రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 (Kantara Chapter1) బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది.
అయితే ఈ మూవీని కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో దేశానికి చెందిన భాషల్లో కాంతార చాప్టర్-1ను విడుదల చేస్తున్నారు. స్పానిష్ భాషలోనూ ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా స్పానిష్ భాషలో కాంతార చాప్టర్-1 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈనెల 31న కాంతార చాప్టర్-1 థియేటర్లలో సందడి చేయనుందని ట్విటర్‌లో పోస్ట్ చేశారు మేకర్స్.
Una saga divina que comenzó en la India… ahora conquista el mundo.
Estreno el 31 de octubre en cines de todo el mundo, en español. 🇪🇸❤️🔥 #KantaraChapter1 Spanish (Española) Trailer out now.
▶️ https://t.co/AMQ74XYxpf#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab… pic.twitter.com/Ww5F82BNxF— Hombale Films (@hombalefilms) October 30, 2025


