మహాసముంద్ (ఛత్తీస్‌గఢ్): ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాలుగో తరగతి ఆంగ్ల పరీక్ష పత్రం ఇప్పుడు రాష్ట్రంలో వివాదాస్పదమైంది. ఒక ప్రశ్నలో ‘కుక్క పేరు’గా దైవనామమైన ‘రామ్’ను ఆప్షన్‌గా ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరిగిన అర్ధవార్షిక పరీక్షలో ఒక ‘మలి్టపుల్ ఛాయిస్’ప్రశ్నను ఇలా ఇచ్చారు.. ‘మోనా పెంచుకునే కుక్క పేరు ఏమిటి?.. ఆప్షన్లు: (ఎ) బాల, (బి) షేరు, (సి) ఎవరూ కాదు, (డి) రామ్’.
వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నిరసన కుక్క పేరుగా భగవంతుడి పేరును వాడటం మతపరమైన మనోభావాలను దెబ్బ తీయడమేనని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు ఆందోళనకు దిగాయి. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముందు నిరసన తెలిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వివాదం ముదరడంతో.. జిల్లా విద్యాశాఖాధికారి విజయ్ కుమార్ స్పందిస్తూ.. తాము పంపిన ఒరిజినల్ పేపర్ కాకుండా, ప్రింటింగ్ సమయంలో వేరే పేపర్ వచ్చిందని వివరించారు. విషయం తెలిసిన వెంటనే ఆ ఆప్షన్‌ను తొలగించి కొత్తది చేర్చామన్నారు.


