వైఎస్సార్‌సీపీ ధర్నాని అడ్డుకునేందుకు.. నోటీసులు, హౌజ్‌అరెస్టులు | YSRCP Chalo Medical College Protests Against Privatization Updates News | Sakshi
Sakshi News home page

YSRCP ఛలో మెడికల్ కాలేజీ ధర్నా: నోటీసులు.. హౌజ్‌అరెస్టులు

Sep 19 2025 7:42 AM | Updated on Sep 19 2025 8:56 AM

YSRCP Chalo Medical College Protests Against Privatization Updates News

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఇవాళ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఛలో మెడికల్ కాలేజీ పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నా నిర్వహించబోంది. అయితే ఈ ధర్నాను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలపైకి కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది.

అమరావతి

  • మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై వాయిదా తీర్మానం

  • శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం

  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని తీర్మానం

  • మరోవైపు.. వైఎస్సార్‌సీపీ ఛలో మెడికల్‌ కాలేజీ నిర్వహణ

అనంతపురం జిల్లా..

  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన జ్వాలలు
  • నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ
  • శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజీ వద్ద కార్యక్రమం
  • పెద్దసంఖ్యలో తరలివస్తున్న విద్యార్థులు, యువకులు
  • చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు
  • హాజరుకానున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

ప్రకాశం జిల్లా ..

  • మార్కాపురం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రవేటికరణ చేయడం పై నిరసన తెలుపునున్నా వైయస్సార్సీపీ నాయకులు
  • ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి లేదని ముందస్తు నోటీసులు జారీ చేసిన మార్కాపురం పోలీసులు
  • చీమకుర్తిలోని బూచేపల్లి నివాసంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన చీమకుర్తి ఎస్ఐ కృష్ణయ్య

తూర్పుగోదావరి జిల్లా.

  • ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ 
  • మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్ నుండి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీ

 

కర్నూలు జిల్లా ..

  • ఛలో  మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు,
  • మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ చేసిన చంద్రబాబు తీరు మార్చుకోవాలని అన్ని మెడికల్ కాలేజ్ ల వద్ద శాంతియుత నిరసనకు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు,
  • శాంతియుత నిరసన  తెలపడానికి నంద్యాల మెడికల్ కాలేజ్ కి వెళ్తున్న రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్‌ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ని కర్నూలులోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు,
  • ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రవేటికరణ కార్యకమాన్ని శాంతి యుతంగా చేస్తాం అంటే మీరు ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి,
  • సిద్ధార్థ రెడ్డిని  పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్దకి చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు,
  • సిద్దార్థ రెడ్డి  ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు...

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...

  • అమలాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం
  • హాజరుకానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నేతలు, కార్యకర్తలు

గత వైఎస్సార్‌సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజల మేలు కోసం 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. తద్వారా అతి తక్కువ ఖర్చుకే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలో కొన్ని కాలేజీల్లో తరగతులూ ప్రారంభం అయ్యాయి కూడా. అయితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న కాలేజీలనూ పట్టించుకోలేదు. పైగా.. ఇప్పుడు పీపీపీ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులతో తప్పుడు ప్రచారం సైతం చేయించారు. 

మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్న చంద్రబాబు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. పార్టీ యువత, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టబోతోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement