పెళ్లిలో వ‌ధువు ల్యాప్‌టాప్ ప‌ట్టుకుని.. | Bride fixes critical bug just 10 minutes after wedding | Sakshi
Sakshi News home page

Gauri Agarwal: కమిట్‌మెంట్‌ అంటే అది!

Dec 19 2025 7:37 PM | Updated on Dec 19 2025 7:58 PM

Bride fixes critical bug just 10 minutes after wedding

వృత్తి నిబద్ధత అనే మాట వినబడుతుందేగానీ కనిపించడం అరుదు. అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘కోయల్‌ ఏఐ’ అనే కంపెనికీ కో–ఫౌండర్‌ గౌరీ అగర్వాల్‌.

ఆరోజు ఆమె పెళ్లి... వధువుగా పెళ్లి వేడుకల్లో బిజీ బిజీగా ఉన్న ఆమెకు ‘కోయల్‌లో ఏఐలో బగ్‌ ప్రాబ్లమ్‌’ అంటూ ఒక వార్త వినిపించింది. ‘ఎవరికైనా చెప్పండి’ అని విసుక్కోకుండా... వేదికలో ఒక పక్కకు వెళ్లి... ల్యాప్‌టాప్‌ తీసుకొని క్రిటికల్‌ బగ్‌ను పది నిమిషాల్లో సాల్వ్‌ చేసింది గౌరీ అగర్వాల్‌.

‘ఎక్స్‌’లో ఆమె తమ్ముడు మెహుల్ అగ‌ర్వాల్‌ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ బోలెడు లైక్‌లతో దూసుకుపోతోంది. ‘స్టార్టప్‌ల గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతుంటారు. అయితే అది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పడూ అప్రమత్తంగానే ఉండాలి. విజేతల వృత్తి నిబద్ధత ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ వీడియో క్లిప్‌ను షేర్‌ చేశాను’ అని రాశాడు గౌరీ అగర్వాల్‌ (Gauri Agarwal) సోదరుడు మెహుల్‌.

అయితే సోషల్‌ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 
కొందరు గౌరీ అగర్వాల్‌కు జై కొట్టారు.
కొందరు ‘ఇది సరికాదేమో!’ అన్నట్లుగా కామెంట్‌ పెట్టారు.

‘నేను కూడా వృత్తిని బాగా ప్రేమిస్తాను. అందుకోసం అపురూప క్షణాలను మాత్రం వృథా చేసుకోవాలనుకోను’ అని ఒకరు రాశారు. 

చ‌ద‌వండి: 20 ఏళ్ల‌కే రీసైకిలింగ్ కింగ్‌..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement