
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో కాలుమోపి చరిత్ర సృష్టించిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష వ్యాయామ పద్ధతుల గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మెక్రోగ్రావిటీలో శారీరక శ్రమ ఎంత ప్రధానమైనదో వివరించారు. వాళ్లు ఫిట్‌నెస్‌పై ఉంచే దృష్టి మొత్తం మిషన్ సక్సెస్‌కి అత్యంత కీలకమని చెప్పారు. అయితే ఇక్కడ భూమ్మీద ఉన్నట్లుగా జిమ్ సభ్యత్వం ఉండదు. అక్కడ చేసిన సౌలభ్యకరమైన పరికరాలతో చేసే ఛాన్సే ఉండదు. మరి ఎలా చేస్తారంటే..
అలాంటప్పుడూ ప్రత్యేక శిక్షణతో కూడిన వ్యాయామాలను వ్యోమగాములు అనుసరిస్తారని చెబుతున్నారు శుభాంశు. జీరో గ్రావిటీలో చాలా రకాల శారీరక మార్పులు ఉంటాయి. శరీరం జీరో గురుత్వాకర్షణ వద్ద మొత్తం బాడీ బద్ధకంగా ఉంటుందట. కండరాలు కుచించుకుపోయి, ఎముకలు బలహీనంగా అయిపోతాయట. దాంతోపాటు శరీరంలోని శక్తి కూడా సహకరించేందుకు ఇష్టపడదట. మన కార్డియో, బలం రెండూ దెబ్బతింటాయట. అందువల్ల అంతరిక్షంలో వ్యాయామం అనేది ఒక ఆప్షన్ కాదు. వ్యోమగాములకు అది తప్పనిసరిగా చేయాల్సిన శారీరక శ్రమ.
స్పేస్ బైక్..
అందుకోసం స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములు CEVIS (వైబ్రేషన్ ఐసోలేషన్ సిస్టమ్‌తో సైకిల్ ఎర్గోమీటర్) వంటి పరికరాలను ఉపయోగిస్తారని చెప్పారు శుభాంశు. ఇది ప్రాథమికంగా షాక్ అబ్జార్బర్‌కు బోల్ట్ చేయబడిన స్పేస్ బైక్ లాంటిదని అన్నారు. CEVIS వ్యవస్థ వ్యాయామం ద్వారా ఉత్పన్నమయ్యే కంపనాలను గ్రహిస్తుంది. ఫలితంగా అంతరిక్ష కేంద్రం అనాలోచిత కదలికలను నిరోధిస్తుంది. ఈ స్పేస్ బైక్‌లో సీటు ఉండదు ఎందుకంటే తేలుతున్నట్లు ఉంటుంది ాకాబట్టి ీసీటుతో పని ఉండదట. దానిపై కూర్చొన్న భంగిమలో పాదాలను లాక్ చేసి పెడలింగ్ చేస్తారట. అంతేగాదు పాదాలను పట్టీల సాయంతో నియంత్రణలో సురక్షితంగా ఉంచుకుంటారట.
ఈ వ్యాయామం సమగ్ర హృదయనాళ వ్యవస్థను మెరుగ్గా ఉంచి, కండరాల క్షీణత, ఎముక సాంద్రత నష్టాన్ని నివారిస్తుందని చెప్పుకొచ్చారు వ్యోమగామి జీపీ కెప్టెన్. ఇక్కడ స్పేస్ వాతావరణానికి తగ్గట్టుగా ఫిట్‌నెస్ పరంగా "జీరో గ్రావిటీ, జీరో సాకులు." అని చమత్కరించారు శుభాంశు. చివరగా అంతరిక్షంలో జీవిత సవాళ్లకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉండేలా పనితీరును నిర్వహించడానికి అంకితభావంతో కూడిన నిబద్ధత అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు.
(చదవండి: హ్యాట్సాఫ్ గుత్తా జ్వాలా..! అమ్మతనానికి ఆదర్శంగా..)