
సాక్షి, గుంటూరు: ఏపీలో నకిలీ మద్యం వ్యవస్థీకృతంగా నడుస్తోందని, చేసిన తప్పును అవతలి వాళ్ల మీదకు నెట్టేయడం చంద్రబాబుకి, ఆయన తనయుడు నారా లోకేష్ అలవాటైన పనేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంతో పాటు విశాఖ డాటా సెంటర్‌పై కూటమి ప్రభుత్వం.. దాని అనుకూల మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ వాస్తవాల్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఉద్యోగులను చంద్రబాబు ఎలా మోసం చేస్తోంది తెలియజేస్తూనే కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు.
జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారు
గ్రామ సచివాలయం, వలంటీర్‌లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
పొలిటికల్ గవర్నరెన్స్ వల్లే రాష్ట్రం అతలాకుతలం అవుతోంది
ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితి
బీమా సంగతి పట్టించుకోవడం లేదు
వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం రైతులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేయలేదు
సబ్సిడీ విత్తనాలు ల్లేవ్
ఉల్లి రైతులను గాలికి వదిలేశారు
అరటి, టమాట, పత్తికి డిమాండ్ లేదు
క్వింటాల్ పత్తికి ఒకప్పుడు రూ.12 వేలు ఉండేది.. ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదు
టమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు
పరిస్థితులు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు
ఉద్యోగులకే కాదు.. ప్రజలకూ చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ తిరోగమనంలోనే కనిపిస్తున్నాయి
స్కూళ్లలో నాడు-నేడు పనులు ఆగిపోయాయి.. ఇంగ్లీష్ మీడియా చదువులు గాలికి ఎగిరిపోయాయి.. గోరుముద్ద పథకం నిర్వీర్యం అయిపోయింది
విద్యాదీవెన, వసతి దీవెన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
వైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. చంద్రబాబు పుణ్యాన పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దూదికి కూడా దిక్కలేదు
కనీసం రూ.5 కోట్ల టర్న్ ఓవర్ లేని మనిషికి.. 104, 108 సర్వీసులను అప్పజెప్పారు
మా హయాంలో మెడికల్ కాలేజీలు తెస్తే.. 10 కాలేజీలను నెమ్మదిగా అయినా పూర్తి చేయాల్సి పోయి ప్రైవేటీకరణకు అప్పజెప్తున్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా.. రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది
దానిని గవర్నర్‌కు సమర్పించి.. రాష్ట్ర ప్రజల రెఫరండంను తెలియజేస్తాం

- ఎన్నికలయ్యాక.. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అన్నారు
- జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడడం లేదు
- ఐఆర్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదు
- ఉద్యోగులకు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు
- ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు
- ఉద్యోగులను మోసం చేసి వికృత ఆనందం పొందుతున్నారు
- టీడీపీ నేతలు వాళ్లపై దాడులు చేస్తున్నారు
- ఉద్యోగులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు
- మొత్తంరూ.31 వేల కోట్లు బకాయిలు పెట్టారు
- ప్రతీ నెలా ఒక్కటే తేదీన జీతాలన్నారు.. ఒక్క నెల ఇచ్చారంతే
- కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు
- కాంట్రాక్టు ఉద్యోగులకు పథకాలు ఇస్తామన్నారు
- పోలీసులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ పెండింగ్‌లో పెట్టారు
- ఉద్యోగుల విషయంలో మేం ఏనాడూ ఇబ్బందులకు గురి చేయలేదు
- అధికారంలోకి వచ్చిన వారంలోనే ఐఆర్ ఇచ్చాం
- కోవిడ్ సమయంలోనూ వాళ్ల సంక్షేమం గురించే ఆలోచించాం
- మేం తెచ్చిన జీపీఎస్‌ను కేంద్రం, రాష్ట్రాలు ప్రశంసించాయి
- ఆనాడు చంద్రబాబు ఉంటే.. రాష్ట్రం అతలాకుతలం అయ్యి ఉండేదేమో
- ఉద్యోగులనూ చంద్రబాబు మోసం చేశారు
- నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారు
- ఇప్పటి వరకు ఒక్క డీఏ ఇవ్వలేదు
- ఉద్యోగులు రోడ్డెక్కాక.. డ్రామా చేసి ఒక్కటి ఇస్తామన్నారు
- అది కూడా ప్రకటించారు అంతే.. ఇంకా ఇవ్వలేదు(నవంబర్‌లో ఇస్తామని అంటున్నారు)
- డీఏ బకాయిలు కూడా రిటైర్ అయ్యాక ఇస్తామని ప్రకటించారు
- దీనికే దీపావళి సంబురాలు అంంటూ ప్రకటనలు చేస్తున్నారు
- కోవిడ్ కష్టాలు ఉన్నా మేం వెనకడుగు వేయలేదు
- ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం
- తనను చూసే గూగుల్ వైజాగ్‌కి వచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు
- హైదరాబాద్ సైబర్ టవర్స్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారు
- దాని పేరే హైటెక్ సిటీ
- హైటెక్ సిటీకి ఆరు ఎకరాల్లో పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్
- కానీ, చంద్రబాబు ఆ విషయాన్ని ఏనాడూ చెప్పుకోరు
- అసలు చంద్రబాబుకి 20 ఏళ్లపాటు హైదరాబాద్‌తో సంబంధమే లేదు
- అయినా అభివృద్ధి తనదేనంటూ బిల్డప్ ఇస్తుంటారు
- వాస్తవం ఏంటంటే.. 2003-04 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచే హైదరాబాద్‌లో నిజమైన అభివృద్ధి మొదలైంది
- ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయి
- ఆ తర్వాత వైఎస్సార్ లేకపోయినా.. ఆ అభివృద్ధి అలా కొనసాగింది
- కేసీఆర్ రెండుసార్లు సీఎం చేశారు.. అప్పుడూ డెవలప్‌మెంట్ జరిగింది
- క్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబుకి ఉన్న దుర్మార్గపు నైజం
- హైదరాబాద్ అభివృద్ధికి అసలు చంద్రబాబుకే సంబంధం లేదు

డాటా సెంటర్ వల్ల ఉద్యోగవకాశాలు తక్కువే, కానీ, భవిష్యత్తులో ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది
భవిష్యత్తులో పెద్ద మార్పులకు డాటా సెంటర్ కీలకం
దీనికి వైఎస్సార్‌సీపీ హయాంలోనూ నాంది అప్పుడే పడింది
అందుకే తక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసి కూడా నాడు అదానీతో ఒప్పందం చేసుకున్నాం
అదే సమయంలో.. ఐటీ పార్క్ రీక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టి 25 వేల ఉద్యోగాలు కావాలని కోరాం
ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డాటా సెంటర్ వైజాగ్‌కి రాబోతోంది
ముమ్మాటికీ వైఎస్సార్‌సీపీ వేసిన విత్తనమే ఇది
వేరేవాళ్లకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు
అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయ్
అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డాటా సెంటర్
అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు
వైజాగ్‌లో అదానీ ఇన్‌ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయి
అదానీ కట్టాక గూగుల్ దీనిని వాడుకుంటుంది
ఇందుకు సంబంధించి.. ఐటీ సెక్రటరీ భాస్కర్‌కు గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు
చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు
జగన్ సర్కార్‌కు ఆ క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు
వైఎస్సార్‌సీపీకి ఆ ఘనత దక్కుతుందనే.. బాబు ఆ పని చేయడం లేదు

2020లో.. కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం
2021 మార్చిలో సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాశాం
2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు వైజాగ్‌లో శంకుస్థాపన కూడా చేశాం
ఆనాడే.. సింగపూర్ నుంచి సబ్‌సీ కేబుల్ తీసుకొచ్చే అంకురార్పణ జరిగింది
దీనికి కొనసాగింపుగానే గూగుల్ డాటా సెంటర్ వచ్చింది
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది
వైఎస్సార్‌సీపీ వేసిన బీజానికి కొనసాగింపే వైజాగ్ గూగుట్ డాటా సెంటర్


గూగుల్ డాటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం..
వారం, పదిరోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాం
రాష్ట్రంలో పాలనను బాబు గాలికి ఎగిరిపోయింది
ఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది
క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్.. రాష్ట్రపరిస్థితి వీక్
వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్‌ను చోరీ చేయడంలో బాబు ఎప్పుడూ ముందుంటారు
లేని ఎవిడెన్స్ క్రియేట్ చేయడం దారుణం
లిక్కర్ స్కాం పేరిట తప్పుడు కేసులోనూ ఇలాగే జరిగింది
ఎక్కడో రూ.11 కోట్లు దొరికితే.. అంటగట్టే ప్రయత్నం చేశారు
కోర్టుకు వెళ్లడంతో సైలెంట్ అయిపోయారు
చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏమాత్రం ల్లేవ్
అసలు జనార్దన్‌రావు ఎవరు?
జనార్దన్‌తో తనకు పరిచయమే లేదని జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారు
ఏదో ఫంక్షన్‌లో కలిసినందుకే కట్టుకథలు అల్లుతున్నారు
తన రెండు ఫోన్‌లు తనిఖీ చేసుకోమని జోగి రమేష్ సవాల్ చేశారు
తప్పు చేయలేదు కాబట్టే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ జోగి రమేష్ కోర్టును ఆశ్రయించారు
ఈలోపే డైవర్షన్ పాలిటిక్స్‌తో.. తప్పుడు ఆధారాలతో అభాండాలు వేస్తున్నారు
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించింది
లాభాపేక్ష మా ప్రభుత్వానికి లేదు.. అందుకే బెల్ట్ షాపులు రద్దు చేశాం
షాపుల సంఖ్య తగ్గించాం
టైమింగ్ పెట్టి నడిపించాం
ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు లేవు
క్యూ ఆర్ కోడ్ తెచ్చిందే మా ప్రభుత్వం.. ఆ టైంలో స్కాన్ చేసి అమ్మేవాళ్లు
కాస్తో కూస్తో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నాలు చేశాం
ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నకిలీ మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ ఆదేశాలిచ్చారు
ఇదసలు హైలైట్ కావాల్సిన అంశం
లిక్కర్ షాపుల నుంచి ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌ల దాకా అంతా చంద్రబాబు మనుషులే
దొంగకు తాళాలివ్వడం అంటే ఇది కాదా?
ఎవరి క్యూఆర్‌కోడ్.. ఎవరి స్కాన్? ఎవరు చేసేది?
మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్ కోడ్ ఎందుకు?
క్యూఆర్ కోడ్ అంటూ మరో డైవర్షన్ ఇది
ఏలూరులో ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తోంది
రేపల్లే పేకాట కింగ్.. ఇష్టానుసారంగా నకిలీ మద్యం దందా నడిపిస్తున్నారు
నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు మనుషులే
తమకు సంబంధించిన లిక్కర్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే
బెల్ట్ షాపులకు పంపేది చంద్రబాబు మనుషులే.. అమ్మకునేది వాళ్ల కింది మనుషులే
సీబీఐ విచారణ జరిపితే మూలాలు బయటకు వస్తాయి
అందుకే బాబు సిట్ ముద్దు అంటున్నారు
జనార్దన్‌రావు వీడియోలో ఎలా మాట్లాడారు?.. ఫోన్ పోయిందని జనార్దనే చెప్పాడు. మరి ఫోన్ పోతే చాటింగ్ ఎలా బయటకు వచ్చింది?. అసలు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?
ఈ 20 రోజుల్లో జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?.. పాస్‌పోర్టును ఎందుకు సీజ్ చేయలేదు?..
పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు.. పెద్దిరెడ్డి సోదరుడిపై జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎందుకు పోటీకి నిలబెట్టారు? టీడీపీ టికెట్ ఎలా ఇచ్చారు?
తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని అఫిడవిట్‌లోనే జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.. మరి అప్పుడు ఆఫ్రికా లింకులు చంద్రబాబుకి, ఆయన టిష్యూ పేపర్‌లకు కనిపించలేదా?
పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది?
నకిలీ మద్యం బయటపడ్డాక ఎన్ని తనిఖీలు నిర్వహించారు? ఎన్ని బాటిళ్లను పట్టుకున్నారు?
అన్ని చోట్ల దొరుకుతుందనే తనిఖీలు చేయలేదా?
చంద్రబాబుకు ధైర్యం ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
జనార్దన్ రావు లొంగిపోతాడని ఎల్లో మీడియా ముందే ఎలా చెప్పింది?
నిందితులకు మా పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు
ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌చేయడం చంద్రబాబు, లోకేష్‌లకు అలవాటే
ఆఫ్రికాలో మూలలున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియా బిల్డప్పులు
మాజీ మంత్రి జోగి రమేష్ పేరు సైతం చెప్పించి.. ఉధృతంగా ప్రచారం చేశారు
ఏబీఎన్, ఈనాడు, టీవీ5లు.. జనార్దన్ చాటింగ్‌లంటూ హడావిడి చేశారు
చేసేది వీళ్లే.. కథా స్క్రీన్‌ప్లే అంతా వాళ్లదే
ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమే!
ఒక మొలకల చెరువులోనే 20 వేల లీటర్ల నకిలీ మద్యం బయటపడింది
కల్తీ లిక్కర్ మాఫియాలో ఉంది అంతా టీడీపీ వాళ్లే
చేసింది.. చేయిస్తోంది చంద్రబాబే
టాపిక్ డైవర్ట్ చేయడానికి.. తప్పును వేరే వారికి మీదకు నెడుతున్నారు
ప్రజలను తప్పు దోవ పట్టించడానికి ఆయన దొంగల ముఠా, ఎల్లో మీడియా సిద్ధంగా ఉండనే ఉంది
విజయవాడ సీపీ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు
అక్రమ మద్యం కేసులో మా పార్టీ వాళ్లను అనవసరంగా వేధిస్తున్నారు
అన్నమయ్య జిల్లా తంబళపళ్లె, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అనకాపల్లి జిల్లా పరవాడ, పాలకొల్లు, నెల్లూరులోనూ నకిలీ మద్యం బయటపడింది
పట్టుబడకుంటే వేల లీటర్ల మద్యం తయారయ్యేదే


రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలే కనిపిస్తున్నాయి
ప్రైవేట్ మద్యం మాఫియా నడుస్తోంది
పోలీసుల భద్రత నడుమ గ్రామాల్లో అమ్మకాలు
ఆక్షన్లు వేసి మరీ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు
బెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్‌రూమ్‌లు నిర్వహిస్తున్నారు
డబ్బుల కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు
ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లకు గండి కొడుతున్నారు
వాటాల్లో తేడాలు రావడంతోనే ఇదంతా బయటపడింది
ఏపీలో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైంది
ఇలాంటి మాఫియా ప్రపంచంలో ఎక్కడా చూడలేదు
నకిలీ మద్యం కోసం చిన్నపాటి పరిశ్రమల్నే ఏర్పాటు చేశారు
నకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది వాళ్లే.. బెల్ట్‌షాపులు పెట్టి నడిపిస్తోంది వాళ్లే
ఇవాళ నాలుగు అంశాల మీద మాట్లాడుకుందాం
నకిలీ మద్యం కేసులో నాణేనికి రెండో వైపు గురించి..
విశాఖలో డేటా సెంటర్ గురించి చంద్రబాబు చేస్తున్న గిమ్మికులు, డ్రామాల గురించి, అసలు వాస్తవాలేంటివి అనేది..
ఉద్యోగులకు ఏరకంగా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు?.. ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తున్నారనేదానిని మీడియా మీద ప్రజల దృష్టికి తీసకెళ్తా..
ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, ఈ ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా..