అత్యున్నత హోదాలో ఉండి అంతే శారీరక ధృడత్వంతో మంచి ఎత్తుతో ఉంటే..కళ్లు తిప్పుకోలేం కదూ. అబ్బా పదవికి తగ్గ ఫిజిక్ అన్న ఫీల్ కలుగుతుంది. అలాంటి అనుభవమే ఎదురైంది ఇటాలియన్ ప్రధాని మోలోనికి. ద్వైపాక్షిక సమావేశం కోసం వచ్చినప్పుడూ ఆ దేశ అధ్యక్షులు ఘనంగా ఆహ్వానం పలకడం కామన్. అలానే మొజాంబిక్ దేశ అధ్యక్షుడకి చక్కగా ఆహ్వానం పలికింది ఇటలీ దేశం . అయితే ఆ దేశ అధ్యక్షుడిని చూడగానే ఒక్కక్షణంలో ఇటలీ ప్రధాని మెలోని రియాక్షన్ మారిపోయింది. అది స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తోంది కూడా. అంతేగాదు వారిద్దరిని కెమెరాలో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు సైతం ఇబ్బంది పడ్డారు.
అసలేం జరిగిందంటే గతవాంర మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో రోమ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన్కు స్వాగం పలికేందుకు వచ్చిన ఇటలీ ప్రధానికి మెలోని ఒక్కసారిగా కంగుతింటుంది. ఎందుకంటే డేనియ చాపో ఎత్తు చూసి ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా అతనికి కరచాలనం చేయడానికి కూడా తడబడుతుంది. చెప్పాలంటే ఆమె ముఖంలో ఇంత పొడుగా అని విస్తుపోతున్నట్లు హవభావాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఆమె మనసులో ఏదో అనుకుంటూ ఇబ్బందిగా మొజాంబిక్ అధ్యక్షుడు చాపోకి కరచాలనం ఇవ్వడానిక వస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అంతేగాదు అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లుకు సైతం ఇద్దర్నీ ఒకే ఫోటోఫ్రేంలో బంధించడం చాలా సవాలుగా మారుతుంది. ఎందుకంటే అత్యున్నత హోదాలో ఉన్నవారి శారీరక ఎత్తులలో మరి ఇంత వ్యత్యాసం కనపడుకుండా కవర్ చేసేందుకు నానాతంటాలు పడ్డారు ఫోటోగ్రాఫర్లు. కానీ అది దాదాపు అసాధ్యం.
ఎందుకంటే మొజాంబిక్ అధ్యక్షుడు డేనియ్ చాపో ఎత్తు ఏకంగా 6'8 కాగా, మెలోని ఎత్త కేవలం 5'2. నెట్టంట అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ ద్వేపాక్షిక సమావేశంలో ఇరువురు ఇటలీ మాట్టేయి ప్లాన్ ఫర్ ఆఫ్రికా శక్తి, వాణిజ్యం, సహకారం వంటి వాటిపై చర్చలు జరిపారు. కాగా, తన దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించిన మొజాంబిక్ అధ్యక్షుడు డేనియల్ చాపో అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 70 శాతం మెజార్టీ ఓట్లతో ఈ ఏడాది ప్రారంభంలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
Ho ricevuto oggi a Palazzo Chigi il Presidente della Repubblica del Mozambico, Daniel Francisco Chapo.
In particolare il colloquio, nel ricordare il cinquantesimo anniversario dell’indipendenza mozambicana e dello stabilimento delle relazioni diplomatiche, ha confermato la… pic.twitter.com/hI8kH3pFfO— Giorgia Meloni (@GiorgiaMeloni) December 11, 2025
(చదవండి: హనుక్కా పండుగ అంటే..? యూదులు ఎందుకింత ఘనంగా జరుపుకుంటారంటే..)


