
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వ్యవస్థీకృత పద్దతిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోందన్నారు. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని తెలిపారు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎటు చూసినా నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మద్యం మాఫియా నడుస్తోంది. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయి. ఆక్షన్లు వేసి మరీ బెల్లు షాపులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. వాటాల్లో తేడా రావడంతో ఇది బయటకు వచ్చింది. ములకలచెరువులోనే 20208 నకిలీ మద్యం బాటిళ్లు దొరికాయి. 1050 లీటర్ల స్పిరిట్ అక్కడ దొరికింది. వీటితో వేల బాటిళ్లు నకిలీ మద్యం తయారు చేయవచ్చు. విజయవాడ సీపీ.. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమీ జరగకపోయినా మా పార్టీ నేతలను వేధిస్తున్నారు.
ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అనకాపల్లి జిల్లా పరవాడలోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీకి బయటకు వచ్చింది. అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లే, నెల్లూరులోనూ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి. లక్షల బాటిళ్ల నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ప్రైవేటు మాఫియా ఆధ్వర్యంలోని మద్యం షాపులకు బెల్టుషాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లకు సరఫరా చేస్తున్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!. కల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లే.. చేసింది.. చేయిస్తోంది చంద్రబాబే. టాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారు.

ఎల్లో మీడియా బిల్డప్పులు..
ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది. జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?. నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆర్గనైజ్డ్‌గా క్రైమ్ చేయడం చంద్రబాబు, లోకేష్‌లకు అలవాటే. ఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులు. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారు. ఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్‌లంటూ హడావిడి చేశారు. చేసేది వీళ్లే.. కథా స్క్రీన్‌ప్లే అంతా వాళ్లదే. ఇలా క్రైమ్ చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు అన్నీ మోసాలే. తప్పులు చేయడం.. వేరే వారిపై నెపం నెట్టేయడం బాబుకే సాధ్యం. బాబు నేరాలను కప్పిపుచ్చడానికి ఎల్లో మీడియా రెడీగా ఉంటుంది. టాపిక్ డైవర్షన్‌లో భాగంగా ఎదుటివారిపై బురద చల్లుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని జైలుకు పంపే ప్రయత్నం చేస్తారు. నకిలీ మద్యం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులే. తంబళ్లపల్లె టీడీపీ నుంచి పోటీ చేసిన జయచంద్రారెడ్డి నిందితుడు. విదేశాల్లో ఉన్న జనార్థన్ రావు రెండు రోజుల్లో లొంగిపోతాడంటూ ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఐవీఆర్‌ఎస్ కాల్ సెంటర్‌ను ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తారు.
క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం..
అసలు జనార్దన్‌రావు ఎవరు?. జనార్దన్‌తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఏదో ఫంక్షన్‌లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారు. తన రెండు ఫోన్‌లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారు. తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఈలోపే డైవర్షన్ పాలిటిక్స్‌తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించింది. లాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం. షాపుల సంఖ్య తగ్గించాం. టైమింగ్ పెట్టి నడిపించాం. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు లేవు. క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లు. కాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు
రేపల్లే పేకాట కింగ్..
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు. ఇదసలు హైలైట్ కావాల్సిన అంశం. లిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌ల దాకా అంతా చంద్రబాబు మనుషులే. దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?. ఎవరి క్యూఆర్‌కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?. మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?. క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది. ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోంది. రేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే తమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే. బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే. సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయి. అందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు. లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణం. లిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగింది. ఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్’ అని విమర్శించారు.