
జెమిని నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ఎంతలా ప్రజాదరణ పొందుతుందో తెలిసిందే. నెట్టింట ఈ టెక్నాలజీ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ టెక్నాలజీతో రోజుకో కొంగొత్త పోటోలు దర్శనమిస్తున్నాయి. అలానే ఈసారి ఓ ఫోటో వైరల్ అవ్వడమే కాదు..గగుర్పాటుకు గురిచేసేలా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఇది ఉపయోగించొచ్చా? వద్దా? అన్న మీమాంసలో పడేసింది. పైగా ఈ ట్రెండ్‌ని చూసి రతన్ టాటా సహాయకుడిగా ప్రసిద్ధి చెందిన శంతనునాయుడు ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అందుకు నెటిజన్లు మద్దతిస్తూ..ఔను కరెక్ట్ చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.
ఈ నయా ట్రెండ్‌లో ఓ మహిళ అందరిలా ఈమె కూడా తన ఫోటోని చిత్రించాలనుకుంది. తాను డ్రెస్‌లో ఉన్న చిత్నాన్ని ఈ టెక్నాలజీ సాయంతో చీరలో మార్చి..తన లుక్ చూడాలనుకుంది. అంతే అది ఏకంగా అత్యంత ఆకర్షణీయమైన చీర లుక్‌లో ఆమె ఆహార్యాన్ని అందంగా చూపించడమే కాదు. ఆమెకు తన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉందో దాంతో సహా చూపించడంతో సదరు మహిళ విస్తుపోయింది.
ఒక్కసారిగా ఆమెకు నోట మాట రాలేదు. ఇది సురక్షితమేనా అని భయాందళోనలకు లోనయ్యింది. అందుకు సంబంధించిన పోటోని నెట్టింట షేర్ చేస్తూ..ఇది చాలా భయంకరంగా ఉంది. అస్సలు ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు అని పోస్ట్‌లో రాసుకొచ్చిందామె. ఈ చీర ట్రెండ్ దివంగత రతన్ టాటా సహాయకుడిగా పేరొందిన శంతను నాయుడు టీజ్ చేస్తూ..ఆలోచింప చేసేలా ఒక కామెంట్ చేశారు. నిజానికి జెమిని యాప్‌లోని గూగుల్ డీప్‌మైండ్ ఇమేజ్-ఎడిటింగ్ మోడల్ క్యాజువల్ సెల్ఫీని సినిమాటిక్ పోర్ట్రెయిట్‌గా మార్చగల సాధనం.
బాలీవుడ్‌ని తలపించేలా మన లుక్‌ని అందంగా మార్చే ఏఐ సాధనం. ప్రస్తుతం ఎటు చూసినా ఈ క్రేజీ ట్రెండ్ నడుస్తోంది. అయితే శంతను నాయుడు ఈ క్రేజీ ట్రెండ్‌కి ఎవ్వరూ అమ్ముడుపోరని నమ్మకంగా చెప్పేశారు. నాకస్సలు అర్థం కావడం లేదు చీరలో భారతీయ ప్రజలు తమను తాము చూసుకోవడం ఏంటీ..ఇది చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఎందుకంటే భారతీయత చిహ్నమే చీర.
అలాంటి చీరలో తమ లుక్‌ని చూసుకునేంత పిచ్చి ఉండటం ఏంటి. ఇప్పటికే వారి వార్డురోబ్‌లో దాదాపు 15 చీరలపైనే ఉంటాయి. చక్కగా వాటిని తీసి ధరించి చూసుకోండి చాలు. అంతేగానే ఏదో కొత్త ట్రెండ్ అని విచిత్రమైన చీరల్లో మీ లుక్‌ని చూసుకునేందుకు ఇంతలా ప్రయాస పడుతూ టెక్నాలజీని వాడాల్సిన పని లేదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతే ఆయన పోస్ట్‌ని చూసిన నెటిజన్లు..ఇది చాలా నిజం, చక్కగా చెప్పారు. బహుశా ఈ స్వభావాన్ని చూసే టాటా దిగ్గజం రత్‌న టాటా మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు.
(చదవండి: టేస్ట్‌ని మిస్ అవ్వకుండా హెల్దీగా తిందాం ఇలా..!)