
తాడేపల్లి : అబద్ధానికి అధికారం ఇస్తే అది కూటమి ప్రభుత్వమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. బోగస్ మాటలతో జనాన్ని మోసం చేస్తున్నారని, ముఖ్యమంత్రే అబద్ధాలు చెప్పడం ఏపీలోనే చూస్తున్నామని ధ్వజమెత్తారు.
ఈరోజు(బుధవారం, అక్టోబర్ 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ఆయన చెప్పేవి నిజమా? అబద్దమా? అని జనం కూడా చర్చించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యం తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
కానీ మాపార్టీ పైకి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైరస్ కంటే ప్రమాదకరంగా టీడీపీ మారింది. తుని, రాజమండ్రిలో మైనర్ బాలికలపై జరిగిన సంఘటనలు దారుణం’ అని కూటమి పాలనపై మండిపడ్డారు.
ఇదీ చదవండి:
మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు..