
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం (అక్టోబర్ 23) ఉదయం 11గంటలకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ రాష్ట్రంలో నకిలీ మద్యం, మహిళలు, చిన్నారులపై వరుస అఘాయిత్యాలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.