
హెల్త్ ఆర్క్ ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యుఈ సర్చ్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025 మూడు రోజుల పాటు వైభవంగాసాగి ఘనంగా ముగిసింది. ఈ సమ్మిట్‌లో సుమారు 13దేశాల నుంచి రెండు వేల మందికిపైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 62 మంది ప్రముఖులు, సుమారు 42 అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ఆరోగ్యరంగంలో వాస్తవిక ప్రపంచం సాక్ష్యాలు(ఆర్‌డబ్ల్యూఈ), కృత్రిమ మేధస్సు(ఏఐ), డిజిటల్ హెల్త్, ఇన్నోవేషన్‌పై లోతైన చర్చలు జరిగాయి.
ఈ సమ్మిట్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ & లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖా మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇలాంటి వేదిక సమయోచితమైందని, ఈ వేదికపైకి గ్లోబల్ నిపుణులను తీసుకొచ్చిన హెల్త్ ఆర్క్ బృందం అభినందనీయం అని పేర్కొన్నారు.
ఇక మాజీ భారత శాశ్వత ప్రతినిధి, ప్రస్తుత కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఔషధరంగం, లైఫ్‌సైన్సెస్ రంగాల అగ్రనేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. దాంతోపాటు ప్రస్తుత జియోపాలిటికల్ క్లిష్ట పరిస్థితులు, వాటి వ్యాపార ప్రభావం” పై ప్రసంగిస్తూ.. మారుతున్న ప్రపంచ సమీకరణలు రంగంపై చూపుతున్న అవకాశాలు, సవాళ్ల గురించి విశ్లేషించారు.
చదవండి: Shubhanshu Shukla: స్పేస్‌లో వ్యోమగాములు ఫిట్‌నెస్‌ను ఎలా నిర్వహిస్తారంటే..!