అలాంటి ఇలాంటి పిల్లి కాదు..! నష్టాల్లో ఉన్న రైల్వేని గట్టేక్కించిదట.. | Train Stationmaster Cat Nitama Dies In Japan | Sakshi
Sakshi News home page

అలాంటి ఇలాంటి పిల్లి కాదు..! నష్టాల్లో ఉన్న రైల్వేని గట్టేక్కించిదట..ఎలాగో తెలుసా..!

Dec 19 2025 5:43 PM | Updated on Dec 19 2025 6:55 PM

Train Stationmaster Cat Nitama Dies In Japan

ఈ పిల్లి రైలులో స్టేషన్‌మాస్టర్‌. ఔను మీరు వింటుంది నిజం. ఇదేంటి పిల్లి స్టేషన్‌మాస్టర్‌ అనుకోకండి. అది చక్కగా విధులు నిర్వర్తించి శెభాష్‌ అనిపించుకోవడమే కాదు..ఏకంగా నష్లాల్లో ఉన్న రైల్వేని లాభాల బాట పట్టించిందట. అంతేకాదండోయే ఈ పిల్లి క్రేజ్‌కి నోటమాటరాదు. విధులు నిర్విర్తిస్తూ అనారోగ్యంతో చనిపోతే..దానికి వీడ్కోలు పలికేందుకు ఏ రేంజ్‌లో జనాలు వచ్చారో తెలిస్తే..కంగుతింటారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేద్దామా..!.

ఇప్పుడు చెప్పుకోబేయే పిల్లి పేరు  నిటామా. జపాన్‌లోని వాకాయామా కిషి స్టేషన్‌కు స్టేషన్‌మాస్టర్‌గా ఉండేది. వాకాయామా ఎలక్ట్రిక్ రైల్వే కోలో స్టేషన్‌ మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉండేది. ఈ ఏడాది అక్టోబర్‌ చివరిలో ఆరోగ్య క్షీణించడంతో ఇటీవలే కన్నుమూసింది. 15 ఏళ్ల వయసులో మరణించింది.

పిల్లి ఎలా విధులు నిర్వర్తిస్తుందంటే..
వాకాయామా నగరంలో జన్మించిన ఈ పిల్లిని  ఓ వర్షం కురిసిన రోజు కారు కింద నుంచి రైల్వే వారు రక్షించారట. అప్పటి నుంచి దీని బాగోగులు అన్ని ఆ రైల్వేనే చూసుకునేదట. అంతకుముందు ఈ రైల్వేలో స్టేషన్‌ మాస్టర్‌గా పనిచేసిన టామా నుంచి నేరుగా శిక్షణ తీసుకుందట ఈ నిటామా. అంతేకాదండోయ్‌ టామా వారసురాలిగా దాని స్థానంలో రానున్న ఈ నిటామా పిల్లికి అత్యంత స్ట్రిట్‌గా ట్రైనింగ్‌ ఇచ్చేదట ఆ టామా పిల్లి. 

ఎవ్వరితోనైనా సౌమ్యంగా ఉడే ఆ టామా..నిటామా పిల్లి వద్దకు వచ్చేటప్పటికీ..సరిగా పని నేర్చుకోవాలని సీరియస్‌ ఉండేదట. అలా ఆ టామా తదనంతర స్టేషన్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తించిందట. అయితే ఈ కిషి స్టేషన్‌లో పనిచేయడాని కంటే ముందు  అదే ట్రాక్‌లో ఇడాకిసో స్టేషన్‌లో స్టేషన్‌మాస్టర్‌గా పనిచేసేదట. 

ఆర్థికంగా నష్టాల్లో ఉన్నఈ  రైల్వే మార్గాన్ని పునరుద్ధరించే పనిలో భాగంగా వీటిని స్టేషన్‌ మాస్టార్‌లుగా నియమించిందట జపాన్‌ ఎలక్ట్రిక్‌ రైల్వే కో లిమిటెడ్‌. అంతేగాదు ఆ రైల్వేలో సెలబ్రిటీ మాదిరిగా క్రేజ్‌ తెచ్చుకున్న ఈ నిటామా పిల్లి అంత్యక్రియలకు ఏకంగా 500మంది దాక హాజరయ్యారట కూడా. 

అంతేగాదు ఆ పిల్లిచివరి కార్యక్రమాలన్నింటిని ఆ వాకాయామా ఎలక్ట్రిక్‌ రైల్వే అధ్యక్షుడు మిత్సునోబు కోజిమా చూసుకున్నారట. అయితే ఈ నిటామా ఎంతమేరకు ఈ రైల్వే మార్గానికి రైడర్‌షిప్‌ అందించిందనేది రహష్యంగా ఉన్నా..గతంలో టామా అనే పిల్లి మాత్రం ఏకంగా రూ. 82 కోట్లు పైనే ఆదాయాన్ని ఇవ్వడమే గాక ఏకంగా 17% రీడర్‌షిప్‌ని కూడా అందించిందట.

(చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్‌లో హాట్‌టాపిక్‌గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement