ముదునూరు: కృష్ణాజిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల శివ శంకర్ స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృత్యువాత పడ్డాడు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శివశంకర్ వద్ద శాంపిల్స్ తీసుకుంది వైద్య బృందం.
అయితే 4వ తారీఖున శివశంకర్ మృతి చెందగా, ఈరోజు(శనివారం, డిసెంబర్ 6వ తేదీ) స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు రిపోర్ట్‌లో తేలింది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో గ్రామంలో వైద్య బృందం సర్వే చేపట్టింది.
ఇదీ చదవండి:
స్క్రబ్ టైఫస్.. ఈ వ్యాధి లక్షణాలు ఇవే..


