సీఎం పర్యటనలో లోపాలు రానివ్వద్దు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనలో లోపాలు రానివ్వద్దు

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

సీఎం

సీఎం పర్యటనలో లోపాలు రానివ్వద్దు

నరసరావుపేట: ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలతో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండలో పర్యటిస్తున్న నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర పర్యటనలో భాగంగా వినుకొండలోని ఎన్‌ఎస్‌పీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్న ప్రజా వేదికను సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో సభావేదిక వద్ద ఆకర్షణీయమైన స్టాళ్లు ఏర్పాటు చేయాలన్లి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా డీఆర్‌డీఎ ద్వారా రూ.100 కోట్లు, మెప్మా ద్వారా రూ.50 కోట్లు రుణాలు ఇప్పించాలని ఎల్‌డీఎంకు సూచించారు.

ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండ పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్పీ కృష్ణారావు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక జూనియర్‌ కళాశాల ఆవరణ, హెలీప్యాడ్‌ వద్ద, సభా ప్రాంగణాన్ని, ప్రభుత్వ వైద్యశాలను, పలు ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎస్పీతో పాటు ఆర్డీవో మధులత, పట్టణ సీఐ ప్రభాకర్‌, రూరల్‌ సీఐ బ్రహ్మయ్య, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అధికారులకు కలెక్టర్‌ కృతికా శుక్లా దిశానిర్దేశం

సీఎం పర్యటనలో లోపాలు రానివ్వద్దు 1
1/1

సీఎం పర్యటనలో లోపాలు రానివ్వద్దు

Advertisement
 
Advertisement
Advertisement