
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ దంపతులు ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా తల్లిపాలకు దూరమైన శిశువులు అకాల అనారోగాల బారిన పడకుండా తన వంతుగా తల్లిపాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఈ తల్లిపాల డ్రైవ్‌లో అందరూ పాలుపంచుకునేలా ప్రేరేపించేలా ఆమె తల్లిపాలను దానం చేశారు. జ్వాలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. "అంతేగాదు తల్లిపాలు బిడ్డల ప్రాణాలను కాపాడుతుంది, పైగా అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తుంది. మన దానం చేసే పాలు ఓ బిడ్డ జీవితాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాయి. అలాంటి పాలను దానం చేసేందుకు ప్రతి అమ్మ ముందుకు రావాలి. పైగా ఈ పాలు అవసరం ఉన్న కుటుంబం పాలిట దేవతా లేక హీరోగా ఉంటారు. అందువల్ల దయచేసి పాల బ్యాంకుకి మద్దతివ్వండి. "అంటూ పోస్లులో రాసుకొచ్చారామె.
ఇకజ్వాల ఇప్పటివరకు 30 లీటర్ల తల్లిపాలను దానం చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆమె విశాల హృదయానికి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు. అంతేగాదు. దీనిపై అందరు అవగాహన పెంచుకోవాలంటూ పోస్టులు పెట్టారు.
కాగా జ్వాల గుత్త.. నటుడు విష్ణు విశాల్‌ను 22 ఏప్రిల్ 2021న వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి అయ్యింది. జ్వాల తన ఆడపిల్లకు పాలు ఇచ్చిన తర్వాత తన పాలన్నింటినీ దానం చేస్తుంది. భారతదేశంలో మొదటిసారిగా, ఒక అథ్లెట్ ఈ విధంగా తన పాలను దానం చేయడం నిజంగా స్ఫూర్తిదాయకమంటూ అందరు ఆమెను ప్రశంసిస్తున్నారు.