జపాన్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరికలు | Japan earthquake strikes Hokkaido and Tohoku tsunami advisory | Sakshi
Sakshi News home page

జపాన్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరికలు

Dec 12 2025 10:48 AM | Updated on Dec 12 2025 11:19 AM

Japan earthquake strikes Hokkaido and Tohoku tsunami advisory

టోక్యో: జపాన్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉత్తర జపాన్ తీరంలో శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. తాజా భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.

జపాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. జపాన్‌లో భూకంప తీవ్రతను 6.7గా నిర్ధారించింది. హోన్షు ద్వీపంలోని ఇవాటే ప్రిఫెక్చర్‌లోని కుజీ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పసిఫిక్ తీర ప్రాంతాల్లో సుమారు మీటరు (మూడు అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.  

ఇక, కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసింది. ఈ క్రమంలో 50 మంది వరకు గాయపడ్డారు. అయితే, సోమవారం నాటి భూకంపంతో పోలిస్తే ఈసారి ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉందని స్థానిక మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే తెలిపింది. ఈ భూకంపం వల్ల ఆ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి నష్టం జరగలేదని, అసాధారణ పరిస్థితులేవీ గమనించలేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ స్పష్టం చేసింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement