రామ్‌ చరణ్‌పై అభిమానం.. జపాన్‌ నుంచి వచ్చిన యువతులు | Japan Girl Meet With ram charan In Hyderabad | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌పై అభిమానం.. జపాన్‌ నుంచి వచ్చిన యువతులు

Dec 9 2025 8:55 AM | Updated on Dec 9 2025 10:22 AM

Japan Girl Meet With ram charan In Hyderabad

టాలీవుడ్‌ హీరోలకు జపాన్‌లో ఫ్యాన్స్‌ భారీగానే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఒక యువతి ఏకంగా జపా‌న్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా  రామ్‌ చరణ్‌ (Ram Charan)పై అభిమానం పెంచుకున్న కొందరు జపాన్‌ ఫ్యాన్స్‌ ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్‌ వారందరినీ ఇంటికి పిలిపించి మాట్లాడారు. వారందరితో కొంత సమయం పాటు ఆయన సరదాగా గడపడమే కాకుండా ఫోటోలు దిగారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశామని చాలాబాగా నచ్చిందని వారు చెప్పారు. అయితే, వారందరూ కూడా పెద్ది సినిమా టీషర్ట్స్‌ వేసుకుని కనిపించి మెప్పించారు. వారి అభిమానానికి చరణ్‌ ఫిదా అయ్యారు. వారందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement