
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. పర్ఫార్మెన్స్ వీక్ అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యాడ్ ఏజెన్సీలా నడిపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాం. రాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయింది. ఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్ర పరిస్థితి వీక్. వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్‌ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు.

ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది. వైఎస్సార్‌సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్ డాటా సెంటర్ ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. వైజాగ్‌లో అదానీ ఇన్‌ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయి. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు.

అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు..
ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్‌కి రాబోతోంది. వైఎస్సార్‌సీపీ వేసిన విత్తనమే ఇది. వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్. అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. వైజాగ్‌లో అదానీ ఇన్‌ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు. చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. వైఎస్సార్‌సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు’ అని తెలిపారు.

ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్..
గూగుల్ డేటా సెంటర్‌ను నిర్మించేది అదానీనే. జగన్ సర్కార్ వల్లే డేటా సెంటర్ వచ్చిందని చెప్పలేకపోయారు.క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదు. బాబును చూసి గూగుల్ వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. డేటా సెంటర్‌తో ఉద్యోగాలు పెద్దగా రావు. కానీ, ఎకో సిస్టమ్ బిల్డు అవుతుంది. భవిష్యత్‌లో పెద్ద మార్పులకు డేటా సెంటర్ కీలకం. డేటా సెంటర్‌తో పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి.. ఐటీ పార్క్, రిక్రేయేషన్, స్కిల్ సెంటర్ పెట్టాలని ఆలోచన చేశాం. 25వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం కూడా చేశాం. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్.. క్రెడిట్ చోరీలో పీక్’ అని సెటైర్లు వేశారు.