సాధారణంగా ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీసుకు వస్తేనే కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటాయి. కానీ, స్పెయిన్‌లో ఒక మహిళ.. చాలా ముందుగా ఆఫీసుకు వస్తోందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు. మీరు చదివింది నిజమే.. స్పెయిన్‌లో రూల్ అంటే రూలే మరి.
మేనేజర్ల ఆదేశాలుబేఖాతర్..
స్పెయిన్‌కు చెందిన 22 ఏళ్ల ఒక ఉద్యోగిని అధికారికంగా ఉద యం 7.30 గంటలకు పని ప్రారంభించాలి. కానీ, ఆమె అలవాటు ప్రకారం రోజూ దాదాపు 6.45 గంటలకే కార్యాలయానికి చేరుకునేది. ఒకరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాదికి పైగా ఇదే పద్ధతిని పాటించింది. ఈ విషయంలో కంపెనీ ఆమెకు చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో ఆమెకు కేటాయించిన పనులేవీ లేవని, ముందే రాకూడదని స్పష్టంగా చెప్పినా.. ఆమె వినిపించుకోలేదు.
ఎందుకుముందే వచ్చావ్!
కంపెనీ యాజమాన్యానికి సహనం నశించింది. ఆదేశాలను ఉద్యోగిని పట్టించుకోకపోవడం, నియమాలను ఉల్లంఘించడం తీవ్రమైన దు్రష్పవర్తనగా భావించింది. ‘ఇది కేవలం ఉత్సాహం కాదు, కంపెనీ ఆదేశాలను పదేపదే ధిక్కరించడమే’.. అని మేనేజర్లు స్పష్టం చేశారు. ఆ సమయంలో చేయగలిగిన ముఖ్యమైన పనులేవీ లేనప్పటికీ, కావాలనే పదేపదే ఆదేశాలను బేఖాతర్ చేయడంతో ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు.
న్యాయస్థానంలో నూచుక్కెదురు
కంపెనీ నిర్ణయంతో ఆగ్రహించిన ఆ మహిళ.. తన తొలగింపు అన్యాయమని వాదిస్తూ అలికెంట్ సోషల్ కోర్టులో సవాలు చేసింది. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా.. సంస్థ ఎన్ని హెచ్చరికలు చేసినా ఆమె అదే అలవాటును కొనసాగించిందని తేలింది. కొన్నిసార్లు, ఆమె ఆఫీసుకు రాకముందే కంపెనీ యాప్‌లో లాగిన్ కావడానికి కూడా ప్రయతి్నంచినట్లు కోర్టు దృష్టికి వచి్చంది.
రూల్ అంటే రూలే మరి..
న్యాయమూర్తి.. ఉద్యోగం నుండి తొలగించడానికి కారణం ‘ముందే ఆఫీస్‌కు రావడం’కాదని, పనిచేసే చోట నియమాలను పాటించడానికి నిరాకరించడమే ప్రధాన కారణమని తన తీర్పులో స్పష్టం చేశారు. ఉద్యోగుల చట్టం ఆర్టికల్ 54 ప్రకారం ఇది నిబంధనల ఉల్లంఘనే అని తేలి్చ, కంపెనీ తొలగింపు నిర్ణయాన్ని కోర్టు సమరి్థంచింది. ప్రస్తుతానికి తీర్పు మారకపోయినా, ఆమె ఇంకా వాలెన్సియా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


