
ఢిల్లీలో ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యం కొనసాగుతోంది. దీపావళి తర్వాత రోజురోజుకీ గాలి నాణ్యత పడిపోతోంది. తాజాగా ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో ప్రమాదకర స్థాయికి 429 పాయింట్లకు కాలుష్యం చేరింది.

క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.















