దంగా నకిలీ మద్యం వ్యాపారం – తయారీ రాష్ట్రమంతటా విస్తరించింది. కేవలం మూడువేల పైచిలుకు మద్యంషాపులు, అవి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగే వ్యవస్థ పాతది. ఇప్పుడు ప్రతి షాపుకూ ఓ బార్ లాంటి భారీ పర్మిట్ రూమ్ నడుస్తూ, అరవైవేల పైచిలుకు బెల్టు షాపుల్లో తాగిస్తున్నప్పుడు గతంతో పోలిస్తే అమ్మకాలు ఎన్ని రెట్లు పెరగాలి? కానీ, ఎక్సైజ్ ఆదా యాన్ని చూస్తే ఏటికేడు సహజంగా పెరగాల్సినంత కూడా పెరగడం లేదు. మరి ఇన్ని పర్మిట్ రూమ్లూ, బెల్ట్ షాపుల ద్వారా వస్తున్న రెండు మూడు రెట్ల ఆదాయం ఎక్కడికి పోతు న్నట్టు? ... నకిలీ మద్యం పాలవుతున్నట్టు లెక్క.ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం కార్ఖానాలు బయట పడకముందే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఏపీ సరిహద్దున ఉన్న మేళ్ళచెరువులో ఇటువంటి కార్ఖానా బయట పడింది. దర్యాప్తులో ఈ కార్ఖానాకు జనార్దన్‌రావుకు సంబంధా లున్నాయని వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. దుకాణా న్నయితే మూసేశారు కానీ, తెలంగాణ ఎక్సైజ్ సిబ్బంది ఇంకా ముందుకెళ్లి దర్యాప్తు చేయలేదు. జనార్దన్‌రావు పేరు బయటకు రాకుండా తెలంగాణ అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న ఆంధ్ర నేతలెవరు?... కనిపెట్టడం ఓ బ్రహ్మవిద్యేం కాదు గదా! రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బంధువైన చంద్రశేఖరనాయుడు ఎక్సైజ్ శాఖలో మాజీ అధికారి. జాయింట్ కమిషనర్‌గా పనిచేసి ఐదేళ్ల కిందనే రిటైరయ్యారు. అధికారికంగా ఆయన్ను ఈ ఫిబ్రవరి నెల నుంచి ఎక్సైజ్ శాఖలో ఓఎస్డీగా నియమించారు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీ లన్నింటినీ ఆయన అజమాయిషీలోకి తెచ్చారని సమాచారం. అనధికారికంగా అంతకుముందు నుంచే ఆయన ఈ పనుల్ని చక్కబెడుతున్నారని ఆ శాఖలో ఉన్న టాక్. నకిలీ మద్యం తయారీదారులు మందుబాబుల్ని బురిడీ కొట్టించడం కోసం అసలు బ్రాండ్లకు సంబంధించిన ఫ్లేవర్ వచ్చేలా ఎసెన్స్‌ను కొంత కలుపుతున్నారని తెలుస్తున్నది. ఈ ఎస్సెన్స్ ఆ బ్రాండ్ కంపెనీల వద్ద గానీ, దాన్ని లీజుకు తీసుకున్న డిస్టలరీల వద్దగానీ ఉంటుంది. మరి నకిలీ కార్ఖానాలకు ఎలా చేరుతున్నాయనేది రాజకోట రహస్యమే! ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంలో కూడా వైసీపీ వాళ్లను ఇరికించడమెలా అనే అంశంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరనే నానుడి ఏమవుతుందో చూద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఔను... లోకేష్ కు అంత సీన్ లేదు.. డేటా సెంటర్లు కావాలి.. డబ్బా సెంటర్లు కాదు
-
లోకేష్ గాలి తీసిన ఈనాడు
-
Big Question: నాన్నారు.. దొరికిపోయాం..!
-
‘అదానీ పేరు ఎందుకు చెప్పడం లేదు?’
విశాఖ: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వాస్తవాలు మాట్లాడతూ ఉంటే తట్టుకోలేక మంత్రుల పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ జగన్ పత్రికా సమావేశంతో ప్రజలకు వాస్తవాల తెలుస్తున్నాయన్నారు. గూగుల్‌ను స్వాగతిస్తున్నామని తాము చెప్పినప్పటికీ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసిందన్నారు గుడివాడ అమర్నాథ్. ‘ గూగుల్ - రైడెన్ సంస్థతో ఒప్పందంలో ఉద్యోగాల కోసం ప్రశ్నించాం. గూగుల్- అధాని డేటా సెంటర్ ఏర్పాటులో జరిగిన చర్చల కోసం వైఎస్ జగన్ వివరించారు. డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో అధాని పేరు ఎందుకు చెప్పడం లేదు. ఆధాని పేరు చెప్తే జగన్‌కు మంచి పేరు వస్తుందని వారి బాధ..లక్షా 80 వేల ఉద్యోగాలు ఎలా వస్తాయో క్లారిటీ ఇవ్వాలి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలి. ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాల కల్పన అవుతుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు. క్రెడిట్ కొట్టేయాలని తండ్రీ కొడుకులు చూస్తున్నారు. ఎల్లో మీడియా రోజూ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. సినిమా టైటిల్ వేరు ఎల్లో మీడియా స్టోరీ ఒక్కటే. చంద్రబాబు మొదలు పెట్టి.. పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి చూపించాలి. ఛాలెంజ్ చేస్తున్నా. భూమి సమీకరణ చెయ్యకుండా చంద్రబాబు దిగిపోయే ముందు భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేశారు. 2వేల 700 ఎకరాలకు 350 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంటే మేం మొత్తం భూమి సేకరణ పూర్తి చేసాం.. నాలుగు గ్రామాలను తరలించి, భోగాపురం ఎయిర్ పోర్ట్ స్థలానికి గోడ నిర్మించాం. ఏ చిక్కులూ లేకుండా.. Gmr కు స్థలం అప్పగించాం. రామాయపట్నం పోర్టును మేమే కట్టాం. ఏ పనీ చెయ్యకపోయినా శిలా ఫలకాలు వేసుకోవడంలో బాబు సిద్దహాస్తుడు. 21 సంవత్సరాల ముందే బాబుకి హైదరాబాద్ తో సంబంధం లేదు. బాబు, లోకేష్ యాడ్ ఏజెన్సీని నడుపుతున్నారు. జగన్ చేసిన మంచిని ఎలాగో చెప్పరు కనీసం అధాని పేరు అయినా చెప్పండి’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి;డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్ -
డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం: వైఎస్ జగన్
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్‌ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్‌గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్‌ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్త కాదని.. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏకంగా రూ.87 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నెలకొల్పుతున్న అదానీ పేరును గూగుల్‌తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు కనీసం ప్రస్తావించకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ దుయ్యబట్టారు. డేటా సెంటర్‌ను అదానీ సంస్థే నిర్మిస్తుందని.. ఆ సంస్థకు మూడు చోట్ల భూమిని అప్పగించాలంటూ ఈనెల 4న గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు రాసిన లేఖే నిదర్శనమంటూ.. వైఎస్ జగన్ ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్‌లో తమ ప్రభుత్వ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. డేటా సెంటర్‌కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని.. అందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ సైతం రాశామని పేర్కొంటూ ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. నోయిడాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందంటూ 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించిందని ఆ క్లిప్పింగ్‌ను చూపారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లకు సంబంధించి గూగుల్‌తో వ్యాపార అనుబంధం ఉన్న అదానీ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశామని.. అందుకోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించామని గుర్తు చేశారు. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ను విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో క్రెడిట్ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, సింగపూర్, కేంద్ర ప్రభుత్వానికి, అదానీకి దక్కుతుందని తేల్చి చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన యాడ్ ఏజెన్సీ తరహాలో నడుస్తోందని తూర్పారబట్టారు. సీఎం చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. అదానీ ప్రాజెక్టుకు గూగుల్ విస్తరణ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి.. వీరందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆరోజు వేసిన విత్తనమే ఈ రోజు డేటా సెంటర్ కొనసాగింపు! గూగుల్ నెలకొల్పే 1,000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. గూగుల్, అదానీ ఎంటర్ప్రైజెస్ మధ్య డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార సంబంధాలపై 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా (క్లిప్ ప్రదర్శించారు) కథనం కూడా ప్రచురించింది. నోయిడాలోని అదానీ డేటా సెంటర్లో 4.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గూగుల్ లీజుకు తీసుకుందన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఇక్కడ (విశాఖలో) 2023 మే 3న అదానీ డేటా సెంటర్‌కు పునాది వేశాం. సింగపూర్ నుంచి సబ్ సీ కేబుల్‌కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే.. అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్‌లో జీవో ఇచ్చాం. ఆ వెంటనే 2021 మార్చి 9న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలో మీటర్ల మేర సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో కోరాం. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. డేటా సెంటర్ నిర్మించేది అదానీ సంస్థే.. విశాఖలో కూడా అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నాయి. ఈ మేరకు గూగుల్‌కు చెందిన అలెగ్జాండర్ స్మిత్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు అండ్ కో ఇటీవల ఢిల్లీ వెళ్లి హడావుడి చేయకముందే.. సంతకాలు చేయకముందే.. 2025 అక్టోబర్ 4న అదానీ ఇన్ఫ్రాకు చెందిన మూడు కంపెనీలకు భూమి కేటాయింపులు చేయాలని గూగుల్ సంస్థ ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌ను లేఖలో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.87 వేల కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్‌ను తీసుకొచ్చేందుకు.. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్‌గా వాడుకుంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు.. సబ్ సీ కేబుల్ రావాలి.. డేటా సెంటర్ కట్టాలి.. అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తోంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. రూ.87 వేల కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్‌ను తెస్తున్నారని అదానీకి థ్యాంక్యూ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? ఎందుకు భయపడుతున్నారు? ఆ పేర్లు చెప్పడం మొదలు పెడితే.. బ్యాక్‌గ్రౌండ్‌లో వైఎస్సార్సీపీ వస్తుంది కాబట్టి. వైఎస్సార్సీపీ హయాంలో 300 మెగావాట్ల డేటా సెంటర్‌కు బీజం పడినప్పుడే.. గూగుల్, అదానీకి డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి వ్యాపార సంబంధం ఉంది. కేంద్రం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ తెచ్చే కార్యక్రమానికి బీజం పడిందని చెప్పటానికి చంద్రబాబు సంశయించారు. క్రెడిట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. బాబు ముఖారవిందాన్ని చూసి వచ్చేసినట్లు బిల్డప్.. డేటా సెంటర్లో అతి ముఖ్యమైన విషయం.. సింగపూర్, విశాఖ మధ్య సబ్ సీ కేబుల్ (సముద్ర గర్భంలో కేబుల్ వ్యవస్థ) 3,900 కిలోమీటర్ల మేర నిర్మాణం. అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ వ్యవస్థను తీసుకుని రావాలని అప్పట్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, కేంద్రం, సింగపూర్ ప్రభుత్వం సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చి తన సుందర ముఖారవిందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. మిగిలిన వాళ్లందరి కృషిని సైడ్ లైన్ చేసేశారు. రూ.87 వేల కోట్లు పెడుతున్న అదానీ.. గూగుల్– రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో కనీసం కనిపించలేదు. 190 ఎకరాలు కేటాయింపు.. వైఎస్సార్సీపీ హయాంలోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 190 ఎకరాలు విశాఖలో కేటాయించాం. మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో 60 ఎకరాలు ఇచ్చాం. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్‌ను సింగపూర్ నుంచి విశాఖపట్నానికి తీసుకురావడానికి అంకురార్పణ చేశాం. ఇవాళ కొత్తగా వస్తున్న 1,000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు.. నాడు 300 మెగావాట్ల ప్రాజెక్టు ఇవ్వడమే కీలకంగా మారింది. ఏఐ భవిష్యత్తులో ప్రపంచాన్ని డామినేట్ చేసే టెక్నాలజీ. ఏఐ అయినా, క్వాంటం కంప్యూటింగ్ అయినా.. భవిష్యత్తులో గొప్ప మార్పులకు డేటా సెంటర్ నోడల్ పాయింట్‌గా ఉంటుంది. డేటా సెంటర్‌తో ఉద్యోగాలు తక్కువే అయినా.. ఎకో సిస్టమ్ తయారవుతుంది. తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయి. కాబట్టి వీటికి మా ప్రభుత్వంలోనే నాంది పలికాం. కేవలం 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి అంతటితో మేం ఆగలేదు. ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో 25 వేల ఉద్యోగాలు కల్పించాలని కోరాం. ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా ఉద్యోగాలు తీసుకొచ్చేలా ఒప్పందంలో పెట్టాం. క్రెడిట్ చోరీల్లో బాబు పీక్..! చంద్రబాబుకు క్రెడిట్ చోరీ చేయడం కొత్తకాదు. హైదరాబాద్ విషయంలోనూ చంద్రబాబుది సేమ్ స్టోరీ. మాదాపూర్‌లో సైబర్ టవర్స్.. ఆరు ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు. దానిపేరు హైటెక్ సిటీ. నిజానికి అక్కడ ఐటీ స్పేస్ కట్టడానికి అప్పటి సీఎం ఎన్.జనార్థన్‌రెడ్డి పునాది వేశారు. చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దాన్ని చేపట్టేందుకు నాడు జనార్దన్‌రెడ్డి శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు. దాంతో హైదరాబాద్ మొత్తం నేనే కట్టానని బిల్డప్ ఇస్తున్నారు. ⇒ 2004లో చంద్రబాబు ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ ఆయన చేతుల్లో లేదు. 2004, 2009లో వైఎస్సార్ గెలిచారు. తర్వాత మరో రెండు సార్లు కేసీఆర్ గెలిచారు. ఏకంగా 20 ఏళ్లపాటు చంద్రబాబుకి, హైదరాబాద్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా తనదే అంటారు. ఇదీ చంద్రబాబు బిల్డప్. ⇒ అయ్యా చంద్రబాబూ.. ఆరు ఎకరాల్లో 1.40 లక్షల చదరపు అడుగుల్లో చిన్న బిల్డింగ్ కడితే.. హైటెక్ సిటీ అని పేరు పెడితే.. దానితోనే అభివృద్ధి చెందింది అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్లిపోయావు. 2004లో రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ ఫేజ్–1ను 126 కి.మీ. ప్రాజెక్టును 2006లో ప్రారంభించి 2012లో పూర్తిచేశారు. అది హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చేసింది. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే 11.6 కి.మీ. ఫ్లైఓవర్.. దేశంలోనే అతి పొడవైనది. దీనిని అక్టోబర్ 2005లో ప్రారంభించి 2009 అక్టోబర్ 19న పూర్తి చేశారు. ⇒ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మార్చి 2005లో ప్రారంభిస్తే 23 మార్చి 2008లో పూర్తి చేశారు. ఇవన్నీ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించి పూర్తి చేసినవే. ⇒ చంద్రబాబు దిగిపోయే నాటికి 2003–04లో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ, అనుబంధ ఎక్స్‌పోర్ట్స్ రూ.5,660 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీఎం అయ్యాక 2004–09లో ఐటీ, అనుబంధ రంగాల ఎగుమతులు రూ.32,509 కోట్లకు చేరాయి. ఆయన అవన్నీ పూర్తి చేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతోనే ఇదంతా జరిగింది. ⇒ వైఎస్సార్ రెండో సారి గెలిచి సీఎం అయిన కొద్ది నెలలకే చనిపోయినా.. ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం కొనసాగింపులో భాగంగా 2013–14లో ఐటీ ఎక్స్‌పోర్టులు రూ.57 వేల కోట్లకు చేరాయి. కానీ, చంద్రబాబు హైదరాబాద్‌ను నేనే కట్టేశా... ఐటీ అంటే నేనే అని చెప్పుకుంటున్న పరిస్థితి..! ఈ వ్యత్యాసం చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నాన్న తర్వాత కేసీఆర్ రెండు టెర్మ్‌లు పాలించారు. ఆయన కూడా గొప్పగా వైఎస్సార్ ఆపిన దగ్గర నుంచి ప్రారంభించి గొప్పగా పాలించారు. తద్వారా హైదరాబాద్ ఐటీలో టాప్‌లోకి వెళ్లింది. ⇒ చంద్రబాబు హయాంలో రూ.5,660 కోట్లు దగ్గర నుంచి.. ఈరోజు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లకు చేరాయి. 20 ఏళ్లలో ఇంత జరిగితే.. మొత్తం హైదరాబాద్ నేనే కట్టా అంటే ఎలా? చంద్రబాబుకు ఇది కొత్తకాదు. పబ్లిసిటీ స్టంట్స్ చేస్తారు. వేరేవాళ్లకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్లకు ఇవ్వకపోవడం చంద్రబాబుకు ఉన్న దుర్మార్గపు నైజం.అభివృద్ధికి విజన్ ఉండాలి.. మా హయాంలో అదానీ డేటా సెంటర్ తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, రిషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్.. ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు. విశాఖపట్నం నుంచి ఎయిర్ పోర్టుతో పాటు మూలపేట పోర్టుకు అనుసంధానిస్తూ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఈ కారిడార్ ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి మరీ స్టేట్మెంట్ ఇప్పించాం. అదీ విజన్ అంటే. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది. నంబర్స్ కనిపిస్తాయి. మా హయాంలో దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో రెండేళ్లు కోవిడ్ ఉన్నా గొప్పగా అభివృద్ధి, సేవలందించాం. గొప్ప సంస్కరణలకు శ్రీకారం.. మా హయాంలో నాడు–నేడు ద్వారా స్కూళ్లు మార్చాం. డిజిటల్ క్లాస్ రూమ్స్, టోఫెల్ క్లాస్‌లు, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, సీబీఎస్ఈ కాదు ఐబీ సిలబస్ తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్య, వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తెచ్చాం. గ్రామాల్లో పౌర సేవలను గడప వద్దకు తీసుకువచ్చాం. గవర్నమెంట్ సేవల్లో పారదర్శకత ఉండదనే భావన లేకుండా చేశాం. ప్రభుత్వ సేవలు లంచాలు లేకుండా పొందగలమనే అభిప్రాయం ప్రజల్లో స్వచ్ఛందంగా నిరూపించగలిగాం. గొప్ప సంస్కరణలు తీసుకువచ్చాం. అందుకే సంతోషంగా, గర్వంగా ఉన్నాం. మూడేళ్లలో ఎవరూ చేయలేని గొప్ప కార్యక్రమాలు చేయగలిగాం. అందుకే ఇప్పటికీ చిరునవ్వుతో మా పార్టీ క్యాడర్ ఏ గడప వద్దకు అయినా వెళ్లగలుగుతున్నారు. మహిళా సాధికారత, సంస్కరణలు మాకు శ్రీరామ రక్ష. అందుకే ప్రజలను మమ్మల్ని ఇప్పటికీ ఆత్మీయంగా ఆదరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖను నిలబెట్టాలని..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ కీలక కేంద్రం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను తలదన్నే రీతిలో ఏపీ ఉండాలంటే విశాఖను అభివృద్ధి చేయాలని తలపెట్టాం. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం. అందులో భాగంగా 2,700 ఎకరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశాం. భూ సేకరణకు, ఆర్‌అండ్‌ఆర్‌కు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. గతంలో చంద్రబాబు ఈ ఎయిర్‌పోర్టుకు కేవలం 377 ఎకరాలు మాత్రమే భూమిని సేకరించారు. వైఎస్సార్ సీపీ హయాంలో వేగంగా చర్యలు చేపట్టి 30 శాతం పనులు పూర్తి చేశాం. మరో ఏడాదికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. అంతే కాదు.. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు ద్వారా ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చే ప్రయత్నం చేశాం. భూ సేకరణతో పాటు అన్ని అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించి 30 శాతం పనులు పూర్తి చేశాం. విజయనగరంలో మెడికల్ కాలేజీ కడితే 3 బ్యాచ్‌లు క్లాసులు, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.600 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ రోగులకు శాశ్వత పరిష్కారం చూపించాం. ⇒ సీతంపేట, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు దాదాపు పూర్తి చేశాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్తయ్యే దశలో ఉన్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. నక్కపల్లిలో ఇండ్రస్టియల్ హబ్, అన్నవరంలో ఒబెరాయ్ హోటల్ రిసార్ట్ తీసుకొచ్చాం. డెస్టినేషన్‌గా విశాఖపట్నం ఉండాలంటే 5 స్టార్ హోటళ్లు కాదు.. ఏకంగా ఫైవ్ స్టార్ రిసార్టులు ఉండాలని సంకల్పించాం. ⇒ రుషికొండ హై ఎండ్ టూరిజం రిసార్ట్ నిర్మించాం. అదొక మాన్యుమెంట్ బిల్డింగ్. అమరావతిలో చదరపు అడుగకు రూ.10 వేలు పెట్టి.. కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు కడతారో అర్థం కాదు. అదే సెక్రటేరియట్ రెండుసార్లు కడతారు.. అదే అసెంబ్లీ రెండు సార్లు కడతారు. డబ్బులు వృథా చేస్తుంటే ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే.. ఎల్లో మీడియా మొత్తం వాళ్లే. అంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం! బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో సైతం ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.4500 దాటదు. కానీ అమరావతిలో రూ.10 వేలు పెట్టి కడుతున్నారు. ఎవడూ స్కామ్ అనడు. ఎందుకంటే స్కాములో వీళ్లంతా భాగస్వాములే.అదానీ డేటా సెంటర్‌కు కొనసాగింపే గూగుల్‘‘డేటా సెంటర్‌ను మేం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మద్దతు ఇస్తున్నాం. మేం విత్తనం వేశాం కాబట్టే డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. అదానీ డేటా సెంటర్‌కు కొనసాగింపే గూగుల్ డేటా సెంటర్. ప్రస్తుతం మనం ఏఐ యుగం, క్వాంటం కంప్యూటింగ్ యుగాల్లోకి పోతున్నాం. వీటన్నింటికీ హబ్ అనేది డేటా సెంటర్. డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. పవర్ రిక్వైర్మెంట్, వాటర్ గజిలింగ్ (ఎక్కువ విద్యుత్, ఎక్కువ నీటి వినియోగం) లాంటి కొన్ని సమస్యలు వచ్చినా సర్టైన్ కెపాసిటీ బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటి దాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. డేటా సెంటర్‌తోపాటు ఐటీ స్పేస్ కూడా కట్టాలి.. తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని మేం ఒప్పందంలో పెట్టగలిగాం. నిర్దేశించిన సమయంలోగా ఇవన్నీ కట్టాలి, రావాలి అని ఒప్పందంలో పొందుపరిచాం. ఇది వీళ్లు చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఎకో సిస్టమ్ అనేది వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది’ అని వైఎస్ జగన్ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. -
Google Data Center: క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యాడ్ ఏజెన్సీలా నడిపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాం. రాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయింది. ఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్ర పరిస్థితి వీక్. వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్‌ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు.ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది. వైఎస్సార్సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. వైజాగ్‌లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయి. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు.అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్‌కి రాబోతోంది. వైఎస్సార్సీపీ వేసిన విత్తనమే ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. వైజాగ్‌లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు. చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. వైఎస్సార్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు’ అని తెలిపారు. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్.. గూగుల్ డేటా సెంటర్‌ను నిర్మించేది అదానీనే. జగన్ సర్కార్ వల్లే డేటా సెంటర్ వచ్చిందని చెప్పలేకపోయారు.క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. బాబును చూసి గూగుల్ వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. డేటా సెంటర్‌తో ఉద్యోగాలు పెద్దగా రావు. కానీ, ఎకో సిస్టమ్ బిల్డు అవుతుంది. భవిష్యత్‌లో పెద్ద మార్పులకు డేటా సెంటర్ కీలకం. డేటా సెంటర్‌తో పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి.. ఐటీ పార్క్, రిక్రేయేషన్, స్కిల్ సెంటర్ పెట్టాలని ఆలోచన చేశాం. 25వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం కూడా చేశాం. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అని సెటైర్లు వేశారు. -
పవన్ శవ రాజకీయాలు..! బాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుస్సు
-
లోకేష్ నోటి దూలకు.. భగ్గుమన్న బెంగళూరు
-
Big Question: డేటా సెంటర్ వెనుక బాబు భారీ వ్యూహం! అసలు నిజాలు ఇవే
-
Big Question: సాక్షి డిబేట్ కు ఉలిక్కిపడ్డ లోకేష్.. నిజం తెలిసిపోయిందని భయం
-
KSR Live Show: ప్రైవేటుకు దోచిపెట్టడమే.. ఇదే బాబు విజన్!
-
చారాణా కోడికి బారాణా మసాలా
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడికి మించిన బ్రాండే లేదంటారు ఆయన కుమారుడు, టీడీపీ నేతలు. బాగానే ఉంది కానీ.. ఈ బ్రాండ్ విలువ కాస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత పేదలను చేస్తేనే వస్తుంది తంటా. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వివరాలు తెలిస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. కేవలం రెండు వందల మందికి ఉద్యోగాలిచ్చే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకాఎకిన రూ.22 వేల కోట్ల రాయితీలు కల్పిస్తోంది మరి. చారాణా కోడికి బారా అణా మసాలా అన్నమాట!ఇంతటి భారీ రాయితీల వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పటికే విస్పష్టంగా చెప్పేశారు కూడా. కానీ యథావిధిగా ఏపీ మంత్రివర్యులు లోకేశ్ ఆ మాటలను ఖండించేశారు. కడుపుమంట అన్నట్టుగానూ మాట్లాడారు. ఇలా కాకుండా భారీ రాయితీలతో ఆర్థిక నష్టం ఉండదన్న విషయాన్ని వివరించి ఉంటే బాగుండేదేమో. ఐటీ ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు భారీ ఎత్తున వెళుతున్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్నది పలువురి అభిప్రాయం.గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం ఎల్లో మీడియా దీనిపై పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. రైడెన్ ఇన్ఫోటెక్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీంతో రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగం గతి మారిపోతుందన్నది దీని సారాంశం. దీంతోపాటే మరుసటి రోజు ఈనాడులో ఇంకో కథనం కూడా ప్రచురితమైంది. డేటా సెంటర్ ఏర్పాటకు గాన ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం రూ.22 వేల కోట్లు అని! కేబినెట్ ఆమోదం రోజున వెల్లడైన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో వచ్చే ఉద్యోగాల సంఖ్య 200 మాత్రమే.పెట్టుబడి మొత్తం ఒక్కో కోటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వవచ్చునన్నది సాధారణ అంచనా. ఈ లెక్కన డేటా సెంటర్‌తో 87 వేల ఉద్యోగాల సృష్టి జరగాలి. పరోక్షంగా ఉపాధి పొందేవారు దీనికి అదనం. కానీ ఇవేవీ జరుగుతున్నట్లు లేదు. అటు సీఎం చంద్రబాబు, ఇటు రైడెన్ సంస్థ ప్రతినిధులు కానీ ఉద్యోగాల సంఖ్య విషయంలో పెదవి విప్పలేదు. ప్రభుత్వ జీవోలోనూ స్పష్టత లేదు. ఈ విషయాన్ని కవర్ చేసుకునేందుకా అన్నట్టు ఎల్లోమీడియా తరువాతి రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల మంది వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని కాకిలెక్కలు కొన్ని ప్రచురించింది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల సంఖ్య 1.87 లక్షలైతే.. కొత్తగా ఏర్పాటయ్యే ఒక డేటా సెంటర్లోనే అంతమొత్తంలో ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది ప్రశ్న!ఎల్లో మీడియా బొంకులు అక్కడితో ఆగాయా? ఊహూ లేదు. డేటా సెంటర్ పెట్టుబడులన్నీ గూగుల్ పెడుతున్నట్టుగా రాశారు. వాస్తవానికి గూగుల్ అనుబంధం సంస్థ రైడెన్, అదానీ గ్రూపులు కలిసి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ కూడా భాగస్వామి అని తెలుస్తోంది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ కోసం 150 ఎకరాల భూమి కేటాయించారు. సీఎంగా ఆయన శంకుస్థాపన కూడా చేశారు.డేటా సెంటర్‌తోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని, 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న షరతులతో అదానీకి స్థలం కేటాయించడం గమనార్హం. ఈ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే అదాని కంపెనీకి రైడెన్, ఎయిర్‌టెల్‌లు తోడయ్యాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించిన తరువాతే రైడెన్ అదానీ కంపెనీతో జత కట్టడం గమనార్హం. ఈ డేటా సెంటర్లకు కావాల్సిన భారీ విద్యుత్తు, నీటి అవసరాలను తీర్చలేకపోవడం, డేటా సెంటర్లతో వచ్చే కాలుష్య సమస్యపై ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఎక్కడైనా పరిశ్రమ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి. కాని చంద్రబాబు ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే మరో పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఖర్చే మినహా పైసా ఆదాయం ఉండదని స్పష్టమవుతోంది. లక్షల కోట్ల టర్నోవర్, వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన స్థోమత ఉన్న కంపెనీలకు మళ్లీ అంతే స్థాయిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందా? అన్నది ప్రశ్న. అసలు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఇన్ని రాయితీలు ఎలా కోరుతోందో అర్థం కాదు. తాము పెట్టదలచిన మొత్తంలో 25 శాతం ముందుగానే గిట్టుబాటు చేసుకుంటున్నారన్న భావన రాదా? కంపెనీలను ఆకర్శించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదు కానీ.. ఒకపక్క వైద్య కళాశాలల నిర్మాణానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలకూ నిధుల్లేవంటున్న ప్రభుత్వం ఇలా కంపెనీలకు వేల వేల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? కొన్ని కంపెనీలకు భారీ రాయితీలు.. ఇంకొన్నింటికి కారుచౌకగా భూములు ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... భారతీ సిమెంట్స్ మైనింగ్ లీజులను కక్షపూరితంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తూండటం విమర్శలకు గురవుతోంది. అడక్కపోయినా టీసీఎస్ కంపెనీకి ఎకరాకు రూపాయి చొప్పున 22 ఎకరాల భూమి కేటాయించింది. కాగ్నిజెంట్, ఉర్సా కంపెనీలకూ ఇదే లెక్కన భూమి ఇస్తున్నామని అంటున్నారు.తాజాగా రైడెన్ కంపెనీకి 25 శాతం రాయితీతో 480 ఎకరాలు ఇస్తారట. స్టాంపు డ్యూటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయిస్తారు. కంపెనీ వారు ప్లాంట్, మెషినరీ కొనుగోలు ఖర్చులో పది శాతం రాయితీ అంటే రూ.2129 కోట్లు ప్రభుత్వం భరిస్తుందట. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తం కంపెనీకి తిరిగి చెల్లిస్తారు.దీని విలువ రూ.2245 కోట్లు. లీజులపై చెల్లించే జీఎస్టీ పదేళ్లపాటు చెల్లించే మరో రూ.1745 కోట్లు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఏపీ ప్రజలపై కొన్నివేల కోట్ల రూపాయల అదనపు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వం రైడెన్ కంపెనీకి మాత్రం యూనిట్‌కు రూపాయి రాయితీ ఇస్తోంఇ. తద్వారా కంపెనీకి పదేళ్లలో కలిగే లాభం రూ.4800 కోట్లు! సుంకాల్లో మినహాయింపులు మరో రూ.1200 కోట్లు. పంపిణీ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ ఛార్జీలు కలిపి మరో రూ.8500 కోట్లు ఉంటాయని లెక్క గడుతున్నారు.ఈ అంశాలపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేశారనుకోండి.. ఈనాడు వంటి సంస్థలు ఠకీమని అదంతా విష ప్రచారమన్న పాట అందుకుంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని గతంలో జగన్ అన్నప్పుడు ఇదే ఎల్లోమీడియా విశాఖకు వ్యతిరేకంగా బోలెడు కథనాలు వండి వార్చాయి. సముద్రం మట్టం పెరుగుతోందని, విశాఖకు ఏదో అవుతుందంటూ, ప్రజలను భయపెట్టేశారు. రిషి కొండపై నాలుగు ఆధునిక భవనాలు గత ప్రభుత్వం నిర్మిస్తే, పర్యావరణం నాశనం అయిపోయిందని, కొండకు గుండు కొట్టారంటూ తప్పుడు వార్తలు రాశారు. విష ప్రచారం అంటే అది! రిషికొండ భవనాలతోపాటు మరో తొమ్మిది ఎకరాల భూమిని ఇప్పుడు ప్రైవేటు వారికి ఇస్తుంటే మాత్రం వీరికి నోరు పెగలడం లేదు.డేటా సెంటర్ వల్ల ఉష్ణాగ్రత పెరుగుతుందని ఒప్పుకుంటూనే అది పెద్ద ఇబ్బంది కాదని సమర్థించుకున్నారు. ఇలా ఉంది వారి జర్నలిజం . మరో వైపు చక్కగా నడుస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న భారతి సిమెంట్, ఏసీసీ, రామకో సిమెంట్ కంపెనీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన సున్నపురాయి లీజులను రద్దు చేస్తారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధం ఉన్న భారతి సిమెంట్ కంపెనీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేస్తోందన్నది వాస్తవం. ఇది కదా నడుస్తున్న పరిశ్రమలకు తరిమివేసే ప్రయత్నం అంటే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.గూగుల్ డేటా సెంటర్ ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా ఏర్పాటైతే స్వాగతించాల్సిందే. కాకపోతే దాని వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేయడం అవసరం.అప్పులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏపీలో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థకు 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంలోని హేతుబద్దతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే ప్రజలలో అనుమానాలు బలపడతాయని గమనించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గూగుల్‌తో ఆ మాట చెప్పిస్తే సన్మానం చేస్తాం: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో గూగుల్ డాటా సెంటర్ రాకతో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం, దాని అనుకూల మీడియా.. సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రచారంపై క్లారిటీ ఇవ్వకపోగా.. గత వైఎస్సార్సీపీ పాలనపై, ఆ పార్టీ నేతలపై ఐటీ మంత్రి నారా లోకేష్ నిందలు వేస్తున్నారు. అయితే వాటికి మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ (Gudivada Amarnath on Google Data Center Jobs)ఇచ్చారు. శుక్రవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గూగుల్‌తో లక్షా 80 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదా. ఆ మాట గూగుల్‌తోనే చెప్పించండి. కనీసం ఆ సంస్థతో ఓ అధికారికి ప్రెస్‌నోట్ అయిన రిలీజ్ చేయించండి. అది నిజమని తెలిస్తే మేమే సన్మానం చేస్తాం.... గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం, ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోకేష్ మీడియా ముఖంగా ప్రజల అనుమానాలకు సమాధానం చెపుతారు అని భావించాను. కానీ ఆ డేటా సెంటర్‌ను మా పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిని స్వాగతిస్తున్నట్లు తొలిరోజే వైఎస్సార్సీపీ చెప్పింది. అయితే.. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయని, ఎంత రెవెన్యూ రాష్ట్రానికి వస్తుందని మాత్రం అడిగాం. అందులో తప్పేముంది?.... 1 గిగా వాట్ డేటా సెంటర్ ద్వారా గూగుల్ ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది?. గూగుల్ డేటా సెంటర్ వలన 200 మందికి ఉద్యోగాలు వస్తాయని ఈనాడు పేపర్ లో వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ లో ఉన్న ఉద్యోగులు 1.88 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో 1.88 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఆ రెండింటికీ చాలా తేడా ఉంది కదా. అయినా ఉద్యోగాల గురించి లోకేష్, టీడీపీ నేతలు కాదు చెప్పాల్సింది. ఆ మాట ఆ సంస్థ చెప్పాలి. అసలు గూగుల్‌తో సమాధానం చెప్పించడానికి ఐటీ మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి?. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నన్ను గుడ్డు అన్నా.. నేను లోకేష్‌ను పప్పు అన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు.ముందు ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి. మాయ మాటలతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేయొద్దు. కష్టపడి పోరాటం చేసి జగన్ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. ఎవరో డబ్బులు కడితే చదువుకోలేదు(లోకేష్‌ను ఉద్దేశించి..). విశాఖ నగరానికి ఏడాదికి ఐదు టీఎంసీల నీళ్లు అవసరం. గూగుల్ డేటా సెంటర్‌కు ఏడాదికి మూడు టీఎంసీల నీళ్లు అవసరం, ఎలా సర్దుబాటు చేస్తారు?. డేటా సెంటర్ వలన ఒకటి నుంచి రెండు సెంటిగేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మేధావులు చెబుతున్నారు. దాని మీద ఏమైనా స్టడీ చేశారా?. ఒక రోజు మొత్తానికి విశాఖ నగరంకు ఎంత కరెంట్ అవసరమో, గూగుల్ డేటా సెంటర్ కు ఒక గంటకు అంత కరెంట్ అవసరం అవుతుంది. రామాయపట్నం, బందరు మూలపేట, భోగాపురం ఎయిర్ పోర్టు, NTPC గ్రీన్ ఎనర్జీ దగ్గర నేను నిలబడి మా హయంలో వచ్చింది అని చెప్పగలను. నువ్వు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చావు నేను మంత్రి ఎన్ని పరిశ్రమలు తెచ్చావు కూర్చొని రాసుకుందాం రా?.. నారా లోకేష్ ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏం తెచ్చారు.. ఏ ప్రయోజనం చేకూర్చారు. నువ్వు మంత్రిగా ఏమి చేశావో చెప్పగలవా.. అమరావతి రోడ్లు తప్ప. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ భరించలేరు. వర్ధంతి జయంతికి తేడా తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతున్నారా?. ఆయనలా నేను ఎవరి దగ్గర స్క్రిప్ట్ తీసుకొని చదవను. ట్రోలింగ్‌కు జాతి పితా లోకేష్ అని ఎద్దేశా చేశారు. వ్యక్తిగత విమర్శలు ఇకనైనా మానుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ లోకేష్‌కు హితవు పలికారు. ఇదీ చదవండి: కల్తీ మద్యం కేసు.. కమీషన్ మాట్లాడుకుందామా? -
పబ్లిసిటీ మిస్సయ్యింది! ఇంత ఘోరం జరగటానికి జగన్ చేసిన తప్పు అదొక్కటే!
-
Big Question: సొమ్మొకడిది సోకొకడిది.. ఇది ఒక బ్రతుకేనా!
-
ఏపీలా చేస్తే రాష్ట్రం సర్వనాశనం
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు ఏపీ స్థాయిలో ప్రోత్సహకాలు ఇవ్వలేమని, అలా చేస్తే రాష్ట్రం ఆర్థికంగా సర్వ నాశనం అయిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే (Priyank Kharge) స్పష్టం చేశారు. బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్‌ను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ ప్రోత్సాహకాలను ఇచ్చిందన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెబుతున్నారే కానీ... అక్కడ అది ఏర్పాటు కావడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందనే విషయాన్ని ఎవరూ చెప్పటం లేదన్నారు. గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలను ఇచ్చిందని చెప్పారు. ఇవికాకుండా వాళ్లకు 25 శాతం తక్కువ ధరకు భూమిని కేటాయించిందని, స్టేట్ జీఎస్టీలో 100 శాతం మినహాయింపు, 100 శాతం ఉచితంగా ట్రాన్స్మిషన్, నీళ్ల టారిఫ్‌లో 25 శాతం డిస్కౌంట్ ఇచ్చిందన్నారు. ఈ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇచ్చే పరిస్థితి తమకు లేదని, ఒక వేళ ప్రకటిస్తే ఒక కంపెనీ కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వ నాశనం చేస్తారా అంటూ అందరూ నిలదీస్తారన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో బెంగళూరు నగరం ఐదవ స్థానంలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌తో నుంచి కూడా ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తున్నారని చెప్పారు. అందుకే బెంగళూరు నగరం ఓవర్ క్రౌడ్ అవుతోందని లోకేశ్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినా, ఏపీ ప్రజలు ఇక్కడికే వస్తారని.. ఎందుకంటే ఏఐలో నైపుణ్యం ఇక్కడే ఉందని చెప్పుకొచ్చారు. కాగా, ఖర్గే వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ‘ఎక్స్’ వేదికగా పరోక్షంగా స్పందించారు. ‘వారు ఆంధ్ర ఫుడ్ చాలా స్పైసీగా ఉందంటున్నారు. ఇప్పుడు పెట్టుబడులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మా పక్క వాళ్లు కొంత మంది ఆ మంటను ఫీల్ అవుతున్నారు’ అని పోస్ట్ చేశారు. -
హై‘పవర్’ డేటా సెంటర్స్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాష్ట్ర విద్యుత్ శాఖకు షాక్ ఇస్తోంది. అంచనాలకు మించిన విద్యుత్ డిమాండ్‌ను సృష్టిస్తుంది. అన్ని సాఫ్ట్వేర్ సంస్థలూ ఏఐతో కనెక్ట్ అవుతుండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డేటా కేంద్రాలు పెరుగుతున్నాయి. బిగ్ డేటా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నాయి. ఒక్కోటి 500 మెగావాట్ల కెపాసిటీ విద్యుత్‌ను ఉపయోగించే స్థాయిలో ఉంటాయని అంచనా. ఇది జెన్కోలో ఒక ప్లాంట్ సామర్థ్యంతో సమానం. ఇదే ఇప్పుడు విద్యుత్ శాఖకు గుబులు పుట్టిస్తోంది. అయితే, విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా చేయాలని విద్యుత్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏం చేద్దాం? రాష్ట్రంలో పీక్ సమయంలో 15497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. 2034 నాటికి ఇది 33773 మెగావాట్లకు చేరుతుందని అంచనా. డిమాండ్‌లో ప్రధాన భూమిక ఐటీ కేంద్రాలదే. ముఖ్యంగా డేటా కేంద్రాల వల్లే డిమాండ్ పెరిగే వీలుంది. విద్యుత్ లభ్యతను పెంచకపోతే ప్రతిపాదిత డేటా కేంద్రాలు వెనక్కుపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదేశించింది.కొత్తగా వచ్చి న యాదాద్రితో కలుపుకొంటే 5580 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాలున్నాయి. 70 శాతం లోడ్ ఫ్యాక్టర్‌తో పనిచేసినా ఇవి 109 మిలియన్ యూనిట్లు ఇవ్వగలవు. అయితే, బొగ్గు కొరత, తరచూ బ్యాక్‌డౌన్ కారణంగా గరిష్టంగా రోజుకు 60 మిలియన్ యూనిట్లే ఇస్తున్నాయి. పీక్ సమయంలో రాష్ట్రంలో రోజుకు 308 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటోంది. డేటా కేంద్రాల ఏర్పాటుతో డిమాండ్ రెట్టింపు అయితే రోజుకు 600 మిలియన్ యూనిట్లు కావాలి. ఈ నేపథ్యంలో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు జెన్కో మార్గాన్వేషణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం యాదాద్రి పవర్ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడం జెన్కోకు కీలకం. దీని సామర్థ్యం 4 వేల మెగావాట్లు. ఇక్కడ 55 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే తప్ప ముందుకెళ్లలేని పరిస్థితి. ఈ బొగ్గుపై సింగరేణి సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం 4 ర్యాకులతో బొగ్గు సరఫరా జరుగుతోంది. దీన్ని 14 రేకులకు పెంచాలి. దీంతో జెన్కో అధికారులు రైల్వే, సింగరేణితో భేటీకి సన్నద్ధమవుతున్నారు. కొనుగోలు తప్పదా? ప్రస్తుతం రోజుకు 300 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉంటేనే... మార్కెట్లో విద్యుత్ కొనాల్సి వస్తోంది. జెన్కో థర్మల్ 57, హైడల్ 25, సింగరేణి నుంచి 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుతోంది. రోజూ 149 మిలియన్ యూనిట్లు కేంద్ర సంస్థలు, మార్కెట్ నుంచి సమకూర్చుకుంటున్నారు. మధ్యా హ్నం యూనిట్ గరిష్టంగా రూ.2.5కు లభిస్తున్నా, రాత్రిపూట మాత్రం యూనిట్ రూ.8 వరకూ వెళ్తోంది. రాబోయే రోజుల్లో రోజుకు 600 ఎంయూ డిమాండ్ ఉంటే... ధర ఎంత ఉన్నా మార్కెట్ నుంచి భారీగా కొనుగోలుచేయాల్సి రావొచ్చు.డిమాండ్ అందుకుంటాం కేంద్ర విద్యుత్ సంస్థల అంచనాను మించి రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఐటీ కేంద్రాల్లో వస్తున్న మార్పులూ కారణమే. అయితే, డిమాండ్‌ను అందుకునేందుకు జెన్కో అన్నివిధాలా సిద్ధమతోంది. యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తాం. ఇతర ప్లాంట్లలోనూ ఉత్పత్తి పెంచుతాం. ఎంత డిమాండ్ పెరిగినా అందుకోగల సామర్థ్యం జెన్కోకు ఉంది. –ఎస్.హరీశ్, సీఎండీ, తెలంగాణ జెన్కో -
3 గిగావాట్లకు డేటా సెంటర్లు
ముంబై: దేశీయంగా డేటా సెంటర్ల రంగం భారీ స్థాయిలో విస్తరిస్తోంది. 2030 నాటికి ఏకంగా 3 గిగావాట్ల సామర్థ్యాన్ని సంతరించుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఎవెండస్ క్యాపిటల్ రూపొందించిన మల్టీ ఇయర్ గ్రోత్ ప్రాక్సీ ఆన్ ఇండియాస్ డేటా ఎక్స్ప్లోజన్ అండ్ లోకలైజేషన్ వేవ్ పేరిట ఎవెండస్ క్యాపిటల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024లో దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.1 గిగావాట్లుగా ఉంది. డేటా, ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం, డేటా లోకలైజేషన్ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్న పాలసీపరమైన చర్యలు లాంటి అంశాలు డేటా సెంటర్లకు కీలక చోదకాలుగా ఉండనున్నాయి. దీనితో 2033 నాటికి డిమాండ్ 6 గిగావాట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అయితే, సరఫరా మాత్రం 4.5 గిగావాట్ల స్థాయికే పరిమితం కానుంది. దీంతో 1.5 గిగావాట్ల మేర డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం ఏర్పడనుంది. లార్జ్ ఫార్మాట్, హైపర్‌స్కేల్ రెడీ మౌలిక సదుపాయాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తక్కువ లేటెన్సీతో వర్క్‌లోడ్ భారాన్ని భరించగలిగే ఎడ్జ్–రెడీ సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా ఈ డిమాండ్‌ను తీర్చే అవకాశం ఉంది. దీంతో ఈ పరిశ్రమ వార్షికంగా 25–30 శాతం మేర వృద్ధి నమోదు చేయనుంది. భారీగా పెట్టుబడులు.. డేటా సెంటర్ల వృద్ధికి అపార అవకాశాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిశ్రమలోకి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 1–1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 12,870 కోట్లు) స్థాయిలో వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులు రెట్టింపు కానున్నాయి. వివిధ రాష్ట్రాలు సబ్సిడీ రేటుకు స్థలాన్ని, విద్యుత్తును తక్కువ రేటుకు అందిస్తుండటం వంటి అంశాలు దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి. ఇప్పటికే ఎస్టీటీ జీడీసీ, సిఫీలాంటి దిగ్గజాలుఈ రంగంలో స్థానాన్ని పటిష్టం చేసుకోగా, పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చే దిశగా మరిన్ని కొత్త సంస్థలు కూడా వస్తున్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్కి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ సంస్థ అనంత్ రాజ్ భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. 2031–32 నాటికి నిర్వహణ సామర్థ్యాలను 307 మెగావాట్లకు పెంచుకునేందుకు 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 18,000 కోట్లు) వెచ్చించనుంది. 2025–26లో డేటా సెంటర్ సామర్థ్యం 28 మెగావాట్లుగా ఉండనుంది. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ విధానాల తోడ్పాటు, విద్యుత్ లభ్యత, కనెక్టివిటీ మొదలైన అంశాలన్నీ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ క్లయింట్ల నుంచి ఎంటర్ప్రైజ్, హైపర్‌స్కేలర్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లాంటి వాటికి పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చేందుకు పరిశ్రమ సన్నద్ధంగా ఉందని అనంత్ రాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ సరీన్ తెలిపారు. -
డేటా సెంటర్ల బూమ్..
న్యూఢిల్లీ: దేశీ డేటా సెంటర్ (డీసీ) పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20–25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. దీనితో సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించే రియల్ ఎస్టేట్ కూడా మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 15.9 మిలియన్ చ.అ.లుగా ఉన్న స్పేస్ 2030 నాటికి 55 మిలియన్ చ.అ.లకు చేరనుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటం తదితర అంశాల దన్నుతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయి. 2018లో 307మెగావాట్లుగా ఉన్న డీసీల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి, అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26 గిగావాట్లకు చేరింది. పరివర్తన దశలో పరిశ్రమ.. ప్రస్తుతం పరిశ్రమ పరివర్తన దశలో ఉందని నిపుణులు తెలిపారు. మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తోందని వివరించారు. డీసీల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం ఉంటోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్సీఆర్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్లు కలిసి గత 6–7 ఏళ్లలో డేటా సెంటర్ రియల్ ఎస్టేట్ మూడు రెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. ‘‘తక్కువ లేటెన్సీ, రియల్ టైమ్ అనాలిసిస్, మెరుగైన యాప్‌ల పనితీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు తమను తాము మల్చుకోవాల్సి వస్తుండటం తదితర అవసరాలరీత్యా డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తున్నాయి’’ అని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 2030 నాటికి డీసీల కెపాసిటీ 4.5 గిగావాట్లకు ఎగియడానికి కూడా ఇదే దోహదపడుతుందని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్, 3 గిగావాట్ల విద్యుత్ మిగులులాంటివి చౌకగా హోస్టింగ్ సేవలు అందించడంలో భారత్‌కు సానుకూలాంశాలని క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ వర్గాలు తెలిపాయి. అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని వివరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం క్యాపిటలాండ్ మొత్తం మీద 1.15 బిలియన్ సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తోంది. 2020 నుంచి పెట్టుబడుల ప్రవాహం.. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. 2020 నుంచి 14.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా 2030 నాటికి మరో 20–25 బిలియన్ డాలర్లు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ లేటెన్సీ, అత్యుత్తమ పనితీరు కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సీడీఎన్) సేవల సంస్థల నుంచి డిమాండ్ నెలకొన్నట్లు నె్రక్ట్‌సా బై ఎయిర్టెల్ సీఈవో ఆశీశ్ ఆరోరా తెలిపారు. ఈ సంస్థ 65 పైగా నగరాల్లో 120 ఎడ్జ్ డేటా సెంటర్లు, 14 హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాము ప్రాంతీయంగా చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని ఆరోరా వివరించారు. విజయవాడ, అగర్తలా, పాటా్న, గువాహటి, సంబల్పూర్, గంగాగంజ్‌లాంటి కీలక నగరాల్లో తమ ఎడ్జ్ సెంటర్లను విస్తరించినట్లు వివరించారు. వీటితో మెట్రోల వెలుపల తృతీయ శ్రేణి నగరాల్లోని యూజర్లకు కూడా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయని, లైవ్.. హై–డెఫినిషన్ స్ట్రీమింగ్కి సంబంధించి లేటెన్సీ.. బ్యాండ్‌విడ్త్ వ్యయాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. డీసీల విభాగంలో కొత్త పరిణామాలు చూస్తే అదానీకనెక్స్ సంస్థ చెన్నైలో 100 మెగావాట్ల క్యాంపస్‌ను, నోయిడాలో 50 మెగావాట్ల సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. మరిన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో ఉన్న యోటా డీ1తో పాటు హైపర్‌స్కేల్ క్యాంపస్‌ల విస్తరణపై యోటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 39,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ తమ నవీ ముంబై సెంటర్‌పై రూ. 1,940 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఎస్టీటీ జీడీసీ ఇండియా, ఎన్టీటీ గ్లోబల్ తదితర సంస్థలు హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త హైపర్‌స్కేల్ సెంటర్స్‌తో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.హైదరాబాద్, ముంబై సారథ్యం.. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో భారత్‌లో కొత్తగా 859 మెగావాట్ల డీసీ సామర్థ్యాలు జతయ్యాయి. ఇందులో ముంబై వాటా 44 శాతంగా, చైన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ వాటా సంయుక్తంగా 42 శాతంగా ఉంది. 2023 నుంచి అయిదేళ్ల వ్యవధిలో కొత్తగా 3 – 3.7 గిగావాట్ల కొత్త సామర్థ్యాలు జత కానున్నాయి. చెరి 1–1.2 గిగావాట్ల సామర్థ్యాలతో హైదరాబాద్, ముంబై ఇందుకు సారథ్యం వహించనున్నాయి. హైదరాబాద్ వర్ధమాన హైపర్‌స్కేల్ హబ్‌గా ఎదుగుతోంది. పుణె 300–450 మెగావాట్లు, చెన్నై 400–450 మెగావాట్ల కొత్తగా సామర్థ్యాలను జతపర్చుకోనున్నాయి. -
డేటా సెంటర్లపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా టెక్నో డిజిటల్ ఇన్ఫ్రా పేరిట సంస్థను ప్రారంభించినట్లు టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ (టీఈఈసీఎల్) వెల్లడించింది. ఇది సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా మొత్తం మీద 250 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చెన్నైలో 36 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ (హెచ్‌డీసీ) కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా టీఈఈసీఎల్ ఈ విషయాలు పేర్కొంది. తదుపరి హెచ్డీసీలను కోల్‌కతా, నోయిడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. మరోవైపు, 23 రాష్ట్రాలవ్యాప్తంగా 102 నగరాల్లో ఎడ్జ్ డేటా సెంటర్లను నిర్మించేందుకు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టీఈఈసీఎల్ తెలిపింది. క్లౌడ్ మాధ్యమం ద్వారా పెద్ద కంపెనీలకు భారీ డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ సరీ్వసులు అందించేందుకు హెచ్డీసీలు ఉపయోగపడతాయి. యూజర్లకు సమీపంలో స్థానికంగా ఏర్పాటు చేసే చిన్న డేటా సెంటర్లను ఎడ్జ్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. -
రియల్టీకి డేటా సెంటర్స్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథకు డిమాండ్‌తో డేటా సెంటర్లు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో 2030 నాటికి అదనంగా 45–50 మిలియన్ చ.అ. రియల్ ఎస్టేట్ అవసరం ఏర్పడనుంది. అలాగే 40–45 టెరావాట్–అవర్స్ (టీడబ్ల్యూహెచ్) విద్యుత్ కూడా కావాల్సి రానుంది. ‘భారత ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్లోకి పెట్టుబడుల ఆకర్షణ’ పేరిట డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వ్యయాలపరమైన ప్రయోజనాలు, పునరుత్పాదక విద్యుత్‌పై ప్రధానంగా దృష్టి పెట్టడం, వ్యూహాత్మక స్థానంలో ఉండటం తదితర అంశాలు భారత్‌కి సానుకూలాంశాలని వివరించింది. అయితే, అంతర్జాతీయంగా ఏఐ హబ్‌గా ఎదగాలంటే కీలకమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం, నిపుణుల లభ్యత, విధానాల్లో అంతరాలను తొలగించడం మొదలైనవి ప్రధానంగా ఉంటాయని పేర్కొంది. ప్రపంచ స్థాయి ఏఐ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే రియల్ ఎస్టేట్, విద్యుత్, కనెక్టివిటీ, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, నిపుణులు, విధానాలు అనే ఆరు అంశాలు మూల స్తంభాలుగా ఉంటాయని నివేదిక తెలిపింది. నేషనల్ బిల్డింగ్ కోడ్‌లో డేటా సెంటర్ల కోసం ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేయాలని సూచించింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతుల ప్రక్రియను సరళతరం, వేగవంతం చేయాల్సి ఉంటుంది. → విధానాలపరంగా మద్దతు కలి్పంచాలి. డేటా లోకలైజేషన్ నిబంధనలను క్రమబద్ధీకరించాలి. ప్రత్యేక డేటా సెంటర్ జోన్లను ఏర్పాటు చేయాలి. ఇవి భారతదేశ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు తోడ్పడతాయి. → డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ వల్ల పవర్ గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అత్యవసరంగా భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయి. → దేశీయంగా నెట్వర్క్, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌పరంగా పరిమితులు, గట్టిగా ఆధారపడలేని హై–స్పీడ్ ఇంటర్నెట్ మొదలైన వాటి పరిమితుల వల్ల డేటా సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉండొచ్చు. -
‘ఉర్సా’.. ఎంపీ కేశినేని చిన్ని బినామీదే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విశాఖపట్నంలో డేటా సెంటర్ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని విజయవాడ మాజీ ఎంపీ, శివనాథ్ సోదరుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. ఇందుకోసం కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారని చెప్పారు.ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్మేట్స్ అని ‘ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరేనని గుర్తు చేశారు. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ఫేస్బుక్, ‘ఎక్స్’లో పోస్టు చేశారు.లేఖలో ఏం రాశారంటే.. » విశాఖలో రూ.5,278 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఇటీవల ఏర్పాటు చేసిన కంపెనీకి విశాఖ ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడం ఆందోళనకరం. » ఆ కంపెనీకి భూ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుట్ర, భూదోపిడి దాగి ఉంది. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బినామీని ముందుపెట్టి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి ఎంపీ చిన్ని ప్రయత్నిస్తున్నారనడానికి బలమైన ఆధారాలున్నాయి. » ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కేవలం కొన్ని వారాల ముందు మాత్రమే స్థాపించారు. ఆ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును అమలు చేసే సామర్థ్యం లేదు. » ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని శివనాథ్‌కు ఇంజనీరింగ్ కాలేజీ సహచరుడు. దీర్ఘకాల మిత్రుడు. గతంలో ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యాపార భాగస్వామి కూడా. ఉర్సా బినామీ అబ్బూరి సతీష్ వెనుక ఉన్నది కేశినేని శివనాథే అన్నది ప్రజల్లో బలంగా ఉంది. » మీడియా నివేదికల ప్రకారం.. ఎంపీ కేశినేని శివనాథ్ ఫ్లైయాష్, ఇసుక, గ్రావెల్‌ను కొల్లగొడుతూ.. గాంబ్లింగ్ డెన్స్ (పేకాట శిబిరాలు) నిర్వహిస్తూ.. రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. » పారిశ్రామిక అభివృద్ధి కోసం కాకుండా.. ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉర్సా పేరుతో భూములను కాజేయడానికి ఎంపీ కేశినేని శివనాథ్ కుట్ర చేసినట్లు కనిపిస్తోంది. దీన్ని అనుమతించటం ప్రజా ప్రయోజనాలకు హానికరం. కాబట్టి తక్షణమే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూకేటాయింపును రద్దు చేయండి. » ఆ కంపెనీ యాజమాన్యం, పెట్టుబడుల మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణకు ఆదేశించండి. -
ఊరూపేరు లేని 'ఉర్సా'
సాక్షి, అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..? నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..? కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..! సొంత కార్యాలయం.. కనీసం ఫోన్ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్‌కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. ‘ఉర్సా క్లస్టర్స్’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ కేటాయింపులకు పచ్చజెండా.. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సాకుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట.. ఇంకో డైరెక్టర్ కథ ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. హైదరాబాద్‌లో కార్యాలయమే లేదు..! కేరాఫ్ అడ్రస్ ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన పెందుర్తి విజయ్‌కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్ నెంబర్ 705, ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్‌కుమార్‌కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్ రూమ్ నివాస ఫ్లాట్‌ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్‌ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నెంబర్ 705 విద్యుత్ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్ కంపెనీకి కనీసం ఓ ఫోన్ నెంబరు గానీ వెబ్‌సైట్‌గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్ తన వ్యక్తిగత ఈ మెయిల్‌ను ఆర్వోసీకి అందించారు. అమెరికాలోనూ అంతే.. లోకేశ్ పర్యటనకు నెల ముందు...!ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్ 27న ఉర్సా క్లస్టర్స్ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్‌లో 611, సౌత్ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్‌కుమార్ తనయుడు కౌశిక్ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్ నెంబర్లు లేవు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి. మరో డైరెక్టర్ సతీష్ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్‌కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.‘ఐఎంజీ భారత్’ను మించిన స్కామ్..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్‌డీడ్ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్ గుర్తుకొస్తోందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు
దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే.. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20 శాతం క్లౌడ్ సర్వీస్ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ ఛార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి.ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి.రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు.. ప్రత్యేకమైన డేటా సెంటర్ పాలసీలు పెట్టుబడిదారులకు స్పష్టమైన, నిర్మాణాత్మక కార్యచరణకు దోహదపడతాయి. దీంతో ఆయా నగరాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో గణనీయమైన రాయితీలు, విద్యుత్ టారీఫ్‌లలో తగ్గుదల, గణనీయమైన పన్ను మినహాయింపులు దక్షిణ దేశంలో డేటా సెంటర్ల పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అధిక వేగం, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇది డేటా సెంటర్ల కార్యకలాపాలకు కీలక అంశం. సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్ నియంత్రణల తగ్గింపులు వంటివి డేటా సెంటర్ల ప్రాజెక్ట్‌లను ప్రోత్సహిస్తున్నాయి.చెన్నై, బెంగళూరులో.. జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారింది. ప్రస్తుతం చెన్నైలో 17 లక్షల చ.అ.ల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చ.అ.ల్లో 156 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. 16 లక్షల చ.అ.ల్లో 104 మెగావాట్లు ప్రణాళికలో ఉంది. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. బెంగళూరు: సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చ.అ.ల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయి. మరో లక్ష చ.అ.ల్లో 10 మెగావాట్లు నిర్మాణంలో, 3 లక్షల చ.అ.ల్లో 26 మెగావాట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బలమైన సాంకేతిక నైపుణ్యం, నిపుణుల లభ్యత బెంగళూరు డేటా సెంటర్ల మార్కెట్‌కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి.ఐఓటీతో డిమాండ్.. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), క్లౌడ్ సర్వీస్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ల డిజిటలైజేషన్ పెరుగుదల కారణంగా డేటా సెంటర్ల డిమాండ్ మరింత పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ హెడ్ స్వాప్నిల్ అనిల్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యంలో 80 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. -
అమెజాన్ పెట్టుబడి రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)లో రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది. తెలంగాణలో డేటా సెంటర్లను విస్తరించేందుకు రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రఖ్యాత అమెజాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ‘అమెజాన్ వెబ్ సర్విసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ’ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో జరిపిన భేటీలో ఈ నిర్ణయం వెలువడింది. అమెజాన్‌తోపాటు మరికొన్ని సంస్థలతోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భూమి కేటాయించాలని కోరిన అమెజాన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్రంలో ఇప్పటికే మూడు డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాజాగా విస్తరణ కోసం అవసరమైన భూమిని కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అమెజాన్ భారీ పెట్టుబడులకు ముందుకు రావడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్’తో తమ ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. అమెజాన్ ఒప్పందంతో దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు సాధిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. డేటా సెంటర్ల రంగంలో మరిన్ని పెట్టుబడులు ⇒ హైదరాబాద్‌లో రూ.15వేల కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్‌కు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ⇒ అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ రూ.5వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల్లో అగ్రగామి సంస్థ బ్లాక్‌స్టోన్ హైదరాబాద్‌లో రూ.4,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బ్లాక్‌స్టోన్ అనుబంధ విభాగం జేసీకే ఇన్ఫ్రా 150 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తుంది. ఇన్ఫోసిస్, విప్రో విస్తరణ ప్రణాళికలు కూడా.. ⇒ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపన్‌పల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు విప్రో సంస్థ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబులతో జరిగిన భేటీలో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ విప్రో క్యాంపస్ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దీనితో 5వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ⇒ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ హైదరాబాద్‌లోని పోచారంలో ఉన్న తమ క్యాంపస్‌లో 17 వేల ఉద్యోగాలు కల్పించేలా విస్తరణ ప్రణాళిక ప్రకటించింది. రూ.75 కోట్ల పెట్టుబడితో నూతన ఐటీ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు -
డేటా సెంటర్ సామర్థ్యాలు పెంపు
ముంబై: దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 2026–27 ఆర్థిక సంవత్సరం చివరికి రెట్టింపై 2–2.3 గిగావాట్లకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఇప్పటికే ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల విస్తరణ ప్రణాళికలకు తోడు కొత్త సంస్థల రాకతో డేటా సెంటర్ల సామర్థ్యం పెరగనున్నట్టు వెల్లడించింది. డిజిటలైజేషన్ పెరగడానికితోడు, క్లౌడ్ స్టోరేజీపై సంస్థల పెట్టుబడులు ఇనుమడిస్తుండడం డేటా సెంటర్ల డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపింది. జెనరేటివ్ ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం సైతం మధ్య కాలానికి ఈ డిమాండ్‌ను నడిపించనున్నట్టు పేర్కొంది. ఈ బలమైన డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా సంస్థలకు అదనపు మూలధన వ్యయాలు అవసరం అవుతాయని, ఇవి రుణాల రూపంలో ఉండొచ్చని పేర్కొంది. వ్యాపార సంస్థలు తమ వ్యాపారాల నిర్వహణ విషయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు మొగ్గు చూపిస్తుండడం డేటా సెంటర్ల కంప్యూటింగ్, స్టోరేజ్ వసతుల డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. కరోనా తర్వాత ఈ ధోరణి పెరగడాన్ని గుర్తు చేసింది. అధిక వేగంతో కూడిన డేటా అందుబాటులోకి రావడం సోషల్ మీడియా, ఓటీటీ, డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని పెంచినట్టు తెలిపింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాలుగా మొబైల్ డేటా ట్రాఫిక్ ఏటా 25 శాతం చొప్పున పెరగడాన్ని ప్రస్తావించింది. 2024 మార్చి నాటికి నెలవారీ డేటా వినియోగం 24 జీబీకి చేరిందని, 2026 మార్చి నాటికి 33–35జీబీకి ఇది పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.భారీ పెట్టుబడులు..‘‘పెరుగుతున్న డేటా సెంటర్ల డిమాండ్‌ను తీర్చేందుకు గాను వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.55,000–65,000 కోట్ల మేర పెట్టుబడులు అవసరం అవుతాయి. ప్రధానంగా భూమి, భవనాలు, విద్యుత్ ఎక్విప్మెంట్, కూలింగ్ పరిష్కారాల కోసం ఎక్కువ వ్యయం చేయాల్సి ఉంటుంది. భూమి, భవనం కోసమే డేటా సెంటర్ ఆపరేటర్లు మొత్తం మూలధన వ్యయాల్లో 25–30 శాతాన్ని వెచి్చంచాల్సి వస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా తెలిపారు. ఒక్కసారి ఒప్పందం కుదిరితే డేటా సెంటర్లకు స్థిరమైన నగదు ప్రవాహాలు వస్తుంటాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి వివరించారు. ‘‘ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి మారడం అన్నది అధిక వ్యయాలతో కూడుకున్నదే కాకుండా, వ్యాపార అవరోధాలకు దారితీస్తుంది. దీంతో క్లయింట్లను అట్టిపెట్టుకునే రేషియో ఎక్కువగా ఉంటుంది’’అని తెలిపారు. -
ప్రైవేటు చేతుల్లోకి ప్రభుత్వ డేటా!
సాక్షి, అమరావతి:‘ప్రపంచంలో అత్యంత ఖరీదైన సంపద ఏదైనా ఉంది అంటే.. అది ఒక్క డేటా మాత్రమే. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వారే అత్యంత ధనికులు’ అమరావతి డ్రోన్ సదస్సులో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. నూతన టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో డేటా అత్యంత విలువైనదని సీఎం చంద్రబాబు చెబుతూనే.. అత్యంత విలువైన ప్రభుత్వ డేటాను ప్రైవేటు ఏజెన్సీల చేతిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్’లో గల స్టేట్ డేటా సెంటర్ నిర్వహణ బాధ్యతలను థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. రెండేళ్ల లీజు కాలానికి స్టేట్ డేటా సెంటర్ నిర్వహణకు రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్ఎల్) బిడ్లు పిలిచింది. ప్రముఖ సిస్టమ్ ఇంటిగ్రేటర్, డేటా సెంటర్ మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లు టెండర్లలో పాల్గొనవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతో ఈ–గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తోందని, దీన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలను కొనసాగించడం కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ డేటాసెంటర్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు టెండర్ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ప్రాధాన్యతను గుర్తించిందని, ఐటీ సేవలను విస్తరించడం ద్వారా ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు అక్టోబర్ 30 మధ్యాహ్నం 3గంటలలోపు టెండర్ దాఖలు చేయాల్సి ఉంటుందని, కాంట్రాక్టు గెలిచిన సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి రెండేళ్ల పాటు సేవలను అందించాల్సి ఉంటుందని బిడ్ డాక్యుమెంట్లో పేర్కొంది.ఐటీ నిపుణుల ఆందోళనడేటా చౌర్యంతో సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ డేటా నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై ఐటీ నిపుణలతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా సెంటర్ నిర్వహణను ప్రభుత్వమే చేపట్టడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ గ్రిడ్ పేరుతో డేటా చౌర్యం జరగడంపై తీవ్ర దుమారమే రేగిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ డేటా సెంటర్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు అవసరమయ్యే ఎనర్జీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో సంస్థ అవసరాలు తీర్చడానికి వీలుగా స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్-తక్కువ పరిమాణం, అధిక భద్రత కలిగే రియాక్టర్లు) నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచంలోనే ఒక కార్పొరేట్ సంస్థ ఈమేరకు వివిధ ఎస్ఎంఆర్ల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఇది మొదటిసారి కావడం గమనార్హం.గూగుల్ సంస్థ కైరోస్ పవర్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 2030 నాటికి కైరోస్ పవర్‌కు చెందిన ఎస్ఎంఆర్ ద్వారా విద్యుత్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. 2035 నాటికి మరిన్ని రియాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందంలోని అంశాల అమలు తుదిదశ చేరేనాటికి ఆరు నుంచి ఏడు రియాక్టర్ల ద్వారా మొత్తం 500 మెగావాట్ల విద్యుత్‌ను గూగుల్ కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన ఆర్థిక వివరాలు, ఏ ప్రాంతంలోని రియాక్టర్ల నుంచి కొనుగోలు చేయబోతున్నారో మాత్రం తెలియజేయలేదు.ఏఐ టెక్నాలజీలో నిత్యం విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి వాడుతున్న పరికరాలు, డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. సంప్రదాయ విద్యుత్ తయారీకి బదులుగా గ్లోబల్ కంపెనీలు పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే గూగుల్ కంపెనీ అణు రియాక్టర్ల ద్వారా వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ టాలెన్ ఎనర్జీ నుంచి న్యూక్లియర్ పవర్డ్ డేటా సెంటర్‌ను కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ పెన్సిల్వేనియాలోని త్రీ మైల్ ఐలాండ్‌లో రియాక్టర్‌ను పునరుద్ధరించడంలో కాన్స్టెలేషన్ ఎనర్జీకి సాయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2023-2030 మధ్య యూఎస్ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం మూడు రెట్లు పెరుగుతుందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. దీనికి దాదాపు 47 గిగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
రూ.520 కోట్లతో స్థలం కొనుగోలు!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ మహారాష్ట్ర పుణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అందుకోసం ఏకంగా రూ.520 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇండో గ్లోబల్ ఇన్ఫోటెక్ సిటీ ఎల్ఎల్పీ నుంచి ఈ కొనుగోలు చేసినట్లు పేర్కొంది. డేటా సెంటర్ కార్యకలాపాల్లో మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. అందుకోసం ఈ స్థలాన్ని ఉపయోగించుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్, పుణె, ముంబై, చెన్నై వంటి నగరాల్లో కార్యకాలాపాలు సాగిస్తోంది. దేశీయంగా డేటా సెంటర్లను విస్తరిస్తామని కంపెనీ గతంలో పలుమార్లు తెలిపింది. వివిధ నగరాల్లో స్థలాలు కొనుగోలు చేసి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయనేలా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల పుణె నగరంలో పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని రూ.328 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో పుణెలో గడిచిన రెండేళ్లలో రూ.848 కోట్ల పెట్టుబడితో రెండు చోట్ల స్థలాలు తీసుకుంది.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 48 ఎకరాల భూమిని రూ.267 కోట్లకు కొనుగోలు చేసింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ల ద్వారా వివిధ కంపెనీలకు అధునాతన క్లౌడ్ సొల్యూషన్స్ అందించనున్నారు. వివిధ రంగాల్లోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు.. వంటి వాటికి డేటా సెక్యూరిటీ సేవలు అందిస్తారు. ఇదిలాఉండగా, మైక్రోసాఫ్ట్ 2025 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందికి కృత్రిమమేధ(ఏఐ), డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు సిద్ధమైంది. దీని కోసం ‘అడ్వాంటేజ్ ఇండియా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
జనరేటివ్‌ఏఐ కోసం భారీగా ఖర్చు
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వాడకం వైపు మొగ్గు చూపుతున్నాయి. అందులో భాగంగా జనరేటివ్ ఏఐపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. అయితే అందుకు కావాల్సిన సిస్టమ్ అప్‌గ్రేడేషన్, హార్డ్‌వేర్‌కు భారీగా ఖర్చు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు తమ టెక్ బడ్జెట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. చాలా కంపెనీలు జనరేటివ్ ఏఐకు షిఫ్ట్ అవుతుండడంతో ప్రధానంగా హార్డవేర్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. నవంబర్ 2022లో ఓపెన్ఏఐ చాట్ జీపీటీను ప్రారంభించినప్పటి నుంచి జనరేటివ్ ఏఐపై పరిశోధనలు పెరిగాయి. రిసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ గార్ట్నర్ నివేదిక ప్రకారం.. 2024లో ఐటీ కంపెనీలు డేటా సెంటర్ సిస్టమ్‌ల అప్‌గ్రేడ్ కోసం దాదాపు 24 శాతం రెవెన్యూ పెంచాయి. హార్డ్‌వేర్ పరికరాల కోసం చేసే ఖర్చును 5.4 శాతం అధికం చేశాయి. 2018 నుంచే కొన్ని కంపెనీలు డేటా సెంటర్ సిస్టమ్‌లపై చేసే వ్యయాలను పెంచుతూ ఉన్నాయి.మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు, హార్డ్వేర్పై ఖర్చును పెంచడం తప్పనిసరైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, జనరేటివ్ ఏఐ బిజినెస్ సర్వీసెస్ యూనిట్ సీఈఓ శ్రీధర్ మంథా మాట్లాడుతూ..‘చాలా కంపెనీలు ఇప్పటికీ ప్రాథమిక ఏఐ టాస్క్‌లకు అనువైన పాత డేటా సర్వర్లనే ఉపయోగిస్తున్నాయి. అయితే సంస్థలు క్రమంగా జనరేటివ్ ఏఐకు షిఫ్ట్ అవుతున్నాయి. దాంతో డేటా సెంటర్ సిస్టమ్‌లను, హార్డ్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్నాయి’ అన్నారు. ఇదిలాఉండగా, కంపెనీ జనరేటివ్ ఏఐ హార్డ్వేర్పై భారీగా ఖర్చు చేస్తుండడంతో ఈ విభాగంలో నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
ఎయిర్టెల్ డేటా సెంటర్ అరుదైన ఘనత
ఎయిర్టెల్ డేటా సెంటర్ విభాగమైన నెక్స్‌స్ట్రా అరుదైన ఘనత సాధించింది. కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో క్లైమేట్ గ్రూప్ నేతృత్వంలోని ఫ్లాగ్షిప్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌లో చేరింది. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తు వినియాగానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. నెక్స్‌స్ట్రా దేశవ్యాప్తంగా 12 పెద్ద, 120 ఎడ్జ్ డేటా సెంటర్లతో దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. "మాది పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన బ్రాండ్. క్లీన్ ఎనర్జీ ప్రత్యామ్నాయాలను అవలంబిస్తున్నాం. 2031 నాటికి మా నెట్ జీరో లక్ష్యాలను సాధించే దిశగా మేము ఆరోగ్యకరమైన మార్గంలో ఉన్నాం. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తుకు నిబద్ధతతో ఆర్ఈ 100 చొరవలో భాగం కావడం సంతోషంగా ఉంది" అని ఎయిర్టెల్ నెక్స్‌స్ట్రా సీఈవో ఆశిష్ అరోరా ఒక ప్రకటనలో తెలిపారు.భారత్‌లో ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌కు హామీ ఇచ్చిన ఏకైక డేటా సెంటర్ సంస్థగా, ఈ మైలురాయిని చేరుకున్న 14 వ భారతీయ సంస్థగా నెక్స్‌స్ట్రా నిలిచింది. కంపెనీ తన పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచింది. ఇప్పటి వరకు 4,22,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి ఒప్పందాలను కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, క్యాప్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తిని సోర్సింగ్ చేయడం ద్వారా సుమారు 1,56,595 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్లు నెక్స్‌స్ట్రా పేర్కొంది. -
ఇండియాలో డేటా సెంటర్‌ను ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ
ఇండియాలో టిక్‌టాక్ వినియోగంలో ఉన్నపుడు దానికి వచ్చిన ఆదరణ అంతాఇంతా కాదు. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ ఆధీనంలోని షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను మన దేశంలో నిషేధించాక, వినియోగదార్లు ప్రత్యామ్నాయ యాప్‌లపై దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను తీసుకొచ్చింది. 2020 జులైలో తొలుత భారత్‌లోనే వీటిని పరిచయం చేసింది. భారత్‌లో రీల్స్‌కు వస్తున్న ఆదరణను గమనించిన మెటా, ఈ డేటాను భద్రపరచేందుకు మనదేశంలోనే డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ డేటా సెంటర్లలో 10-20 మెగావాట్ల సామర్థ్యం కలిగిని చిన్న కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మెటా అవకాశాలను పరిశీలిస్తోందని తెలిసింది. ఈ డేటా కేంద్రం ఏర్పాటుకు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది? వంటి విషయాలు కంపెనీ నిర్వహిస్తున్న అధ్యయనం తర్వాత తెలుస్తుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమ నిపుణుల ప్రకారం, టైర్-4 డేటా కేంద్రం మన దేశంలో ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.50-60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ప్రతి డిమాండ్‌ను నెరవేర్చలేమన్న మంత్రి -
వచ్చే వారం రిలయన్స్ డేటా సెంటర్ ప్రారంభం
చెన్నై: వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్స్ విభా గంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇస్తోంది. వచ్చే వారం చెన్నైలో సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీ సంస్థలతో కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. చెన్నైలో 20 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఈ జాయింట్ వెంచర్ సంస్థ ముంబైలో మరో 40 మెగావాట్ల సెంటర్ కోసం 2.15 ఎకరాలు కొనుగోలు చేసింది. -
Infosys Narayana Murthy: అమెరికా వ్యాపారవేత్త వల్ల... స్టోర్ రూంలో నిద్రించాను
న్యూఢిల్లీ: అది ఇన్ఫోసిస్ అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న తరుణం. న్యూయార్క్‌కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ దాని పెద్ద కస్టమర్లలో ఒకటిగా ఉండేది. దాని అధిపతి డాన్ లైల్స్‌కు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంటే నచ్చేది కాదు. ఓసారి ఆయనతో భేటీ కోసం న్యూయార్క్ వెళ్లిన నారాయణమూర్తి ఆ రాత్రి డాన్ నివాసంలోనే నిద్ర పోవాల్సి వచి్చంది. ఇంట్లో నాలుగు బెడ్రూములున్నా నారాయణమూర్తి అంటే కిట్టని డాన్ మాత్రం ఆయన్ను తన సంస్థ స్టోర్ రూంలో పడుకొమ్మన్నాడు! అదీ, కనీసం కిటికీ కూడా లేని చోట, అట్టపెట్టెల మధ్య పడున్న ఓ పెద్ద బాక్స్‌పై! డాన్ వల్ల అప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడ్డా ఇన్ఫోసిస్ కోసం భరించిన తనకు ఈ అవమానకర ఘటన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయిందంటారు నారాయణ మూర్తి. ‘‘అతిథి దేవుడితో సమానమని మా అమ్మ చెప్పేవారు. అనుకోకుండా ఎవరైనా వస్తే అమ్మ తాను తినకుండా వారికి వడ్డించేవారు. పస్తు పడుకునేవారు’’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘యాన్ అన్ కామన్ లవ్: ది అర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి’ పుస్తకంలో ఇలాంటి ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. భారతీయ అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన ఈ పుస్తకాన్ని జగ్గర్నాట్ బుక్స్ ప్రచురించింది. ఇన్ఫోసిస్ ఆవిర్భావం నుంచి వారి వివాహం, తల్లిదండ్రులవడం తదితర పరిణామాలన్నీ అందులో ఉన్నాయి. సుధా మూర్తి మంచి ఇంజినీర్ అయినా ఇన్ఫోసిస్‌లో చేరడం నారాయణ మూర్తికి తొలుత అస్సలు ఇష్టం లేదట. కుటుంబ యాజమాన్యాల్లోని సంస్థల ఇబ్బందులు ఆయన కళ్లారా చూడటమే అందుకు కారణమని రచయిత్రి వివరించారు. వారిద్దరిదీ అసాధారణ ప్రేమ కథ అని చెప్పుకొచ్చారు. సోషలిజాన్ని బాగా ఇష్టపడే మూర్తి రష్యన్ ప్రపంచ భాష అవుతుందని నమ్మేవారట. రెండేళ్లపాటు రష్యన్ తెగ నేర్చుకున్నారట. సుధా మూర్తి మాత్రం ఇంగ్లిషే ప్రపంచ భాష అవుతుందని చెప్పేవారట. -
ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం!
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా రెండు డేటా సెంటర్లను షట్‌డౌన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఏడాదికి వన్ మిలియన్ డాలర్లను ఆదా చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిరిండియా తన కష్టమర్లకు సేవలంచేలా అప్లికేషన్లు, ఇతర సర్వీసులు కోసం ముంబై, న్యూఢిల్లీలలో రెండు డేటా సెంటర్లను ఉపయోగిస్తుంది. అయితే, తాజాగా వాటిని షట్‌డౌన్ చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ నిర్ణయంతో వన్ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయొచ్చని ఎయిరిండియా చెబుతుంది. ఎయిరిండియా కార్యకలాపాలు కొనసాగించేందుకు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించనుంది. ఈ క్లౌడ్ సేవల్ని అమెరికాలోని సిలీకాన్ వ్యాలీతో పాటు పాటు భారత్‌లోని గురుగ్రామ్, కొచ్చి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా "మేం ఎయిరిండియా ప్రయాణంలో సాఫ్ట్వేర్-ఎ-సర్వీస్, ప్లాట్‌ఫారమ్-యాజ్-ఎ-సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్-ఎ-సర్వీస్ మెథడాలజీ సేవల్ని వినియోగిస్తున్నాం " అని ఎయిర్ ఇండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్య రామస్వామి చెప్పారు. గతేడాది జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసిన ఎయిరిండియా రానున్న ఐదేళ్ల భవిష్యాత్ ఎలా ఉండాలనే అంశంపై ప్రణాళికల్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు రామస్వామి వెల్లడించారు. -
ఏకంగా 45000 కోట్లు.. డేటా సెంటర్లలోకి పెట్టుబడుల వరద
ముంబై: దేశీయంగా డేటా సెంటర్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రూ. 45,000 కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్లు రాగలవని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో అంచనా వేసింది. పెద్ద కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్‌ను వినియోగించుకోవడం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. ఇక ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లు ప్రాచుర్యంలోకి వస్తున్న క్రమంలో రిటైల్ డేటా వినియోగం పెరుగుతోందని వివరించింది. గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ వార్షికంగా 45 శాతం మేర వృద్ధి చెందిందని క్రిసిల్ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ సర్వీసులతో రిటైల్ యూజర్లలో డేటా వినియోగం ఇంకా విస్తరిస్తుందని, తద్వారా ఉత్పత్తయ్యే డేటాను నిల్వ చేసేందుకు డేటా సెంటర్ల అవసరమూ పెరుగుతుందని వివరించింది. ప్రస్తుతం 780 మెగావాట్లుగా ఉన్న భారతీయ డేటా సెంటర్ల స్థాపిత సామర్ధ్యం .. 2026 మార్చి నాటికి 1,700 మెగావాట్ల స్థాయికి చేరగలదని, ఇందుకు రూ. 45,000 కోట్లు అవసరం కాగలవని క్రిసిల్ డిప్యుటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా చెప్పారు. హైదరాబాద్, చెన్నై తదితర నగరాలకూ ప్రాధాన్యం.. కొత్త పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు భాగం ఆర్థిక రాజధాని ముంబైలోను, మిగతావి హైదరాబాద్, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, పుణె వంటి ప్రాంతాల్లోను ఉండవచ్చని గుప్తా చెప్పారు. సబ్–సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అందుబాటులో ఉండటం, బడా కంపెనీలకు నెలవుగా ఉండటం, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండటం వంటి సానుకూల అంశాల కారణంగా ముంబైకి అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని క్రిసిల్ వివరించింది. తాజా పెట్టుబడులన్నీ దేశీ, అంతర్జాతీయ డేటా సెంటర్ ఆపరేటర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో పాటు టెలికం, రియల్ ఎస్టేట్, నిర్మాణ, ఇంజినీరింగ్ తదితర రంగాల కంపెనీల నుంచి ఉండగలవని పేర్కొంది. -
డేటా సెంటర్ల కేంద్రం.. విశాఖ!
కె.జి.రాఘవేంద్రారెడ్డి– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన దైనందిన జీవితంలో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం ప్రతీ రోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 మిలియన్ టెరాబైట్స్ డేటాను సృష్టిస్తున్నాం. దీనిని భద్రపరచడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన కేంద్రాలే డేటా సెంటర్లు. ఇంటర్నెట్ ద్వారా సమాచార సేవలు నిరంతరాయంగా అందాలంటే డేటా సెంటర్లే కీలకం. అటువంటి డేటా సెంటర్లకు ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సీ) ప్రకటించింది. ఇక ఏకంగా రూ. 21,844 కోట్ల పెట్టుబడితో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర ఇంటర్నెట్ అవసరాలకు విశాఖ కేంద్రంగా మారనుంది. తద్వారా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ కేంద్రాల కోసం ముంబై, చెన్నై, హైదరాబాద్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే విశాఖ డేటా కేంద్రాలు స్థానిక అవసరాలను తీర్చనున్నాయి. సింగపూర్ నుంచి ఓఎఫ్సీ డేటా సెంటర్లలో ఇంటర్నెట్ డేటాను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల (ఓఎఫ్సీ)ద్వారా సమాచారాన్ని సేకరించడం జరుగుతోంది. ఇందుకోసం కేవలం భూమి మీదనే కాకుండా.. సముద్రగర్భం నుంచి వేస్తున్న ఓఎఫ్సీనే కీలకం. ఒక అంచనా ప్రకారం సముద్రాల్లో ఏర్పాటు చేసిన 9 లక్షల మైళ్ల ఓఎఫ్సీ ద్వారా 95 శాతం డేటా నిత్యం ప్రసారమవుతోంది. విశాఖలో ఏర్పాటుకానున్న అదానీ డేటా సెంటర్‌కు కూడా సింగపూర్ నుంచి సముద్రగర్భం ద్వారా వేస్తున్న ఓఎఫ్సీ ద్వారానే డేటా ప్రసారం కానుంది. 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అదానీ డేటా సెంటర్‌తో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్‌కు కూడా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవల్లో వేగం పెంచడం, స్థానిక అవసరాలను తీర్చడం కోసం ఇప్పటికే డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు నిక్సీ ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. అమెరికా వర్సెస్ చైనా...! ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల ఏర్పాటు విషయంలో చైనా ముందంజలో ఉంది. అయితే, సముద్రగర్భంలో ఏర్పాటు చేస్తున్న ఓఎఫ్సీ విషయంలో మాత్రం అమెరికా సంస్థల పెత్తనం ఉంటోంది. తాజాగా ఆసియా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలను కలుపుతూ సింగపూర్ టు ఫ్రాన్స్ వరకూ ఏర్పాటవుతున్న ఓఎఫ్సీ పనులను కూడా అమెరికాకు చెందిన సబ్కామ్ కన్సార్టియం దక్కించుకుంది. ఈ సముద్రగర్భంలో ఏర్పాటు చేస్తున్న ఓఎఫ్సీలోనూ పైచేయి సాధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. తాజాగా చైనా చేసిన ప్రయత్నాలు అమెరికా ఎత్తులతో చిత్తయ్యాయి. ఇక రానున్న రోజుల్లో ఈ సముద్రగర్భ ఓఎఫ్సీ మార్కెట్లో భారత్ సంస్థలూ పోటీ పడనున్నాయి. ఈ మార్కెట్లోకి రిలయన్స్, అదానీ వంటి సంస్థలు అడుగుపెట్టాయి. అందులో భాగంగా సింగపూర్ నుంచి విశాఖకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను అదానీ సంస్థనే వేసుకోనుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా టాప్–10 డేటా సెంటర్లు... ప్రపంచవ్యాప్తంగా టాప్–10 డేటా సెంటర్లలో ప్రధానంగా చైనా, అమెరికా, బ్రిటన్ సంస్థలే ఉన్నాయి. అయితే, 0.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో బెంగళూరులో ఉన్న తులిప్ డేటా సెంటర్ 13వ స్థానంలో ఉంది. టాప్–10 డేటా కేంద్రాలివే... ఇకపై స్థానికంగానే.! ఇంటర్నెట్ ఎక్స్చేంజ్లు స్థానికంగా లేని కారణంగా పలు సంస్థలకు 40 శాతం అదనపు భారం పడుతోంది. నగర పరిధిలో ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, బ్యాంకులు, రైల్వే బుకింగ్ కేంద్రం, వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు.. బల్క్‌గా డేటాను వినియోగిస్తున్నాయి. అలాగే విశాఖలో.. ఎ–కేటగిరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు 20, బీ, సీ కేటగిరీ ఐఎస్పీలు 60 నుంచి 80 వరకూ ఉన్నాయి. ఈ సంస్థలన్నీ పెద్ద మొత్తంలో డేటా కొనుగోలు చేస్తున్నాయి. 150 వరకూ ఐటీ కంపెనీలు, 13 వేల ఎంఎస్ఎం యూనిట్లకూ డేటా అవసరం ఉంటోంది. డేటా సెంటర్ల ఏర్పాటుతో వీటికి ఇకపై అంతరాయం లేకుండా ఇంటర్నెట్, తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన సేవలు అందనున్నాయి. -
భారత్ లో డేటా సెంటర్లకు ఫుల్ డిమాండ్
-
జగన్ పాలనలో వర్షాలు.. బాబు పాలనలో కరువుకాటకాలు
చిత్తూరు కార్పొరేషన్(చిత్తూరు జిల్లా)/తిరుపతి కల్చరల్ : వైఎస్సార్‌తో పాటు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కరువు ఉండదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జగన్ పాలనలో గత నాలుగేళ్లుగా ఏ ఒక్క మండలాన్నీ కరువు ప్రాంతంగా ప్రకటించలేదని ఆనందం వ్యక్తం చేశారు. వర్షాలు సుభిక్షంగా పడుతున్నాయన్నారు. వైఎస్సార్ పాలనలోనూ సమృద్ధిగా వర్షాలు పడ్డాయని, కానీ చంద్రబాబు పాలనలో మాత్రం కరువు తాండవిస్తుందని చెప్పారు. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.1.9 కోట్లతో చిత్తూరులో జిల్లా డేటా సెంటర్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి అంబటి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.16 కోట్లతో డేటా సెంటర్లను ఏలూరు, విజయనగరం, చిత్తూరు, విశాఖ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కలెక్టర్ షన్మోహన్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో గంగమ్మ జాతర ఈ ఏడాది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వెంకన్న చెల్లి గంగమ్మతల్లి జాతర ఉత్సవాలు జరుగుతుండటం సంతోషకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుపతి గంగజాతరలో భాగంగా సోమవారం మంత్రి అంబటి తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీతాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. ఆయనను ఎప్పుడు కలిసినా నేను విశాఖకు అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వస్తుందని అడుగుతుండేవాడిని. ఆయన దానికి ఇప్పుడు సమాధానం ఇచ్చారు. ఇంత భారీ ఎత్తున డేటా సెంటర్ రావడం అంటే విశాఖనగరం ముఖ చిత్రాన్ని మార్చడమే. దీనికి తోడు భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కూడా గొప్ప విషయం. ఈ రెండిటికి ఒక రకంగా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే.. అదానీ డేటా సెంటర్ లోనే మరో ఐదేళ్లలో 39 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేశారు. స్కిల్ యూనివర్శిటీ, రిక్రియేషన్ పార్క్, ఐటి పార్కు, విమానాశ్రయంలో కార్గో సెంటర్, ఎయిరోసిటీ మొదలైన వాటి ద్వారా మరిన్ని వేల మందికి అవకాశాలు రాబోతున్నాయి. వీరితో పాటే సర్వీస్ రంగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని కూడా జగన్ ప్రకటించారు. అంటే విశాఖ సిగలో ఈ పరిపాలన రాజధాని మరో ఆభరణం అవుతుంది. ఈ రకంగా తెలంగాణ రాజదాని హైదరాబాద్ కు విశాఖ అతి త్వరలోనే పెద్ద పోటీ కాబోతోంది. ఐటీ రంగంలో విశాఖ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది. వైజాగ్ ఇప్పటికే మల్టీకల్చరల్ నగరంగా ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో ఇక్కడ నివసిస్తున్నారు. ఏపీకి సంబంధించి కూడా పలు ప్రాంతాల ప్రజలు స్థిరపడ్డారు. ఈ దశలో ఈ అభివృద్ది అంతా జరిగితే విశాఖకే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల పంట పడుతుంది. 👉 ముఖ్యమంత్రి జగన్ అన్నట్లు ఈ ప్రాంతం నుంచి వలసలు కూడా బాగా తగ్గిపోతాయి. విశాఖకు సహజమైన కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఒక వైపు సముద్ర తీరం, మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రాంతంలో నగరం విస్తరణకు ఎనలేని అవకాశం ఉండడం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంద్ర ప్రాంతాన్ని, ఈ కొత్త ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అదానీ డేటా సెంటర్‌ను తీసుకు రావడానికి ఆయన విశేష కృషి చేశారు. రాజకీయంగా తన పలుకుబడిని సైలెంట్ గా ఉపయోగించారు. వారికి అవసరమైన భూమిని కేటాయించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. 👉 తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా ఆదాని డేటా సెంటర్ పై ఎంత విష ప్రచారం చేసినా, తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లారు సీఎం జగన్. దీనిని రాకుండా చేయడానికి జరిపిన ప్రయత్నాలు విఫలం అవడంతో తెలుగుదేశం మీడియా కొత్త రాగం అందుకుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో శంకుస్థాపన చేసిందని ప్రచారం ఆరంభించారు. అప్పుడు అదానీ గొప్పవాడయ్యాడు. అదే జగన్ టైమ్ లో అదానీ ముందుకు వస్తే ఎంత నీచ ప్రచారం చేశారో గమనిస్తే ఈ మీడియాలపై చీదర వేస్తుంది. 👉 నిజానికి గత ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందు హడావుడిగా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. చంద్రబాబుకు ఇలా చేయడం కొత్తకాదు. అది వేరే విషయం. భోగాపురం ఎయిర్ పోర్టు, కడప స్టీల్ వంటివాటిని కూడా అలాగే చేశారు. కాని వాటన్నింటిని ఉత్తిత్తి వ్యవహారంగానే మిగిల్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక భోగాపురం ఎయిర్ పోర్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లు చేశారు. పర్యావరణ తదితర కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతులను సాధించారు. ఇవన్ని పూర్తి అయిన తర్వాతే జగన్ శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. 👉 అంతేకాక ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న గ్రంధి మల్లిఖార్జున రావు ఈ జిల్లాకే చెందినవారు కావడం అదనంగా కలిసి వచ్చే విషయం. ఆయన కూడా చాలా సంతోషంగా కనిపించారు. ముఖ్యమంత్రి కోరినట్లు ఆరు నెలల నుంచి ఏడాది ముందుగా ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడ జరిగిన సభలో జగన్ మాట్లాడిన తీరు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా మరోసారి తెలియచేస్తుంది. 2026లో తానే వచ్చి మళ్లీ ఎయిర్ పోర్టును ప్రారంబిస్తానని ఆయన ప్రకటించారు. అంటే దాని అర్దం 2024 ఎన్నికలలో తిరిగి వైసిపి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారన్నమాట. 👉 యధాప్రకారం ఆయన తాను మంచి చేశానని అనుకుంటే ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ రకంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చెప్పడానికి సాహసించలేదు. అది ఒక్క జగన్ వల్లే అయింది. ఇక్కడ మరో సంగతి చూడాలి.. ఆదానీ డేటా సెంటర్ కాని, ఇతరత్రా స్కిల్ యూనివర్శిటీ వంటి ఆయా అభివృద్ది కార్యక్రమాలను విశాఖలో చేపట్టడం వల్ల అవి వేగంగా పూర్తి అయ్యే అవకాశం వస్తుంది. అదే అమరావతి గ్రామాలలో ఏర్పాటు చేయవలసి వస్తే ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. విశాఖలో చాలా వరకు ప్రాధమిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతి గ్రామాలలో సరైన రోడ్లు కూడా లేవు. కొత్తగా పరిశ్రమలు, ఇతర సంస్థలు రావాలంటే ఔత్సాహికులు వెనుకంజ వేసే అవకాశం ఉంది. 👉 అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి ఎకరా భూమి ని నాలుగు కోట్ల వరకు తీసుకువెళ్లారు. దీనివల్ల కొత్తగా ఎవరైనా సంస్థలు పెట్టాలంటే చాలా వ్యయం చేయవలసి వస్తుంది. వారికి గిట్టుబాటు కాని పరిస్థితి ఎదురు అవుతుంది. గత ప్రభుత్వం ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ప్రభుత్వ భూములు లేవు. అటవీ భూములు ఉన్నా వాటిని వాడుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావల్సి ఉంటుంది. వీటిని గుర్తించకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా ముందుకు వెళ్లారు. పోనీ ఏవైనా నిర్మాణాలు చేశారా అంటే అంతా తాత్కాలికం అన్నారు. తద్వారా వందల కోట్ల రూపాయల నిదులను దుర్వినయోగం చేయడానికి సిద్దమయ్యారు. 👉 ఈ నేపధ్యంలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. హైదరాబాద్ మాదిరి వేగంగా అభివృద్ది చెందడానికి, ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారడానికి విశాఖకు ఉన్న అవకాశాలను ఆయన అంచనావేశారు. ఇప్పటికే విశాఖ ఈ విషయంలో కొంతమేర ఉపయోగపడుతోంది. పరిపాలన రాజధాని అవడం, డేటా సెంటర్, కొత్త ఎయిర్ పోర్టు మొదలైనవన్ని వస్తే హైదరాబాద్ కు గట్టి పోటీ ఇచ్చే నగరంగా విశాఖ తయారవుతుంది. కానీ.. 👉 దీనిని అడ్డుకోవడానికి టిడిపి నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు విపరీతమైన కృషి చేశాయి. విష ప్రచారంతో ప్రజలలో వ్యతిరేక భావాలు నాటడానికి యత్నించాయి. అయినా జగన్ వారిని ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లారు కాబట్టి ఇప్పుడు అవి వాస్తవరూపం దాల్చి విశాఖ రూపురేఖలను మార్చబోతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పలు ప్రాజెక్టుల విషయంలోను టీడీపీ వర్గాలు ఇలాగే నిత్యం దుష్ప్రచారం చేసినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా వ్యవహరించి ప్రజల నుంచి అభినందనలు అందుకున్నారు. అలాగే జగన్ కూడా ఎంతో పట్టుదలతో విశాఖ అభివృద్దిని కార్యరూపంలోకి తెచ్చి శెబాష్ అనిపించుకుంటున్నారు. ఎంతైనా రాజశేఖరరెడ్డి కుమారుడు కదా. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ ఇదీ చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలియదుగానీ.. -
విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉంది: సీఎం జగన్
-
అటు అదానీ డేటా సెంటర్.. ఇటు భోగాపురం ఎయిర్‌పోర్టు
పనులే ప్రారంభం కానప్పుడు.. అది ఉత్తుత్తి శంకుస్థాపనే అవుతుంది కదా. గతంలో చంద్రబాబు హయాంలో జరిగింది అదే. కానీ, కోర్టు కేసులు పరిష్కరించి.. అన్ని అనుమతులతో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తోంది సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం. భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై కేసుల పరిష్కారం తర్వాత.. కేంద్రం నుంచి ఎన్వోసీ తీసుకొచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం నేడు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే క్రమంలో మొదటి అడుగు వేయబోతోంది. ఒకవైపు.. రూ. 4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవాళ అసలైన శంకుస్ధాపన జరగనుంది. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం, ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేందుకు వీలు, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశల వారీగా సౌకర్యాల విస్తరణను రాబోయే కాలానికి లక్ష్యంగా పెట్టుకుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ► పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఏడిసీఎల్) ఒప్పందం ► ప్రయాణీకుల సౌకర్యార్ధం అత్యంత ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం, ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రయాణికులు నేరుగా విమానాశ్రయ టెర్మినల్‌కు చేరుకునేలా అనుసంధానం ► అంతర్జాతీయ ఎగ్జిమ్ గేట్‌వే ఏర్పాటుకు వీలుగా కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలి దశలో 5,000 చ.మీ విస్తీర్ణంలో దేశీయ, అంతర్జాతీయ కార్గో టెర్మినల్ అభివృద్ది ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ది ప్లాంట్ ► 16 వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలు ► విశాఖపట్నం–భోగాపురం మధ్య రూ. 6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం, రెండువైపులా సర్వీసు రోడ్లు ► ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మందికి ఉపాధి. ఇదీ చదవండి: అల భోగాపురంలో... నాడు నా(రా)టకం.. నేడు జగ‘నిజం’ ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు పునరావాసం విమానాశ్రయం కోసం స్వఛ్చందంగా ఇళ్ళను ఖాళీ చేసిన 4 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలకు రూ. 77 కోట్లతో పునరావాసం, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వసతి కల్పించడం కూడా ఇప్పటికే జరిగింది. మరోవైపు.. ► అదానీ డేటా సెంటర్.. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, సమగ్రాభివృద్ధికి బాటలు వేసే విధంగా... రూ. 21,844 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో నిర్మిస్తున్న వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ (అదానీ గ్రూప్) ఏర్పాటు కానుంది. ► అదానీ డేటా సెంటర్ ద్వారా.. డేటా హబ్‌తో గణనీయంగా పెరగనున్న డేటా స్పీడ్, సింగపూర్ నుండి విశాఖపట్నం వరకు సముద్ర సబ్ మెరైన్ కేబుల్ ఏర్పాటు, తద్వారా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ 5 రెట్లు పెరిగి భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్ధలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడనుంది. ► విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల వృద్ది, భారీ స్ధాయిలో హైటెక్ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం, విశ్వసనీయమైన డేటా భద్రత, సేవల ఖర్చులలో తగ్గుదల ► అధునాతన టెక్ కంపెనీలు విశాఖపట్నం ను ఎంచుకునే వీలు, తద్వారా ఐటీ రంగంలో పెరగనున్న ఆర్ధిక కార్యకలాపాలు ► డేటా సెంటర్‌కు అనుంబంధంగా ఏర్పాటు కానున్న స్కిల్ యూనివర్శిటీ, స్కిల్ సెంటర్ల ద్వారా యువతలో నైపుణ్యాల పెంపుకు మరింత ఊతం, బిజినెస్ పార్క్ రిక్రియేషన్ సెంటర్ల ద్వారా మారనున్న ఉద్యోగుల జీవన శైలి అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ. 14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్ ఏర్పాటు, త్వరలో రూ. 7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ/బిజినెస్ పార్క్‌ల అభివృద్ది, తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, 10,610 మందికి పరోక్షంగా ఉపాధి కల్గనుంది. ఇదీ చదవండి: విశ్వనగరంలో వెలుగు రేఖలు -
విశాఖ ఐటీ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
సీఎం జగన్ పర్యటన.. లైవ్ అప్డేట్స్ ► ఈ సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుంది : సీఎం జగన్ ►విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉంది, డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంది, విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది ►విశాఖ వాసులకు డేటా సెంటర్ గొప్ప వరం, డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు ►దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖకు వస్తోంది, ఇంత పెద్ద డేటా సెంటర్ దేశంలో ఎక్కడా లేదు ►డేటా సెంటర్ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్‌నకు కృతజ్ఞతలు ►డేటా సెంటర్‌తో ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుంది, డేటా సెంటర్‌తో విశాఖ ఏ1 సిటీగా మారనుంది ► గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా చూడండి. మంచి జరిగిందని భావిస్తే నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మీ ముందుకు వచ్చే అర్హత ఉంది. మరి చంద్రబాబు నాయుడికి అలా అడిగే దమ్ముందా?.. చేసింది చెప్పడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం లేదు. చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడు. ► దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఈ 47 నెలల కాలంలో 2.10లక్షల కోట్ల రూపాయలు డీబీటీ చేశాం, గతానికి, ఇప్పటికీ తేడాను గమనించమని కోరుతున్నాం ► సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుంది. ► చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను ప్రారంభించాం. అదానీ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారుతుంది. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్‌పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేశాం. ► కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. ► మొదటి ఫేజ్‌లో 60 లక్షల మంది రవాణాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల మంది ప్రయాణిస్తారు. ఏ380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఏర్పాట్లు చేస్తాం. ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం గుర్తొస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశాం. ► ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్ సెంటర్ పనులను పూర్తి చేశాం. జూన్ నెలలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను జాతికి అంకితం చేస్తాం. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. ► రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం. ► భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ► విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్రీడీ మోడల్‌ను పరిశీలించిన సీఎం జగన్. కాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ► సీఎం జగన్ భోగాపురం చేరుకున్నారు.. మరికాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ► విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. ► విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ► ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం భూమి పూజ చేస్తారు. ► దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. విజయనగరం పర్యటనలో.. మరో రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు ► తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్.. జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు సీఎం జగన్ సంకల్పించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ చేపట్టారు. 2024 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. ► విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అదానీ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కానున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. ► అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కంట్రోల్-ఎస్‌కు టువర్డ్స్ ఆన్-సైట్ నెట్ జీరో అవార్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కంట్రోల్-ఎస్ డేటాసెంటర్స్ తాజాగా ‘టువర్డ్స్ ఆన్-సైట్ నెట్ జీరో’ అవార్డ్ దక్కించుకుంది. మొనాకోలో జరిగిన డేటాక్లౌడ్ గ్లోబల్ కాంగ్రెస్ 2023 సందర్భంగా కంపెనీ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి అవార్డును స్వీకరించారు. నెట్ కార్బన్ జీరో కార్యక్రమాలు, ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్జీ) లక్ష్యాల పట్ల కంపెనీ నిబద్ధతకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని కంట్రోల్–ఎస్ తెలిపింది. -
విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ డేటా సెంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డేటా సెంటర్, ఐటీ పార్కుల అభివృద్ధి కోసం అదానీ గ్రూపు రూ.21,844 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. మొత్తం 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌తో పాటు బిజినెస్ ఐటీ పార్కు, స్కిల్ కాలేజీ, రిక్రియేషన్ సెంటర్లను అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో కాపులుప్పాడ వద్ద ఎకరం కోటి రూపాయలు చొప్పున 190.29 ఎకరాలను కేటాయించింది. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 39,815 మందికి ఉపాధి లభించనుంది. తొలుత 130 ఎకరాల్లో 200 మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఈ సంస్థ ఆ తర్వాత మరో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. దీంతో మరో 60.29 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్టు కోసం అదానీ గ్రూపు విశాఖ టెక్ పార్క్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటుచేసింది. మే 3న అదానీ గ్రూపు అధికారుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డేటా సెంటర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఏడేళ్లలో 39,815 మందికి ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన ఆధారంగానే రాయితీలు, ప్రోత్సాహకాలను ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీటీపీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఐదు దశల్లో ప్రాజెక్టును ఏడు సంవత్సరాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా 39,815 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని వీటిపీఎల్ సమర్పించిన ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొంది. తొలిదశ మూడేళ్ల కాలంలో కనీసం 40 మోగావాట్ల డేటా సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 30 శాతం మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. నాలుగేళ్లల్లో 50 శాతం మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఏడేళ్లలో పూర్తిగా అందరికీ ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 300 మోగావాట్ల డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 1,860 మందికి ఉపాధి లభించనుండగా, ఐటీ బిజినెస్ పార్క్ ద్వారా 32,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. అలాగే, స్కిల్‌కాలేజీ, రిక్రియేషన్ సెంటర్స్ ద్వారా మరో 3,000 మంది వరకు ఉపాధి లభించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత కేటాయించిన 130 ఎకరాల్లో 82 ఎకరాలు డేటా సెంటర్‌కు, ఐటీ బిజినెస్ పార్కుకు 28 ఎకరాలు, స్కిల్ కేలాజీకి 11 ఎకరాలు, రిక్రియేషన్ సెంటర్‌కు 9 ఎకరాలను కేటాయించింది. -
దేశీయ డేటా సెంటర్ సామర్థ్యంలో.. 25% వాటా లక్ష్యం
సాక్షి, అమరావతి: దేశీయ డేటా సెంటర్ సామర్థ్యంలో కనీసం 20 నుంచి 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.45,920 కోట్ల పెట్టుబడితో 138 డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లు 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో 737 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 2025 నాటికి ఈ డేటా సెంటర్ల సంఖ్య 183కు చేరడం ద్వారా 24 మిలియన్ చదరపు అడుగులతో 1,752 మెగావాట్ల సామర్థ్యానికి విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో కనీసం 20 నుంచి 25 శాతం వాటాను చేజిక్కించుకోవడంలో లక్ష్యంగా రాష్ట్రంలో డేటా సెంటర్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా అదానీ గ్రూపు వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్ పేరుతో 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నం కాపులుప్పాడ వద్ద సుమారు 130 ఎకరాల్లో రూ.7,210 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌తోపాటు ఐటీ, బిజినెస్ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్లను అదానీ గ్రూపు అభివృద్ధి చేయనుంది. దీనిద్వారా 14,825 మందికిఉపాధి లభించనుంది. ఐదు దశల్లో డేటా సెంటర్ అభివృద్ధి భీమునిపట్నం మండలం కాపులుప్పాడ వద్ద 60.29 ఎకరాల్లో ఈ డేటా సెంటర్‌ను ఐదు దశల్లో అభివృద్ధి చేయనుంది. భూమి కేటాయించిన మూడు ఏళ్లలోగా 10 మెగావాట్లుతో ప్రారంభించి నాలుగేళ్లకు 20 మెగావాట్లు, ఐదేళ్లకు 40 మెగావాట్లు, ఆరేళ్లకు 70 మెగావాట్లు, ఏడేళ్లకు 100 మెగావాట్ల సామర్థ్యం చేరుకునే విధంగా వైజాగ్ టెక్‌పార్క్ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఫిబ్రవరి 7, 2022లో భూ కేటాయింపులు చేసింది. అక్కడే నివాసం ఉంటూ పనిచేసుకునే విధంగా వాక్ టు వర్క్ విధానంలో నివాస ప్రాంతాలు, నివాసానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రత్యక్షంగా కల్పించే ఉద్యోగాల కల్పన ఆధారంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ వైజాగ్ టెక్‌పార్క్ నిర్మాణ పనులను మే 3న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రామల శాఖ ప్రణాళిక సిద్ధంచేసుకుంది. -
డేటా సెంటర్లపై రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు
ముంబై: డేటా సెంటర్ల పరిశ్రమలోకి వచ్చే ఆరేళ్ల కాలంలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దీంతో మరో 5,000 మెగావాట్ల సామర్థ్యం డేటా సెంటర్ల పరిశ్రమలో ఏర్పాటవుతుందని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామర్థ్యంతో పోలిస్తే ఆరు రెట్లు పెరగనుందని, మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. డేటా సెంటర్లలో విప్లవాత్మక మార్పునకు స్థానికంగానే డేటా నిల్వ నిబంధనను కారణంగా పేర్కొంది. గడిచిన కొన్నేళ్లలో అదానీ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ సహా ఎన్నో కంపెనీలు డేటా సెంటర్ల వ్యాపారంపై ప్రకటనలను ఈ నివేదిక ప్రస్తావించింది. దేశంలో డిజిటల్ విప్లవానికి ఇంటర్నెట్, మొబైల్ వినియోగం విస్తరణ, ప్రభుత్వ ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా, నూతన టెక్నాలజీల అమలు, సోషల్ మీడియా, ఈకామర్స్, ఓటీటీల విస్తరణ తదితర అంశాలు దోహదపడినట్టు ఇక్రా తెలిపంది. దీనికితోడు డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై విద్యుత్ అందించడం, స్టాంప్ డ్యూటీలో రాయితీలు తదితర నియంత్రణపరమైన అనుకూల విధానాలు పెట్టుబడులు రావడానికి దోహదం చేస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్ల స్థాపిత సామర్థ్యంలో 70–75 శాతం ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్‌లోనే ఉన్నట్టు తెలిపింది. డేటా సెంటర్ల పరిశ్రమ ఆదా యం 2024–25 వరకు వార్షికంగా 17–19 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. -
డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదే...
ముంబై: దేశంలో డేటా సెంటర్ల వ్యాపారంపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రూ.590 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,835 కోట్లు) సమీకరించింది. కోటక్ డేటా సెంటర్ ఫండ్ కింద 800 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు కోటక్ బ్యాంక్‌కు చెందిన కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ (కేఐఏ) ప్రకటించింది. దేశంలో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టే మొదటి ప్రత్యేక ఫండ్ ఇదేనని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న డేటా సెంటర్ సామర్థ్యం మన అవసరాల కంటే తక్కువగానే ఉన్నట్టు కేఐఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్‌షా పేర్కొన్నారు. ‘‘ఇది భారీ పెట్టుబడులు అవసరమైన రంగం. కనుక భారీ ఈక్విటీ పెట్టుబడుల అవకాశాలు ఉంటాయని మేం భావిస్తున్నాం’’అని చెప్పారు. (ఇదీ చదవండి: మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్ కారు.. వోల్వో ప్రామిస్!) -
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి... మరో రూ. 16వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. గత సంవత్సరం ప్రారంభంలో రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో ఒక్కోటీ సగటున 100 మెగావాట్ల ఐటీలోడ్ (సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు వినియోగించిన లేదా వాటి కోసం కేటాయించే విద్యుత్ మొత్తం)తో 3 డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ తాజాగా దావోస్ వేదికగా మరో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన 3 డేటా సెంటర్ల ఏర్పాటుకు మరో రూ. 16 వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొత్తంగా 6 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే 10–15 ఏళ్లలో ఈ డేటా సెంటర్లు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయని పేర్కొంది. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకే ఈ భారీ పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ వివరించింది. మైక్రోసాఫ్ట్‌తో బంధం బలోపేతం: కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో కలసి పనిచేస్తున్నట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 డేటా సెంటర్లు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడం సంతోషకరమన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్లో హైదరాబాదే కీలకమని, భవిష్యత్తులోనూ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. భారత్ కేంద్రంగా తమ సంస్థ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు కీలకంగా మారతాయన్నారు. -
రెండేళ్లలో 25 డేటా సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సెంటర్ల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ కంట్రోల్–ఎస్ 2025 మార్చి నాటికి కేంద్రాల సంఖ్యను 25కు చేరుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఖాతాలో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 డేటా సెంటర్లు ఉన్నాయి. రెండేళ్లలో 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం తోడవనుంది. ప్రస్తుతం నవీ ముంబైలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ డేటా సెంటర్ పార్క్ నిర్మాణంలో ఉంది. ఇదే స్థాయిలో హైదరాబాద్ కేంద్రం నిర్మాణానికి సిద్ధంగా ఉందని కంట్రోల్–ఎస్ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చెన్నై డేటా సెంటర్ పనులు మొదలయ్యాయి. ఈ మూడు కేంద్రాల చేరికతో 600 మెగావాట్ల సామర్థ్యం సంస్థకు జతకూడనుంది. కోల్‌కతలో సైతం ఫెసిలిటీ ఏర్పాటు కానుంది. రేటెడ్–4 డేటా సెంటర్ల నిర్వహణలో కంట్రోల్–ఎస్ ఆసియాలో తొలిస్థానంలో ఉంది. -
డిజిటల్ ఇండియా విజన్‌కు సహకరిస్తాం
న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా విజన్’ సాకారం కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ప్రధాని మోదీతో తన భేటీ చక్కగా జరిగిందని సత్య నాదెళ్ల వెల్లడించారు. డిజిటల్ ఇండియా విజన్ మొత్తం ప్రపంచానికి వెలుగును చూపుతుందని ఉద్ఘాటించారు. తర్వాత మోదీ ట్వీట్ చేశారు. దేశ యువత నూతన ఆలోచనలు భూగోళాన్ని ప్రభావితం చేయగలవని వివరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు బెంగళూరు: భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని నాదెళ్ల తెలిపారు. తమ దారిలోనే ఇతర కంపెనీలు సైతం నడుస్తాయని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ‘ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సదస్సు’లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో భారతదేశ టెక్నాలజీ స్టోరీ విస్తరించడానికి సహకరిస్తామని వ్యాఖ్యానించారు. టెక్నాలజీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. ఇది రాయాల్సిన, మాట్లాడుకోవాల్సిన చరిత్ర అని చెప్పారు. బిర్యానీ.. సౌతిండియా ‘టిఫిన్’ కాదు: సత్య నాదెళ్ల ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే చాట్ రోబో ‘చాట్‌జీపీటీ’లో తనకు ఎదురైన అనుభవాన్ని సత్య నాదెళ్ల వివరించారు. దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న టిఫిన్ల గురించి తాను అడగ్గా.. ఇడ్లి, దోశ, వడతోపాటు బిర్యానీ అంటూ చాట్‌జీపీటీ బదులిచ్చిందని అన్నారు. తాను హైదరాబాదీనని, తన పరిజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దని, బిర్యానీ అనేది టిఫిన్ కాదను తాను గట్టిగా చెప్పడంతో చాట్‌జీపీటీ క్షమాపణ కోరిందని వెల్లడించారు. -
త్వరలోనే ‘అదానీ’కి శంకుస్థాపన.. ఏడేళ్లలో రూ.14,634 కోట్ల పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: రూ.14,634 కోట్లతో పాతికవేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా విశాఖలో అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. లీజు మొత్తం చెల్లించిన అదానీ కోసం హిల్‌పార్క్–4లో 130 ఎకరాలను ఏపీఐఐసీ సిద్ధం చేసి.. సరిహద్దులను కూడా నిర్ణయించింది. త్వరలోనే అదానీ డేటా పార్క్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తేదీలు త్వరలోనే ఖరారు చేయనున్నారని కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. సంస్థ కార్యకలాపాల కోసం ఈ రహదారిని విస్తరించనున్న అదానీ డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ, రిక్రియేషన్ సెంటర్ నిర్మాణాలకు మధురవాడ సర్వే నెంబర్ 409లో ఎకరం రూ.కోటి చొప్పున 130 ఎకరాలను ప్రభుత్వం అదానీ సంస్థకు కేటాయించింది. భూమి ఇచ్చిన మూడేళ్లలోపు కచ్చితంగా కార్యకలాపాలు ప్రారంభించాలని, ఏడేళ్లలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కు ఏర్పాటు చేయనుంది. చదవండి: (రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడిది మానసిక వైకల్యం: కొడాలి నాని) హిల్–4లో అదానీకి స్థలం కేటాయించినట్లు బోర్డు ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ అదానీ కోసం కేటాయించిన స్థలానికి ఎకరానికి రూ. కోటి చొప్పున లీజు మొత్తం నిర్ణయించగా.. మొత్తం రూ.130 కోట్లుని ఇటీవలే సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి చెల్లించారు. అదానీకి అందివ్వాల్సిన భూముల సరిహద్దుల్ని ఏపీఐఐసీ సిద్ధం చేసింది. ఏడేళ్ల కాలం పాటు చెల్లించే స్టేట్ జీఎస్టీ రీయంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించనుంది. మొదటి మూడేళ్ల కాలంలో 30 మెగా వాట్లు డేటా సెంటర్ పార్కు పూర్తి చేయడంతో పాటు, నాలుగేళ్ల నాటికి 60 మెగావాట్లు, 5 ఏళ్లకు 110 మెగావాట్లు, 6 ఏళ్లకు 160 మెగావాట్లు, ఏడేళ్లకు 200 మెగావాట్లు కింద మొత్తం వ్యవస్థని ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగ కల్పన విషయంలోనూ దశలవారీ పురోగతి చూపించనున్నారు. మొదటి మూడేళ్ల కాలంలో 30 శాతం మందికి, ఐదేళ్ల నాటికి 70 శాతం, ఏడేళ్లకు 100 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పన పూర్తి చేయనున్నారు. 200 మెగావాట్ల డేటాసెంటర్ పార్కులో 1240 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, ఐటీ బిజినెస్ పార్కులో 1200 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఐటీ బిజినెస్ పార్కు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐటీ కంపెనీల ద్వారా 21,000 మందికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా 500 మందికి, రిక్రియేషన్ ద్వారా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా అదానీ సెంటర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి: (పవన్ కల్యాణ్‌తో ఆ సినిమా నేనే ప్రొడ్యూస్ చేస్తా: మంత్రి అమర్నాథ్) -
హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్, వందల కోట్లలో పెట్టుబడులు
సింగపూర్‌కు చెందిన ప్రముఖ డైవర్సిఫైడ్ రియల్ఎస్టేట్ సంస్థ క్యాప్టాల్యాండ్ (CapitaLand) వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టుంది. పెట్టుబడులకు స్వర్గధామమైన హైదరాబాద్‌లో రూ.1200కోట్లతో డేటా సెంటర్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా క్యాప్టాల్యాండ్ తన భవిష్యత్ కార్యచరణ వివరించింది. . రానున్న 5 - 7 సంవత్సరాల్లో పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కింద రూ.5వేల కోట్లు, డేటా సెంటర్, ఆఫీస్ స్పేప్రాజెక్ట్ కింద మొత్తంగా రూ.6,200కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా క్యాప్టాల్యాండ్ యాజమాన్యం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. Very Happy to announce that @CapitaLand is investing in a Data Center in Hyderabad with a capacity of 36 MW and an investment ₹1200 Crores scheduled to be developed and deployed by the end of 2024 MoU signed today for the same#HappeningHyderabad pic.twitter.com/mEOohSWRQs — KTR (@KTRTRS) December 6, 2022 -
డేటా సెంటర్స్‌కు రూ.81,247 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని డేటా సెంటర్స్ 2020 నుంచి రూ.81,247 కోట్ల పెట్టుబడులను అందుకున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ‘డేటా వినియోగం పెరుగుతుండడంతో ఇటువంటి కేంద్రాలకు డిమాండ్ అధికం అయింది. పైగా అనేక రాష్ట్రాలు అందించే సబ్సిడీ స్థలం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు మొదలైన ప్రోత్సాహకాలతో డేటా సెంటర్ ఆపరేటర్లు ఉత్సాహంగా ఉన్నారు. అనుకూలమైన ప్రభుత్వ విధానాలతో గత 2–3 ఏళ్లలో ఈ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రస్తుతం డేటా సెంటర్లు 1.03 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరాయి. 2025 నాటికి ఇది రెండంతలు కానుంది. హైదరాబాద్‌సహా ఏడు ప్రధాన నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యం 770 మెగావాట్లకు చేరుకుంది. దాదాపు సగం డేటా కేంద్రాలు ముంబైలో కొలువుదీరాయి. విజయవాడ వంటి నగరాల్లోనూ ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాన సంస్థలు భావిస్తున్నాయి’ అని వివరించింది. -
అదానీ గ్రూప్ 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల వేల్యుయేషన్ గల దిగ్గజ సంస్థల సరసన చేరే లక్ష్యంతో అదానీ గ్రూప్ వ్యూహాలు రచించుకుంటోంది. ఇందులో భాగంగా 150 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టనుంది. పర్యావరణ అనుకూల విద్యుత్ మొదలుకుని డేటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, హెల్త్‌కేర్ మొదలైన విభాగాల్లో ఇన్వెస్ట్ చేయనుంది. వెంచురా సెక్యూరిటీస్ నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగ్షిందర్ ’రాబీ’ సింగ్ ఈ విషయాలు వివరించారు. వచ్చే 5–10 ఏళ్లల్లో హరిత హైడ్రోజన్ వ్యాపారంపై 50–70 బిలియన్ డాలర్లు, విద్యుత్ పంపిణీపై 7 బిలియన్ డాలర్లు, ట్రాన్స్పోర్ట్ యుటిలిటీ వ్యాపారంపై 12 బిలియన్ డాలర్లు, రహదారుల రంగంపై 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సింగ్ తెలిపారు. డేటా సెంటర్ వ్యాపారంపై 6.5 బిలియన్ డాలర్లు, విమానాశ్రయాల విభాగంపై 9–10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. -
గూగుల్‌కు అదానీ డేటా సెంటర్ లీజ్, నెలవారీ అద్దె రూ.11కోట్లు
న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ జాయింట్ వెంచర్ కంపెనీ అయిన అదానీ ఎడ్జ్ కనెక్స్.. నోయిడాలోని తన డేటా కేంద్రంలో 4.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రెయిడెన్ ఇన్ఫోటెక్‌కు లీజ్‌కు ఇచ్చింది. రెయిడెన్ గూగుల్‌కు చెందిన సంస్థ. నెలవారీ అద్దె రూ.11 కోట్లు చెల్లింపుపై పదేళ్ల కాలానికి ఈ డీల్ కుదిరినట్టు సీఆర్ఈ మ్యాట్రిక్స్ అనే సంస్థ వెల్లడించింది. చదరపు అడుగుకు ప్రతి నెలా రూ.235 చెల్లించేలా ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. తొలుత వార్షిక అద్దె రూ.130.89 కోట్లు కాగా, తర్వాత ఏటా ఒక శాతం పెంచేందుకు అంగీకారం కుదిరింది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ సేకరించిన పత్రాల ఆధారంగా గత నెలలోనే ఈ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల అభివృద్ధి, నిర్వహణకు గాను 2021 ఫిబ్రవరిలో అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్‌కనెక్స్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటును ప్రకటించడం తెలిసిందే. చెన్నై, నవీ ముంబై, నోయిడా, వైజాగ్, హైదరాబాద్‌లో హైపర్ స్కేల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది సంస్థ లక్ష్యంగా ఉంది. -
డేటా సెంటర్లు.. భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: డేటా సెంటర్ల వ్యాపారంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. గత ఐదేళ్లలో ఈ విభాగంలోకి 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని.. 2025 నాటికి మొత్తం పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు (రూ.1.6 లక్షల కోట్లు) చేరుకుంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేసింది. స్థిరమైన ఆదాయం వచ్చే ఆస్తుల పట్ల కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిపింది. డేటా సెంటర్లు – రియల్ ఎస్టేట్‌లో డిమాండ్‌పై ఈ సంస్థ మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. విధానపరమైన ప్రోత్సాహం, డిజిటలైజేషన్‌తో దేశంలో డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి టెక్నాలజీ అమలును వేగవంతం చేసిందని, దీంతో డేటా వినియోగం గణనీయమైన స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. ఓటీటీ, ఆన్లైన్ గేమింగ్, స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, ఈ కామర్స్, ఎడ్యుటెక్ ప్లాట్‌ఫామ్‌ల ఆన్లైన్ విద్య, లొకేషన్ ఆధారిత పని, అత్యాధుని టెక్నాలజీలు.. మెషిన్ లెర్నింగ్, 5జీ, బ్లాక్‌చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలసి డేటా ట్రాన్స్‌మిషన్‌ను ఎన్నో రెట్లు పెంచినట్టు.. అధిక సామర్థ్యం కలిగిన సర్వర్ల అవసరం ఏర్పడినట్టు వివరించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం డేటా సెంటర్లు అన్నవి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు రియల్ ఎస్టేట్‌లో ముఖ్యమైన ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారినట్టు సీబీఆర్ఈ పేర్కొంది. స్థిరమైన ఆదాయం కోసం ఇన్వెస్టర్లు చూస్తున్నందున ఈ రంగంలో పెట్టుబడులు మరిన్ని గరిష్టాలకు చేరాతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం డేటా కేంద్రాలకు మౌలికరంగ హోదాను కల్పించడాన్ని కూడా సానుకూలంగా పేర్కొంది. ఇది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనా వేసింది. ఈ సానుకూలతలతోనే 2025 నాటికి పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లు దాటతాయన్న అంచనాతో ఉంది. అంటే గత ఐదేళ్లలో వచ్చిన 14 బిలియన్ డాలర్లకు అదనంగా, వచ్చే ఐదేళ్లలో మరో 6 బిలియన్ డాలర్ల నిధులు ఈ రంగంలోకి రానున్నాయి. వివిధ రంగాల్లోని వ్యాపారాలు డిజిటల్ విభాగంలోకి విస్తరిస్తున్నందున డేటా కేంద్రాలకు డిమాండ్ పెరుగుతుందని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. టెక్నాలజీ, ఆటోమేషన్ అన్నవి వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో డేటా కేంద్రాలు ఏ విధంగా విస్తరిస్తాయనేదానికి కీలకమని పేర్కొంది. -
దేశంలో జోరుగా డేటా సెంటర్ల వ్యాపార విస్తరణ!
న్యూఢిల్లీ: డేటా సెంటర్ల వ్యాపార విస్తరణ దేశంలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే 138 డేటా కేంద్రాలతో ఈ పరిశ్రమ 5.6 బిలియన్ డాలర్ల (రూ.44,800 కోట్లు) స్థాయికి చేరుకుంది. 2025 నాటికి కొత్తగా 45 డేటా సెంటర్లు ఏర్పాటవుతాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ పేర్కొంది. బిన్స్వేంజర్తో కలసి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రస్తుతం ఉన్న 138 డేటా కేంద్రాలు 11 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో 737 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో ఉన్నాయి. ఇందులో 57 శాతం సామర్థ్యం ముంబై, చెన్నైలోనే ఏర్పాటై ఉంది. మరో 13 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో 1,015 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో 45 డేటా కేంద్రాలు వచ్చే మూడేళ్లలో ఏర్పాటు కానున్నాయి. ఇందులోనూ 69 శాతం సామర్థ్యం చెన్నై, ముంబైలోనే ఏర్పాటు కానుంది. కొత్తవి కూడా కార్యకలాపాలు ప్రారంభించిన అనంతరం దేశవ్యాప్తంగా 183 డేటా సెంటర్లు, 24 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో, 1,752 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో ఉంటాయి. భారత్‌లో డేటా సెంటర్ల వ్యాపారం పరిణామ క్రమంలో ఉందని నివేదిక పేర్కొంది. టెక్నాలజీ, డిజిటైజేషన్ డిమాండ్ ‘‘టెక్నాలజీ ఆమోదం, డిజిటైజేషన్ అన్నది అన్ని రంగాల్లోనూ వేగంగా కొనసాగుతోంది. భారత్ కూడా ఒక దశాబ్దం పాటు దీని ఒరవడిని చూస్తుంది. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల డిమాండ్ 2025 నాటికి 2,100 మెగావాట్లకు చేరుతుంది’’అని అనరాక్ క్యాపిటల్ ప్రెసిడెంట్ దేవిశంకర్ తెలిపారు. భవిష్యత్తులో 2,688 మెగావాట్ల మేర ప్రణాళికలేని అదనపు సరఫరా భారత మార్కెట్లోకి వస్తుందన్నారు. భిన్న రంగాల్లోని డేటా సంబంధిత సదుపాయాల నిర్వహణలో అనుభవం కలిగిన నిపుణులు ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. -
పదేళ్లలో 1,000 మెగావాట్ల డేటా సెంటర్లు
పనాజీ: వచ్చే పదేళ్ల వ్యవధిలో 1,000 మెగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ సంస్థ అదానీకనెక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ భూటాని తెలిపారు. తొలి ఏడు డేటా సెంటర్లను ఆరు నగరాల్లో (హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పుణె) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం పరిశ్రమ స్థాయి 550 మెగావాట్లుగా ఉంది. మేము 1,000 మెగావాట్ల డేటా సెంటర్లు నిర్మించబోతున్నాం. వచ్చే దశాబ్ద కాలంలో వీటిని ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం‘అని 9.9 గ్రూప్ సీఐవో, లీడర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా భూటాని తెలిపారు. ఆరు నగరాల్లో వచ్చే మూడేళ్లలో నెలకొల్పే తొలి ఏడు డేటా సెంటర్ల సామర్థ్యం 450 మెగావాట్లుగా ఉంటుందన్నారు. మిగతా 550 మెగావాట్ల సెంటర్లను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఎడ్జ్‌కనెక్స్‌తో కలిసి అదానీ ఎంటర్ప్రైజెస్ గతేడాది ఫిబ్రవరిలో చెరి సగం వాటాలతో అదానీకనెక్స్ను ఏర్పాటు చేసింది. డేటా సెంటర్లకు కేంద్రం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇవ్వడం, ఏడు రాష్ట్రాలు ఇప్పటికే పాలసీ రూపొందించడం తదితర అంశాలు కంపెనీకి కలిసిరాగలవని భూటాని తెలిపారు. భారత్‌లో 550 మెగావాట్ల డేటా సెంటర్లు ఉన్నప్పటికీ చాలా మటుకు డేటా హోస్టింగ్ దేశానికి వెలుపలే ఉంటోందన్నారు. భారత్‌ను అంతర్జాతీయ డిజిటల్ హబ్‌గా మార్చాలంటే ఇతర దేశాల డేటాను కూడా దేశీయంగా హోస్ట్ చేసే సామర్థ్యాలు సాధించాల్సిన అవసరం ఉందని భూటాని చెప్పారు. వినియోగించే విద్యుత్ ప్రాతిపదికన డేటా సెంటర్ సామర్థ్యాన్ని లెక్కిస్తారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ అరిజ్టోన్ అంచనాల ప్రకారం 2021లో భారత డేటా సెంటర్ మార్కెట్ పరిమాణం 447 మెగావాట్లుగా, విలువపరంగా 10.9 బిలియన్ డాలర్లుగా ఉంది. -
హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ వృద్ధికి ఓపెన్ డేటా సెంటర్లు బూస్టప్ ఇస్తున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,423 డేటా సెంటర్లుండగా నగరంలో సుమారు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, నెట్వర్క్ అభివృద్ధితోపాటు వివిధ రకాల సేవల అనుసంధానం, డిజిటల్, సాఫ్ట్‌నెట్ సేవలను అందించేందుకు ఈ కేంద్రాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ రంగానికి కేరాఫ్‌గా నిలిచిన గ్రేటర్ సిటీలో టీఎస్ఐసీ, వీహబ్, టీహబ్, టీవర్క్స్, టాస్క్ తదితర సంస్థల ద్వారా స్టార్టప్‌లను ఇతోధికంగా ప్రోత్సహించడంతోపాటు నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. టీ ఫైబర్‌కు కేంద్రం అనుమతి లిభించడంతో డిజిటల్ సేవలు మరింత విస్తృతం కానున్నాయని తెలిపారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 17,328 కి.మీ. మార్గంలో కేబుల్ లైన్ ఏర్పాటైనట్లు తెలిపారు. మరో ఐదు వేల కిలోమీటర్ల మేర కేబుల్‌ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నలుచెరుగులా విస్తరణకు చర్యలు.. నగరం నలుచెరుగులా ఐటీ వృద్ధికి ఐటీ శాఖ చర్యలు ప్రారంభించింది. తాజాగా కండ్లకోయ గేట్‌వే ఐటీ పార్క్ విస్తీర్ణాన్ని 6 లక్షల చదరపు అడుగుల నుంచి 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచింది. త్వరలో ఈ పార్క్ నిర్మాణం మొదలు కానుంది. కాగా ఈ పార్క్‌కు సమీపంలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. నగరంలో నలు చెరుగులా టెకీలు ఐటీ ఉ ద్యోగాలు చేసేలా నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు ఐటీ శాఖ చర్యలు చేపట్టడం విశేషం. టాప్ కంపెనీలకు చిరునామా.. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 7.78 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే.(క్లిక్: కొత్త స్మార్ట్ఫోన్లు ఎందుకు పాడవుతాయో తెలుసా?) ఏటా పెరుగుతున్న ఎగుమతులు.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ బూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఏటా రూ. 1.83 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటతాయని ఐటీ వర్గాలు అంచనా వేస్తుండడం విశేషం. (క్లిక్: హైదరాబాద్ పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే..) -
చిప్ ఆధారిత ఈ- పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా!
ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఆధ్వర్యంలో ఈ -పాస్‌పోర్ట్‌ను ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకొని రానుంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పాస్ పోర్ట్ కార్యకలాపాలు కొనసాగుతాయి. 2008లో తొలిసారి కేంద్రం పాస్‌పోర్ట్ సేవల్ని ఆన్లైన్లో అందించడం ప్రారంభించింది. ఇప్పుడు 2వ సారి టీసీఎస్ సంస్థ భాగస్వామ్యంతో ఈ- పాస్‌పోర్ట్ సేవల్ని అందించనుంది. ఇమ్మిగ్రేషన్ అంటే? ఇమ్మిగ్రేషన్ అంటే ఉదాహరణకు భారత్‌కు చెందిన వ్యక్తి అమెరికాలో శాస్వతంగా ఉండేందుకు,లేదంటే పౌరసత్వం పొందేందుకు ఆ దేశ అనుమతి తప్పని సరి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అనుమతి కోసం జరిగే ప్రాసెస్‌ను ఇమ్మిగ్రేషన్ అంటారు. ఈ ఇమ్మిగ్రేషన్ కోసం కేంద్రం,టీసీఎస్‌లు సంయుక్తంగా ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-పాస్‌పోర్ట్‌పై టీసీఎస్ పబ్లిక్ సెక్టార్ బిజినెస్ యూనిట్ విభాగం ప్రతినిధి తేజ్ బట్లా స్పందించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డిసెంబర్ నాటికే వినియోగదారులకు ఈ-పాస్‌పోర్ట్‌లను అందించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పాస్‌పోర్ట్‌లను చిప్‌లతో ఆధునీకరించనున్నట్లు తేజ్బట్లా వెల్లడించారు. పలు నివేదికల ప్రకారం.. పలు నివేదికల ప్రకారం..ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌లో జరిగే అవకతవకల్ని అరికట్టేందుకు ఇంట్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐడీఏఓ) సెక్యూర్ బయోమెట్రిక్ డేటాతో ఈ-పాస్ పోర్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో దేశానికి ఒక్కో డిజిటల్ సిగ్నేచర్‌తో ఉన్న ఈ చిప్‌లలో పాస్‌పోర్ట్ వినియోగదారుల బయోగ్రఫికల్ డేటాతో పాటు డిజిటల్ సెక్యూరిటీ ఫీచర్ల డేటా ఉంటుంది. ఆ డేటా సాయంతో ఇమ్మిగ్రేషన్‌లో తలెత్తే లోపాల్ని అరికట్టవచ్చు. సెమీకండక్టర్ చిప్ సమస్య కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సెమీకండక్టర్ చిప్ తయారీ తగ్గిపోయింది. దీంతో అన్నీ డివైజ్‌లలో ఉపయోగించే చిప్ కొరత ఆయా సంస్థల్ని తీవ్రంగా వేదిస్తోంది. కానీ ఈ-పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ముందుగానే కావాల్సిన చిప్‌లను సిద్ధంగా ఉంచుకుందని తేజ్ బట్లా తెలిపారు. రెండు డేటా సెంటర్లు ఈ-పాస్‌పోర్ట్ వినియోగదారుల డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్ల అవసరం ఎక్కువగా ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా రెండు ప్రాంతాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న డేటా సెంటర్లను ఆదునీకరించనున్నట్లు వెల్లడించారు. టీసీఎస్ లక్ష్యం అదే ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్న టీసీఎస్ వినియోగదారులకు అందించే సేవల్ని మరింత సులభతరం చేయనుంది. చాట్ బోట్, బయోమెట్రిక్‌తో ఆటో రెస్పాన్స్ వంటి ఫీచర్లను ఈ ఈ-పాస్ పోర్ట్‌కు జత చేయనుంది. -
దేశంలో దిగ్గజ కంపెనీల పెట్టుబడుల సునామీ..!
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. దేశ, విదేశ సంస్థలు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఈ విభాగంలోకి దాదాపు రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఐబీఎం, ఉబర్, డ్రాప్‌బాక్స్ మొదలైన బడా సంస్థలు తమ డేటా స్టోరేజీని థర్డ్ పార్టీ డేటా సెంటర్ ప్రొవైడర్లకు అవుట్సోర్సింగ్ చేస్తున్నాయని వివరించింది. హీరనందానీ గ్రూప్, అదానీ గ్రూప్ లాంటి దేశీ కార్పొరేట్ దిగ్గజాలతో పాటు అమెజాన్, ఎడ్జ్‌కనెక్స్, మైక్రోసాఫ్ట్, క్యాపిటలాండ్, మంత్ర గ్రూప్ వంటి విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారతీయ డేటా సెంటర్లలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాయి. ‘వాటితో పాటు ఎన్టీటీ, కంట్రోల్ఎస్, ఎన్ఎక్స్ట్రా, ఎస్టీటీ ఇండియా మొదలైనవి తమ సామర్థ్యాలను మరింతగా పెంచుకుంటున్నాయి. మొత్తం మీద రాబోయే అయిదేళ్లలో 3900–4100 మెగావాట్ల సామర్థ్యం సాధించేందుకు సుమారు 1.05–1.20 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది‘ అని ఇక్రా తెలిపింది. ఆదాయాల వృద్ధి.. 2022–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో పరిశ్రమ ఆదాయాలు వార్షికంగా 18–19 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. ర్యాక్ సామర్థ్యాల వినియోగం పెంచుకోవడం, కొత్త డేటా సెంటర్ల విస్తరణ ఇందుకు దోహదపడనున్నాయి. ఆదాయాలు పెరగడం, స్థిర వ్యయాలను తగ్గించుకోగలగడం వంటి అంశాల ఊతంతో డేటా సెంటర్ కంపెనీల నిర్వహణ మార్జిన్లు మెరుగుపడవచ్చని ఇక్రా పేర్కొంది. 40–42 శాతం శ్రేణిలో ఉండొచ్చని తెలిపింది. ‘నియంత్రణ విధానాలపరంగా తోడ్పాటు, భారీగా పెరుగుతున్న క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ ఎకానమీపై .. కొత్త టెక్నాలజీలపై (ఐవోటీ, 5జీ మొదలైనవి) ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుండటం వంటి అంశాలు దేశీయంగా డేటా సెంటర్ల డిమాండ్‌కు తోడ్పడగలవు‘ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ గ్రూప్ హెడ్ రాజేశ్వర్ బర్ల తెలిపారు. 2022–23 బడ్జెట్లో డేటా సెంటర్లకు కేంద్రం ఇన్ఫ్రా రంగ హోదా కల్పించింది. తక్కువ వడ్డీ రేట్లపై దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు, నిర్దిష్ట మార్గాల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు ఇది వాటికి ఉపయోగపడుతుంది. -
అదానీ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ సిగలో మరో దిగ్గజ సంస్థ మణిహారంగా చేరనుంది. దేశంలో అతి పెద్ద డేటాసెంటర్‌ను విశాఖ నగరంలో ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రముఖ సంస్థ అదానీ మధురవాడ సమీపంలో డేటా సెంటర్ పార్కుతో పాటు బిజినెస్ పార్కు, ఐటీ సంస్థ, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన లే అవుట్ ప్లాన్‌కు వీఎంఆర్డీఏ అనుమతులు మంజూరు చేయడంతో కీలక అడుగు పడింది. డేటా సెంటర్ పార్క్, ఐటీ బిజినెస్ పార్కు, నైపుణ్యాభివృద్ధి వర్సిటీ నిర్మాణాలకు మధురవాడ సర్వే నంబర్ 409లో ఎకరానికి రూ.కోటి చొప్పున 130 ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో 82 ఎకరాల్లో 200 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ పార్కు, 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్ పార్కు, 11 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, 9 ఎకరాల్లో రిక్రియేషన్ పార్కు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. 20 ఏళ్ల పాటు ప్రభుత్వం విద్యుత్ ప్రోత్సాహకాలు అందించనుంది. ఇందుకోసం సంస్థ ఏకంగా రూ.14,634 కోట్లను వెచ్చించనుంది. ఫలితంగా 24,990 మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అనుగుణంగా వైజాగ్ టెక్ పార్కు పేరుతో తనకు అనుబంధంగా 100 శాతం సబ్సిడరీ సంస్థను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను అదానీ సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఏడేళ్లు రూ.14,634 కోట్లు అదానీ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్‌కు ఐటీ పాలసీ ప్రకారం అన్ని విధాల సహకారాలు అందించేందుకు ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ(ఏపీఈఐటీఏ), కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ది ఐటీ ఇండస్ట్రీతో పాటు ఏపీఐఐసీని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. మొదటి మూడేళ్ల కాలంలో 30 మెగా వాట్లు (ఎంవీ) డేటా సెంటర్ పార్కు పూర్తి చేయాలని, నాలుగేళ్ల నాటికి 60 మెగావాట్లు, 5 ఏళ్లకు 110 మెగావాట్లు, 6 ఏళ్లకు 160 మెగావాట్లు, ఏడేళ్లకు 200 మెగావాట్లు కింద మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఏడేళ్ల కాలంలో దశలవారీగా పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం రూ.14,634 కోట్ల భారీ పెట్టుబడులతో అదానీ సంస్థ తమ ప్రాజెక్టును విశాఖలో విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం 100 శాతం సబ్సిడరీతో వైజాగ్ టెక్ పార్క్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని 13 నవంబరు 2021న అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుమార్లు ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో అభివృద్ధి పనులకు సంబంధించిన పురోగతిని పరిశీలించేందుకు అదానీ కంపెనీ ప్రతినిధులు మధురవాడలో పర్యటించారు. ప్రత్యక్ష, పరోక్షంగా 24,990 మందికి ఉపాధి దేశంలోనే మొట్టమొదటి మెగా డేటా సెంటర్ ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. డేటా సెంటర్‌తో పాటు ఏర్పాటు కానున్న ఐటీ బిజినెస్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్‌వల్ల రానున్న ఏడేళ్ల కాలంలో ఏకంగా 24,990 మందికి ఉపాధి కల్పిస్తామని ఇప్పటికే కంపెనీ హామీనిచ్చింది. మొదటి మూడేళ్ల కాలంలో 30 శాతం మందికి, ఐదేళ్ల నాటికి 70 శాతం, ఏడేళ్ల కాలంలో 100 శాతం ఉద్యోగ, ఉపాధి కల్పన పూర్తి చేయనున్నారు. 200 మెగావాట్ల డేటాసెంటర్ పార్కులో 1,240 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, ఐటీ బిజినెస్ పార్కులో 1,200 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఐటీ బిజినెస్ పార్కు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐటీ కంపెనీల ద్వారా 21,000 మందికి ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా 500 మందికి, రిక్రియేషన్ ద్వారా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా అదానీ సెంటర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా మొత్తంగా 24,990 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. లే–అవుట్ అనుమతులు వచ్చాయి మధురవాడలో ఏర్పాటు కానున్న అదానీ డేటా సెంటర్లో నిర్మాణాల కోసం లే–అవుట్ ప్లాన్‌కు వీఎంఆర్డీఏ అనుమతినిచ్చింది. భూమి కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు పలుసార్లు కేటాయించిన భూమిని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సెంటర్ ఏర్పాటు కోసం రూ. 14,634 కోట్ల పెట్టుబడులు సంస్థ పెట్టనుంది. తద్వారా 24,990 మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ హామీనిచ్చింది. – యతిరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ -
భూముల రీ సర్వేపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్ట్‌ను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని టేపీ జియో స్పేషియల్ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయా శాఖల అధికారులు చర్చించారు. ఉప్పల్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో నిర్వహించిన ఈ కీలక సమావేశానికి 12 మంది నోడల్ అధికారులతో కలిసి రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థజైన్ నేతృత్వం వహించగా, జియో స్పేషియల్ డేటా సెంటర్ డైరెక్టర్ ఎస్వీ సింగ్ తన బృందంతో పాల్గొన్నారు. డేటా సెంటర్‌కు సంచాలకులుగా సింగ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రీసర్వే ప్రాజెక్ట్‌కు సంబంధించి పలు అంశాలపై లోతుగా చర్చించారు. ప్రాజెక్ట్ పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అంశాలు, ఇకపై చేయవలసిన కార్యక్రమాలు, కాలపరిమితి వంటి అంశాలపై సమావేశం సాగింది. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయడంతో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ సాగింది. మెరుగైన సామర్థ్యం కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలి, మరిన్ని శిక్షణలు ఇవ్వాల్సిన ఆవశ్యకత తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సమావేశంలో సర్వే సెటిల్మెంట్ కమిషనర్ కార్యాలయ సంయుక్త సంచాలకుడు ప్రభాకరరావు, రాష్ట్ర సర్వే శిక్షణ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ కుమార్, ప్రత్యేక అధికారి అజయ్‌నాయక్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో జోరుమీదున్న బిజినెస్ ఇదే!
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో పరిమాణాన్ని పెంచుకోవడంతోపాటు, వృద్ధి కొనసాగనున్నట్లు ఎన్ఎక్స్ట్రా, జేఎల్ఎల్ రూపొందించిన నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిపుచ్చుకోవడం, డిజిటల్, క్లౌడ్ వినియోగం పెరగడం, 5జీ అందుబాటులోకి రానుండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నట్లు ఈ సంయుక్త నివేదిక విశ్లేషించింది. డేటా సెంటర్ల బిజినెస్‌లో ప్రధానంగా ముంబై, చెన్నైలలో అధిక వృద్ధి నమోదవుతున్నట్లు పేర్కొంది. ఇందుకు అనువైన మౌలికసదుపాయాలు, వ్యూహాత్మక ప్రాంతాలుకావడం, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు సహకరిస్తున్నట్లు తెలియజేసింది. ఇవన్నీ వృద్ధికి దన్నునిస్తున్నట్లు తెలియజేసింది. ‘దేశీయంగా విస్తరిస్తున్న డిజిటల్ విప్లవం: డేటా సెంటర్లు’ పేరుతో రూపొందించిన నివేదికలోని ఇతర వివరాలు ఇలా.. తీరప్రాంత పట్టణాలు దేశీయంగా కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండటంతో డేటా సెంటర్ల భవిష్యత్ ప్రధానంగా తీరప్రాంత(కోస్టల్) పట్టణాలపై ఆధారపడి ఉంది. అయితే ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి ల్యాండ్లాక్డ్ పట్టణాలు సైతం పరిశ్రమ వృద్ధితో లబ్ది పొందనున్నాయి. డేటా రక్షణ, క్లౌడ్ సంస్థల నుంచి భారీ డిమాండ్, క్యాప్టివ్ నుంచి క్లౌడ్‌కు మార్పు, డిజిటల్‌వైపు ప్రభుత్వ చర్యలు, పెట్టుబడుల వంటి పలు అంశాలు డేటా సెంటర్ల పరిశ్రమకు జోష్‌నిస్తున్నాయి. నివేదికను భారతీ ఎయిర్టెల్ అనుబంధ డేటా సెంటర్ల సంస్థ ఎన్ఎక్స్ట్రా, రియల్టీ కన్సల్టెన్సీ, ప్రొఫెషనల్ సర్వీ సుల కంపెనీ జేఎల్ఎల్ ఇండియా సంయుక్తంగా రూపొందించాయి. చదవండి: రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ! -
దేశంలో డేటా సైన్స్ రంగం వేగంగా పుంజుకుంటోంది: కేటీఆర్
-
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా డిజిటల్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి పెద్ద డేటా సెంటర్ రీజియన్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దశలవారీగా నిర్మిస్తున్న ఈ సెంటర్లో మొదటి ఫేజ్ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో ఇది ఏర్పాటు అవుతున్నట్లు డేటా సెంటర్ ప్రకటనకు సంబంధించి కంపెనీ సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ‘‘భారత్‌లో అత్యంత భారీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానం కావడం సంతోషంగా ఉంది. వచ్చే 15 ఏళ్లలో దీనిపై రూ. 15,000 కోట్ల మేర సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణలోకి వచ్చిన అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) ఇది రెండోది అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. డేటా సెంటర్ పరోక్షంగా స్థానిక వ్యాపారాల అభివృద్ధికి .. ఐటీ కార్యకలాపాలు, ఫెసిలిటీల మేనేజ్మెంట్, డేటా .. నెట్వర్క్ భద్రత, నెట్వర్క్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాల కల్పనకు దోహదపడగలదని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ తదితరులు పాల్గొన్నారు. భారత్‌లో నాలుగోది ... మైక్రోసాఫ్ట్‌కి ఇప్పటికే పుణే, ముంబై, చెన్నైలో మూడు డేటా సెంటర్ రీజియన్లు ఉండగా .. హైదరాబాద్‌లోని నాలుగోది కానుంది. ఇది కంపెనీలు, స్టార్టప్‌లు, డెవలపర్లు, ప్రభుత్వ సంస్థలు మొదలైన క్లయింట్లకు క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) తదితర సొల్యూషన్స్ అందించనుంది. సాధారణంగా ఇలాంటి డేటా సెంటర్ ఏర్పాటుకు కనీసం 24 నెలలు పడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి చెప్పారు. క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ దీన్ని అతి పెద్ద సెంటర్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు.. భారత ఎకానమీకి 9.5 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని సమకూర్చాయని అనంత్ మహేశ్వరి వివరించారు. చదవండి: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు -
ఇండియా డేటా ఆఫీస్.. ఇది అందుబాటులోకి వస్తే...
న్యూఢిల్లీ: ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల డేటా బహిరంగంగా అందుబాటులో ఉంచే విధంగా కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కసరత్తు చేస్తోంది. డేటా అందుబాటులో ఉండటం, వినియోగానికి సంబంధించి భారత ప్రభుత్వ విధానం ముసాయిదాను రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ముసాయిదా సిద్ధం ఇప్పటికే రూపొందించిన ముసాయిదా ప్రకారం వివిధ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఆధీకృత ఏజెన్సీలకు సంబంధించిన సమాచారంతో పాటు వాటి ద్వారా ప్రభుత్వం సేకరించే డేటా కూడా బహిరంగంగా అందుబాటులో ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి డిఫాల్టుగా వివిధ విభాగాలు, సంబంధిత వర్గాలు ఒకరికొకరు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. ఒక మోస్తరుగా ప్రాసెస్ చేసిన డేటా ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. అయితే, పరిమితులు వర్తించే డేటాను పొందేందుకు కొంత రుసుములు చెల్లించాల్సి వస్తుంది. అది ఎంత మొత్తం ఉండాలనేది.. ఆయా విభాగాలు, ఏజెన్సీలు పారదర్శకంగా నోటిఫై చేయాలి. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు మార్చి 18లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇండియా డేటా ఆఫీస్.. ఇలా డేటా యాక్సెస్, షేరింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు ‘ఇండియా డేటా ఆఫీస్’ను ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ ప్రతిపాదించింది. వివిధ శాఖలు, విభాగాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇది సంప్రదింపులు కూడా జరపాల్సి ఉంటుంది. ఇండియా డేటా ఆఫీసర్, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల చీఫ్ డేటా ఆఫీసర్లు ఇందులో భాగంగా ఉంటారు. ‘ప్రతి శాఖ/విభాగంలో చీఫ్ డేటా ఆఫీసర్ల నేతృత్వంలో డేటా మేనేజ్మెంట్ యూనిట్లు ఉండాలి. డేటా పాలసీ అమలు కోసం ఇండియా డేటా ఆఫీస్‌తో ఇవి కలిసి పనిచేయాలి‘ అని పేర్కొంది. డిజిటల్ ఎకానమీ భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఎదిగే క్రమంలో డేటాను సమర్థమంతంగా వినియోగించుకోవడంపై ఆధారపడి ఉంటుందని ముసాయిదా పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే .. ప్రస్తుత, కొంగొత్త టెక్నాలజీలకు అనుగుణంగా నాణ్యమైన డేటాను అందుబాటులో ఉంచడం, వినియోగం మెరుగుపర్చాలన్నది డేటా పాలసీ లక్ష్యమని తెలిపింది. మరోవైపు, పౌరుల వివరాల గోప్యత కాపాడేందుకు ఉపయోగపడే ప్రతిపాదనలు కూడా ఇందులో ప్రస్తావించారు. -
మెగా సిటీకి ఐటీ మకుటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ రంగానికి మరింత ఊపు రానుంది. డేటా సెంటర్ల రంగంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. శంషాబాద్ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం, మైక్రోసాఫ్ట్ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరిలో అధికారికంగా సంయుక్త ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ద్వారా తొలి విడతలో సుమారు 300 మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని సమాచారం. అయితే డేటా సెంటర్ సామర్ధ్యం, విస్తీర్ణం తదితర పూర్తి వివరాలను వచ్చే నెలలోనే మైక్రోసాఫ్ట్ ప్రకటిస్తుంది. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే సత్తా చాటుతున్న హైదరాబాద్ క్రమంగా ఆధునిక సాంకేతిక పెట్టుబడులకు కూడా గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక ఐటీ సాంకేతికతలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న సంగతి తెలిసిందే. 9.5 శాతం వాటా సాధన లక్ష్యం ప్రస్తుతం భారత్‌లో 57.8 కోట్ల మొబైల్ ఫోన్ల వినియోగదారులు ఉండగా, మొబైల్ ఫోన్లు, వైర్లెస్ డేటా వినియోగంలో 20 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో డేటా సెంటర్ల రంగం మార్కెట్ ఈ ఏడాది చివరి నాటికి సుమారు లక్షా 11 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. డేటా సెంటర్ల రంగంలో ఇప్పటికే ఏడు శాతం వాటా కలిగి ఉన్న తెలంగాణ, వచ్చే ఏడాది చివరి నాటి 9.5 శాతం వాటా సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఫ్లిప్‌కార్ట్, కంట్రోల్ ఎస్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), ఎస్టీ టెలీమీడియా వంటి సంస్థలు ఇప్పటికే డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. నిర్మాణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్లు మరోవైపు హైదరాబాద్‌లో రూ.20,761 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) 2020 నవంబర్‌లో ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు మరింత ఊపందుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని విధాలా అనుకూలంగా హైదరాబాద్ రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో కీలక ప్రకటన చేస్తాం. ప్రభుత్వ సానుకూల విధానాలు, ప్రోత్సాహకాలు, ఐటీ నిపుణుల లభ్యత, భౌగోళిక పరిస్థితులు హైదరాబాద్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా మారాయి. – జయేశ్ రంజన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి డేటా సెంటర్ అంటే.. డేటా సెంటర్లలో సమాచారాన్ని భద్రపరు స్తారు. ఐటీ కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలా పాల నిర్వహణలో ఈ సెంటర్ల పాత్ర కీలకం. మొబైల్ డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల సమాచారాన్ని భద్ర పరచడంలో ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగు తోంది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో విని యోగదారుల సమాచారాన్ని భద్రపరిచేం దుకు భారీ ఎత్తున డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది. దీంతో ఈ సెంటర్ల నిర్మాణానికి ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. భారీ విస్తీర్ణంలో నిర్మించే డేటా సెంటర్ల నిర్మాణం, నిర్వహణ కూడా ప్రస్తుతం ఒక పెట్టుబడి, ఉద్యోగాల కల్పనకు అవకాశమున్న రంగంగా మారింది. -
రియల్టీ పెట్టుబడులు అప్
న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 17 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ3)లో 72.1 కోట్ల డాలర్ల(రూ. 5,430 కోట్లు)కు చేరాయి. హౌసింగ్ డేటా సెంటర్, వేర్‌హౌసింగ్ ప్రాజెక్టులకు ప్రధానంగా నిధులు ప్రవహించినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, పీఈ సంస్థలు తదితరాలున్నాయి. వీటితోపాటు ఆర్‌ఈఐటీలలో యాంకర్ ఇన్వెస్టర్లు సైతం చేరినట్లు నివేదికలో జేఎల్ఎల్ తెలియజేసింది. పబ్లిక్ డొమైన్లో ఉంచిన వివరాల ఆధారంగా గణాంకాలను రూపొందినట్లు వెల్లడించింది. టెర్మ్ షీట్‌పై సంతకాలు లేదా లావాదేవీల ప్రకటనల ఆధారంగా పెట్టుబడుల కాలాన్ని పరిగణించినట్లు పేర్కొంది. ఇది పెట్టుబడుల బదిలీ ఆధారితంకానప్పటికీ డేటా సెంటర్ విభాగంలో మాత్రం వీటిని మదింపు చేసినట్లు వివరించింది. అనిశి్చతులు, అవాంతరాల నేపథ్యంలోనూ క్యూ3లో 17 శాతం పెట్టుబడులు లభించినట్లు ప్రస్తావించింది. అయితే త్రైమాసికవారీగా చూస్తే 47 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. వివరాలిలా రెసిడెన్షియల్ రంగంలో 21.1 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించగా.. డేటా సెంటర్‌కు 16.1 కోట్ల డాలర్లు, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులకు 13.7 కోట్ల డాలర్లు చొప్పున అందినట్లు జేఎల్ఎల్ పేర్కొంది. అయితే కార్యాలయ విభాగంలో పెట్టుబడులు 40.5 కోట్ల డాలర్ల నుంచి 10 కోట్ల డాలర్లకు భారీగా క్షీణించాయి. ఇక వేర్‌హౌసింగ్ విభాగంలో 9.4 కోట్ల డాలర్లు, భూములకు 1.8 కోట్ల డాలర్లు చొప్పున ఇన్వెస్ట్మెంట్స్ లభించాయి. -
ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల మార్పులు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కార్యాలయాలన్నిటిలో పాత నెట్‌వర్క్‌ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ప్రజలకు మరింత వేగంగా, నాణ్యంగా సేవలు అందించడమే లక్ష్యంగా పలు మార్పులు చేస్తున్నారు. గతంలో ఏపీ, తెలంగాణ మధ్య డేటా సర్వర్ విభజన జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటీవలే ఆ డేటా సర్వర్ విభజనను పూర్తిచేసి.. హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్’కు తరలించారు. అక్కడ ఏపీ సెంట్రల్ సర్వర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన సమస్య పరిష్కారమైనట్లు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు. అలాగే గతంలో తహశీల్దార్ కార్యాలయాల నుంచి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలు డేటా సెంటర్‌కు అనుసంధానమై ఉండేవి. దీనివల్ల జాప్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా మార్చి నేరుగా డేటా సెంటర్‌కు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అనుసంధానించనున్నారు. ఒరాకిల్ నుంచి జావాకు.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో ఒరాకిల్ సాప్ట్వేర్ వినియోగిస్తున్నారు. వీటిని 2011లో ఏర్పాటుచేశారు. దీనివల్ల పని చాలా నెమ్మదిగా జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే కంప్యూటర్ నెట్‌వర్క్‌ను జావా సాఫ్ట్వేర్కి మార్చనున్నారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో జరిగే జాప్యం చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. అవసరమైన సాఫ్ట్వేర్లకు కొత్తగా లైసెన్సులు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించారు. కంప్యూటర్ల నెట్వర్క్ స్పీడ్ 4 ఎంబీపీఎస్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ నెట్వర్క్ నుంచి కొనుగోలు చేయనున్నారు. డేటా భద్రత పక్కాగా.. డేటా బేస్‌లో ఏవైనా సమస్యలు ఏర్పడితే ఇబ్బంది నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ (డిజాస్టర్ రికవరీ సిస్టమ్)ను భువనేశ్వర్‌లో నెలకొల్పుతున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్‌ఫ్రమాటిక్ సిస్టమ్ (ఎన్ఐఎస్)తో ఒప్పందం చేసుకోనున్నారు. అలాగే రూ. 12 కోట్లతో డిజిటల్ సర్వర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. డేటా బేస్, డిజాస్టర్ రికవరీ సిస్టమ్తోపాటు ఈ వ్యవస్థలోనూ రిజిస్ట్రేషన్ల సమాచారం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్లో సదుపాయాలు కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ల సమయాన్ని తగ్గిస్తాం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల డేటా నెట్‌వర్క్‌లో పూర్తి మార్పులు చేస్తున్నాం. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సర్వర్ వ్యవస్థను మార్చాం. డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్‌కు పడుతున్న సమయాన్ని ఇంకా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎంవీ శేషగిరిబాబు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ -
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ సైబర్ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కంపెనీ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ బృందం రంగంలోకి దిగింది. అన్ని డేటా సెంటర్ సర్వీసులను వేరుచేసింది. అలాగే అంతర్జాతీయంగా కొన్ని తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం. ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ఐటీ నెట్వర్క్ సిస్టమ్‌ను సంస్థ సమీక్షిస్తోంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, బ్రెజిల్, రష్యాతోపాటు భారత్‌లోని ప్లాంట్లపై ఈ సైబర్ దాడి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో రష్యా తయారీ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్–వి రెండు, మూడవ దశ మానవ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ ఇటీవలే అనుమతి పొందిన నేపథ్యంలో కంపెనీ సర్వర్లపై ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి ప్రభావం లేదు.. సైబర్ అటాక్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని డేటా సెంటర్ సర్వీసులను ఐసోలేట్ చేశామని బీఎస్ఈకి సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముకేశ్ రాథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై పెద్దగా ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఔషధ రంగంలో మార్కెట్ విలువ పరంగా భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ రెండవ స్థానంలో ఉంది. సంస్థ దేశంలో 17 తయారీ ప్లాంట్లు, ఆరు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఆరు తయారీ ప్లాంట్లు, మూడు ఆర్అండ్డీ సెంటర్లు ఉన్నాయి. కాగా, గురువారం డాక్టర్ రెడ్డీస్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.46 శాతం (రూ.23.30) తగ్గి రూ.5,023.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.4,832.40కి చేరి తిరిగి పుంజుకుంది. సైబర్ సెక్యూరిటీకి కంపెనీల ప్రాధాన్యం: సిస్కో బెంగళూరు: కరోనా వైరస్ పరిణామాలతో వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మళ్లుతున్న నేపథ్యంలో కంపెనీలకు సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సిస్కో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి సమస్యలు ప్రారంభమైనప్పట్నుంచీ సైబర్ దాడులు జరగడం లేదా హెచ్చరికలు వచ్చిన ఉదంతాలు 25 శాతం పైగా పెరిగాయని సుమారు 73 శాతం దేశీ సంస్థలు వెల్లడించాయి. సుమారు మూడింట రెండొంతుల సంస్థలు (65 శాతం) రిమోట్ వర్కింగ్‌కు వీలుగా పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నాయి. ఐటీ రంగంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే 3,000 పైచిలుకు సంస్థలపై సిస్కో ఈ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రిమోట్ వర్కింగ్ విధానం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయని, క్లౌడ్ సెక్యూరిటీపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని సిస్కో ఇండియా డైరెక్టర్ రామన్ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ డేటా సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ప్రారంభించింది. ఇది తెలంగాణలో మొదటిదని, దేశంలో రెండో సెంటర్ అని ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్ ఆపరేటర్ ‘కంట్రోల్ ఎస్’ (సీటీఆర్ఎల్ ఎస్) పార్టనర్షిప్తో దీన్ని నిర్మించినట్లు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పాటుతో ఎక్కువ సంఖ్యలో స్థానిక తయారీ సంస్థలు. విక్రయదారులు, ఎంఎస్ఎంఈలను చేరుకునేందుకు వీలవుతుందని, నాణ్యమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ తెలిపారు. ఈ సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనతో నడుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ, కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ డేటా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డేటా సెంటర్స్ కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, దీంతో మరిన్ని కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు. -
భారత్‌లో ఆలీబాబా 2వ క్లౌడ్ డేటా సెంటర్
న్యూఢిల్లీ: చైనీస్ దిగ్గజ సంస్థ ఆలీబాబా భారత్‌లో తమ క్లౌడ్ సేవలను మరింత విస్తరించనుంది. త్వరలోనే ముంబై డేటా సెంటర్లో మరో క్లౌడ్ ఇన్ఫ్రాను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈఏడాది ప్రారంభంలో క్లౌడ్ సేవలను ఇక్కడి మార్కెట్లో ప్రారంభించిన ఈ సంస్థ.. నెలల వ్యవధిలోనే తమకు లభించిన విశేష స్పందన చూసి, 2వ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ అంశంపై మాట్లాడిన సంస్థ జనరల్ మేనేజర్ అలెక్స్ లీ.. ‘వచ్చే ఏడాది మార్చిలో రెండవ సెంటర్ ప్రారంభంకానుంది. ఇక్కడి మార్కెట్ నుంచి వచ్చిన విశేష స్పందన కారణంగానే అనతికాలంలో 2వ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుచేయనున్నాం.’ అని వ్యాఖ్యానించారు. విదేశీ ఈ–కామర్స్, సోషల్ మీడియా సంస్థలు భారత్‌లో నిర్వహిస్తున్న సమాచారానికి భద్రత కల్పించే దిశగా భాతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని వెల్లడించిన ఆయన ఇక్కడి చట్టాలపై తమకు గౌరవం ఉందని అన్నారు. -
డేటా సెంటర్ బిజినెస్‌కు విప్రో స్వస్తి!
న్యూఢిల్లీ: దేశీ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘విప్రో’... తాజాగా 399 మిలియన్ డాలర్లకు తన హోస్టెడ్ డేటా సెంటర్ సర్వీసెస్ బిజినెస్‌ను విక్రయించటం పూర్తయిందని తెలియజేసింది. కంపెనీ ఇందులో భాగంగా విప్రో డేటా సెంటర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ (అమెరికా) సహా జర్మనీ, యూకేలలో డేటా సెంటర్ బిజినెస్‌ను, భారత్‌లో కొంత మంది ఉద్యోగులను హైబ్రిడ్ ఐటీ సేవల సంస్థ ‘ఎన్సొనొ’కు అప్పగించింది. ఎనిమిది డేటా సెంటర్లను, దాదాపు 900 మంది ఉద్యోగులను ఎన్సొనొకి బదిలీ చేస్తామని విప్రో మార్చిలోనే ప్రకటించింది. ప్రస్తుత త్రైమాసికపు ఆర్థిక ఫలితాలపై డేటా సెంటర్ బిజినెస్ విక్రయ ప్రభావం ఉంటుందని కంపెనీ తెలిపింది. భారత్‌లో డేటా సెంటర్ కార్యకలాపాల ముగింపు సెప్టెంబర్ త్రైమాసికంలో పూర్తికావొచ్చని అంచనా వేసింది. దీని తర్వాత ఎన్సొనొ నుంచి మరో 6 మిలియన్ డాలర్లు అందుతాయి. మరోవైపు ఎన్సొనొ హోల్డింగ్స్‌లో విప్రో ఎల్ఎల్సీ 10.2 శాతం వాటా కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా విప్రో.. ఎన్సొనో సంస్థలో 55 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక 2007 ఇన్ఫోక్రాసింగ్ కొనుగోలుతో విప్రో.. డేటా సెంటర్ సర్వీసెస్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీలు వాటి డేటాను భద్రపరచుకునే ప్రాంతమే డేటా సెంటర్. ఇక హోస్టింగ్ డేటా సెంటర్ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీలు మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసి, దాన్ని కొన్ని భాగాలుగా చేసి ఇతర కంపెనీలకు ఆఫర్ చేస్తాయి. -
టాటా టెలికం భారత్ డేటా సెంటర్ విక్రయం!
♦ డీల్ విలువ రూ.3,150 కోట్లు ♦ సింగపూర్ టెక్నాలజీస్ చేతికి 74% వాటా న్యూఢిల్లీ: టాటా కమ్యూనికేషన్స్ సంస్థ, తన భారత, సింగపూర్‌లకు చెందిన డేటా సెంటర్ వ్యాపారంలో 74% వాటాను విక్రయించింది. ఈ వాటాను ఎస్టీ (సింగపూర్ టెక్నాలజీస్ )టెలిమీడియాకు రూ.3,150 కోట్లకు విక్రయించామని టాటా కమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ విక్రయానంతరం భారత్‌లో హైదరాబాద్‌తో సహా ఉన్న 14 సింగపూర్‌లోని మూడు డేటా సెంటర్లకు సంబంధించిన వ్యాపారంలో 26% వాటా ఈ కంపెనీకి ఉంటుంది. ఈ లావాదేవీకి సంబంధించి ఒప్పందాన్ని ఎస్టీ టెలిమీడియా పూర్తి అనుబంధ సంస్థ ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్(ఎస్టీటీ జీడీసీ)తో రానున్న వారాల్లో కుదుర్చుకుంటామని పేర్కొంది. రుణ భారం తగ్గించుకోవడానికి, విస్తరణ కోసం ఈ నిధులను వినియోగిస్తామని వివరించింది. సముద్ర అంతర్భాగ, భూగోళ కేబుల్ నెట్వర్క్ ద్వారా టెలికం, డేటా సర్వీసుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టాటా టెలికమ్యూనికేషన్స్ అందిస్తోంది. ఈ కం పెనీకి ప్రపంచవ్యాప్తంగా 45 డేటా సెంటర్లున్నాయి. డీల్ నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేర్ బీఎస్ఈలో 1.6% నష్టపోయి రూ.443కు చేరింది. -
వచ్చే నెలలో హైదరాబాద్‌కు సత్యనాదెళ్ల!
-
వచ్చే నెలలో హైదరాబాద్‌కు సత్యనాదెళ్ల!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల డిసెంబరులో హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం. క్లౌడ్ సేవల కోసం ఉద్దేశించిన డేటా సెంటర్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ పుణే, ముంబై, చెన్నైలో డేటా సెంటర్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి భారత్‌లో తొలి డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంస్థ గతంలోనే భావించింది. కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. భాగ్యనగరిలో కంపెనీకి సొంత స్థలం కూడా ఉందని మైక్రోసాఫ్ట్ వర్గాలు చెబుతున్నాయి. డేటా సెంటర్ ఏర్పాటు ఆలోచనను మైక్రోసాఫ్ట్ విరమించుకోలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వచ్చే నెల హైదరాబాద్‌కు నాదెళ్ల వస్తున్నారని, ఈ సందర్భంగా సెంటర్ నెలకొల్పే అంశంపై స్పష్టత రావొచ్చన్నారు. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత దేశ, విదేశీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నాయని గుర్తు చేశారు. కాగా, మైక్రోసాఫ్ట్‌కు సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నాదెళ్ల సెప్టెంబరులో హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. గచ్చిబౌలిలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్లో సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ సెంటర్‌ను విస్తరించనున్నట్టు ఆ సమయంలో ప్రకటించారు కూడా. -
నిరుద్యోగుల ఆశలు వమ్ముకానీయం
మంత్రి కేటీఆర్ వెల్లడి ‘తెలంగాణ స్టేట్ డాటా సెంటర్’ ఏర్పాటు చేస్తాం డాటా సెంటర్‌తో టీఎస్పీఎస్సీ పరీక్షలు అనుసంధానం ప్రైవేటు క్లౌడ్ కేంద్రాలపై ఆధారపడే అవసరం ఉండదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం వారి ఆశలు వమ్ముకానీయదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగాలను ప్రణాళికాబద్ధంగా భర్తీ చేస్తుం దని, భవిష్యత్తులోనూ ఇదే పారదర్శకతతో ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ శీర్షిక అయిన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే నీళ్లలో అన్యాయాలను సరిచేస్తున్నామన్నారు. నిధుల విషయంలోనూ పెట్టుబడులు సాధించామని, సొంత ఆదాయం సమకూర్చుకుంటున్నామన్నారు. ఇక నియామకాల్లో పారదర్శకతను పాటిస్తూ ఉద్యమ శీర్షికకు సంపూర్ణ న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం హెచ్ఎండీఏ పరి ధిలో ఏర్పాటు చేసిన 48 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఆ పరీక్షల నిర్వహణను టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ప్రస్తుతం ప్రైవేటు క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్లపై ఆధారపడి ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తోందని, ఇకపై అవసరం లేకుండా చేస్తామని తెలిపారు. డాటా సెంటర్‌కు టీఎస్పీఎస్సీ పరీక్షలను అనుసంధానం చేస్తామన్నారు. అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ మిషన్‌ను దీనికి జోడిస్తామని, తద్వారా మారుమూల తండాలు, గ్రామాల వారు హైదరాబాద్‌కు వచ్చి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా, వారి తాలూకా/జిల్లా కేంద్రాల్లో పరీక్షలు రాసేలా చర్యలు చేపడతామన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో పారదర్శకంగా, గత పరిస్థితులకు పూర్తి భిన్నంగా పనిచేస్తోందని కితాబునిచ్చారు. యూపీఎస్సీ కూడా నాలుగైదు వేల మందికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించలేదని, టీఎస్పీఎస్సీ మాత్రం 60 వేల మందికి నిర్వహించి చరిత్ర సృష్టించిందన్నారు. ఉద్యమ సమయంలో ఘంటా చక్రపాణి టీవీల్లో కనిపించే వారని, ఇపుడు కనిపించకపోయినా బాగా పనిచేస్తున్నారన్నారు. దేశంలోని ఇతర కమిషన్లకు టీఎస్పీఎస్సీ ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారన్నారు. టీఎస్పీఎస్సీ చేపట్టిన ఓటీఆర్‌లో6 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీంతో టీఎస్పీఎస్సీ వర్చువల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్గా మారిందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కమిషన్ ఏర్పడిన 8 నెలల్లోనే దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చర్యలు చేపట్టారని కొనియాడారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ల సదస్సు ఇక్కడ నిర్వహిస్తున్నారన్నారు. గతంలో నోటిఫికేషన్లలో కొన్ని రద్దయ్యేవని, కాలయాపన జరిగేదని, ఇపుడు అలాకాకుండా 24 గంటల్లోనే ఫలితాలు వెల్లడయ్యేలా చర్యలు చేపడుతున్నారన్నారు. చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. దేశంలోనే రాష్ట్రాన్ని ఐటీ రాజధానిగా మార్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని, వారి స్ఫూర్తితో తాము చర్యలు చేపట్టామన్నారు. అన్ని విభాగాల పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ హబ్ కావాలని, కంప్యూటర్ ల్యాబ్, సర్వర్ స్టోరేజ్ ప్రభుత్వ విభాగంలో ఏర్పాటు చేయాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా జిల్లాల్లోనూ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు శిక్షణతోపాటు పరీక్షల నిర్వహణకు ఉపయోగపడతాయని వివరించారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో వెబ్ కెమెరాలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, రామ్మోహన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఫాక్స్‌కాన్ యూనిట్లు
- హైదరాబాద్‌లో డేటా సెంటర్, ఏపీలో తయారీ యూనిట్ - ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు - వెల్లడించిన కంపెనీ చీఫ్ టెర్రీ న్యూఢిల్లీ: ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను, ఇంక్యూబేటర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఈ గ్రూప్ హెడ్ టెర్రీ గౌ చెప్పారు. ఫాక్స్‌కాన్ కంపెనీ యాపిల్ కోసం ఐఫోన్లను, ఐప్యాడ్లను, అమెజాన్ కోసం కిండిల్ ట్యాబ్‌లను, ఇతర కంపెనీలకు ట్యాబ్‌లను, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ చేస్తోంది. 2020 కల్లా భారత్‌లో 10-12 తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, కనీసం పది లక్షల ఉద్యోగాలను ఇవ్వనున్నామని భారత్‌లో స్వల్పకాల పర్యటన సందర్భంగా ఆయన వెల్లడించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రల్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. యాపిల్, సిస్కో, డెల్, మైక్రోసాఫ్ట్, హ్యులెట్-ప్యాకార్డ్ తదితర కంపెనీలకు తైవాన్‌కు చెందిన ఈ సంస్థ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌గా వ్యవహరిస్తోంది. భారత్‌లో మొబైల్సే కాకుండా ట్యాబ్‌లు, టీవీలు, బ్యాటరీలు, రూటర్లు తదితర వస్తువులను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. -
భారత్‌లో మరో
ఐబీఎం డాటా సెంటర్! పనాజీ: టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఐబీఎం త్వరలోనే భారత్‌లో మరో డాటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఐబీఎం డాటా సెంటర్ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం... ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించిన రంగాలతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డాటా వినియోగానికి, పలు ఇతర సేవలకు వస్తున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడమే. ఐబీఎం గతంలో ముంబైలో తొలి డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసింది.


