ప్రాణధారలో చాంపియన్‌ | Indian Badminton Star Jwala Gutta Donates Breast Milk to Save Premature Babies | Sakshi
Sakshi News home page

ప్రాణధారలో చాంపియన్‌

Sep 17 2025 1:52 AM | Updated on Sep 17 2025 1:52 AM

Indian Badminton Star Jwala Gutta Donates Breast Milk to Save Premature Babies

న్యూస్‌మేకర్‌ – గుత్తా జ్వాల

గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌ చాంపియన్‌గా అందరికీ తెలుసు. కాని నవజాత శిశువులకు ప్రాణాధారమైన తల్లిపాలను డొనేట్‌ చేయడంలో కూడా చాంపియన్‌గా నిలిచి  దేశం మన్ననలు  పొందుతోంది. పాలు పడని తల్లులు జబ్బుతో ఉన్న పిల్లలు, నవజాత శిశువులకు పాలు ఇవ్వలేనప్పుడు దానం ఇచ్చినపాలు ఎంతో మేలు చేస్తాయి అంటున్న ఆమె 30 లీటర్ల తల్లిపాలు డొనేట్‌ చేసింది. వివరాలు...

‘నాపాపకుపాలు పట్టించాక ఇంకా చాలాపాలు మిగులుతున్నాయనిపించింది. వాటిని ఏం చేయాలా... అనుకున్నాను. మా చెల్లెలికి ప్రిమెచ్యూర్‌ బేబీ పుట్టినప్పుడు మొదటి వారం వేరే వాళ్ల దగ్గర నుంచి చనుబాలు తీసుకున్నట్టు తను చెప్పింది. అలా చాలామంది చంటి పిల్లలకు చనుబాలు అవసరమని గుర్తుకొచ్చింది. హైదరాబాద్‌లోని నిలోఫర్‌లో ప్రతిరోజూ కనీసం 80 మంది పిల్లలకు బయటి నుంచి చనుబాలు కావాలని ఎవరో చెప్పారు. నా దగ్గర అదనంగా ఉన్నపాలు ఎంతమంది పిల్లలకు అందితే అంత మంచిదని చనుబాల దానం చేశాను’ అంటున్నారు గుత్తా జ్వాల.

మొన్నటి ఏప్రిల్‌లో ఆమెకు ఐవీఎఫ్‌ ద్వారాపాప పుట్టింది. ఆమెకు మీరా అనే పేరు పెట్టారు గుత్తా జ్వాల ఆమె భర్త విష్ణు విశాల్‌.పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ గుత్తా జ్వాల తన చనుబాలు 30 లీటర్లు దానం చేశారు. ఈ సంగతిని తాజాగా ఆమె వెల్లడించి ‘ఇది అదనపు చనుబాలు ఉన్న తల్లులందరికీ స్ఫూర్తినివ్వాలి.పాలు వృధాపోయే బదులు అవసరం ఉన్న చంటి పిల్లలకు అందితే ఎంతో మేలు. ప్రతి తల్లీ మిల్క్‌ బ్యాంక్‌ల గురించి తెలుసుకోవాలి. చనుబాలు దానం చేయాలి’ అందామె.

పాలకై ఎదురుచూపులు
నిత్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద, బీద వర్గాల్లోని తల్లులకు ప్రిమెచ్యూర్‌ బేబీలు పుడుతుంటారు. కాన్పు తర్వాత అనారోగ్యంపాలైన తల్లులుపాలు ఇవ్వలేరు. కొందరికిపాలు పడవు. కొందరికి  పౌష్టికాహార లోపం వల్ల తగినన్నిపాలు రావు. చంటి పిల్లలకు తల్లిపాలకు మించి అమృతం లేదు. అది ఏ విధంగా అందినా గొప్పే. అందుకే గుత్తా జ్వాల అలాంటి పిల్లలను తన చనుబాలు దక్కాలని అనుకుని నీలోఫర్‌లో దానం చేశారు.

‘నా చనుబాలు దానం చేసే ముందు మా డాక్టర్‌ని అడిగి సలహా తీసుకున్నాను. ఒకటి రెండు రక్త పరీక్షలు చేసి నేను దానం ఇవ్వొచ్చో కూడదో చెప్పారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ పంప్‌ సహాయంతో చనుబాలు తీసి కవర్లలో ఫ్రీజ్‌ చేసి నిల్వ చేయవచ్చు. సరైన ఫ్రీజర్లలో నిల్వ చేసిన చనుబాలను ఆరు నెలల వరకూ వాడొచ్చని డాక్టర్లు చెప్పారు. నేను చనుబాలు ఇస్తానని ఇన్ఫార్మ్‌ చేస్తే నిలోఫర్‌ వాళ్లే వచ్చి తీసుకెళ్లారు’ అని చెప్పింది జ్వాల.

పిల్లలే ముఖ్యం
‘తల్లులు రకరకాల కారణాల వల్ల పిల్లలకు చనుబాలు ఇవ్వడం లేదు. నేనేమీ తప్పు పట్టను. ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఇవి తప్పవు. కొందరిపాలు రావు. కాని బిడ్డతో అనుబంధం ఏర్పడాలన్నా, వారితో ఉద్వేగాలు పంచుకోవాలన్నా తల్లిపాలు ఇవ్వడం మంచిదని నా అభి ప్రాయం. మన సమస్యలు ఎన్ని ఉన్నా బిడ్డ ఆరోగ్యమే తల్లులకు ప్రథమం కావాలి’ అంటున్నారు జ్వాల. ఆరోగ్యంగా ఉన్న తల్లులు అపోహలు వీడి, మూఢ విశ్వాసాలకుపోకుండా తమ దగ్గర అదనంగా ఉన్నపాలు దానం చేయాలని పిలుపిస్తున్నారామె.

ఆరోగ్యమేపాలు
అథ్లెట్‌గా మొదటి ఇరవై ఏళ్లు నేను జంక్‌ ఫుడ్‌ తినలేదు. వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటూ జీవితం గడిపాను. అందుకే నాకుపాలు సమృద్ధిగా ఉన్నాయి.పాప కడుపు నిండుగా తాగాక రోజులు అర లీటరుగా పైగాపాలు నాలో  పొంగుతున్నాయి. అవన్నీ సేకరించి దానం చేస్తున్నాను. అవి కొందరు పసిపిల్లలకు అందుతున్నాయన్న భావన నాకెంతో సంతోషం ఇస్తోంది. – గుత్తా జ్వాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement