బిహార్‌లోని ఓ గ్రామంలో చేపట్టిన అధ్యయనంలో వెల్లడి
ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదంటున్న నిపుణులు
న్యూఢిల్లీ: బిహార్‌లోని ఓ గ్రామంలో చేపట్టిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఊళ్లో తల్లి పాలలోనూ రేడియో ధార్మీక పదార్థం యురేనియం
(యు–238) ఉన్నట్లు నిపుణులు ప్రకటించారు. యురేనియం మూలకం 5 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) ఉన్నట్లు గుర్తించారు. ‘గ్రామంలో పాలిచ్చే 40 మంది తల్లులపై అధ్యయనం జరిపాం. అందరి వద్ద సేకరించిన పాలల్లోనూ యురేనియం ఉన్నట్లు తేలింది.
పాలు తాగుతున్న 70 శాతం మంది చిన్నారుల్లో యురేనియంతో సంభవించే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అనుతించిన యురేనియం స్థాయిల కంటే ఎంతో తక్కువగా ఉన్నందున తల్లులకు, బిడ్డల ఆరోగ్యంపై ఎలాంటి దు్రష్పభావం లేదు’అని పటా్నలోని మహావీర్ కేన్సర్ సంస్థాన్ రీసెర్చ్ సెంటర్, ఢిల్లీలోని ఎయిమ్స్, లవ్లీ ప్రొఫెషనల్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. తల్లులు తమ బిడ్డలకు పాలివ్వడం ఎప్పటిమాదిరిగానే కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.
ఈ ఫలితాలు ఇటీవల బ్రిటిష్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనాన్ని అణు శాస్త్రవేత్త డాక్టర్ కె.ఆస్వాల్ కొట్టిపారేశారు. ‘ఇందులో కంగారు పడాల్సిన అంశమేదీ లేదు. తల్లులు తమ చిన్నారులకు పాలివ్వడాన్ని ఎలాంటి సంకోచం లేకుండా కొనసాగించొచ్చు. తాగే నీటిలో 30పీపీబీ వరకు యురేనియం ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
దాంతో పోలిస్తే బిహార్ నమూనాల్లో కనుగొన్న యురేనియం ఆరు రెట్లు తక్కువ. చాలా తక్కువ మొత్తంలో సహజంగానే మట్టిలో యురేనియం ఉంటుంది. పాలిచ్చే తల్లులు తీసుకుని యురేనియంలో అత్యధిక భాగం మూత్రం ద్వారా వెళ్లిపోతుంది. అది పోను తల్లి పాలలో ఉండే యురేనియం పాలు చాలాచాలా తక్కువ. దీనితో ఎటువంటి ప్రమాదమూ ఉండదు’అని ఆయన స్పష్టం చేశారు. పరిశోధనలు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కలి్పంచాలే తప్ప, భయాందోళనలను, అనుమానాలను సృష్టించేలా ఉండరాదని ఆయన వ్యాఖ్యానించారు.


