సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు నివేదించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17న ఆయనతో భేటీ కానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్.. గవర్నర్‌ను కలవనున్నారు.
ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైఎస్సార్‌సీపీకి లేఖ అందింది. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కు నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కు చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు.


