అమెరికా సరికొత్త ఆంక్షలు
మెయిల్స్, ఫోన్ నంబర్లు, కుటుంబ చరిత్ర వడపోత
వాషింగ్టన్: విదేశీయులకు ప్రవేశ ని బంధనలను అగ్ర రాజ్యం అమెరికా నానాటికీ కఠినతరం చేస్తోంది. మూడో ఓరియన్ దేశాల వారికి శాశ్వతం తలుపులు మూసేస్తున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించే వెసులుబాటున్న దేశాలకు చెందిన ప్రయాణికుల కూడా పలు నిబంధనలను వర్తింపజేయాలని అమెరికా అంతర్గత భద్రత (హోమ్ లాండ్ సెక్యూరిటీ) విభాగం తాజాగా నిర్ణయించింది.
ప్రవేశానికి అనుమతించే ముందు వారి సోషల్ మీడియా హిస్టరీ, ఇ మెయిల్ ఖాతాలు, కుటుంబ సమగ్ర చరిత్ర తదితరాలను లోతుగా పరిశీలించనుంది. బుధవారం ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురించిన నోటీసులో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. వారి తాలూకు ఐదేళ్ల సోషల్ మీడియా సమాచారాన్ని వడపోయాలని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ప్రతిపాదించినట్టు అందులో పొందుపరిచారు. అంతేగాక ఐదేళ్లలో వారు వాడిన ఫోన్ నంబర్లు తదితరాలను కూడా ఇకపై విధిగా వెల్లడించాల్సి ఉంటుంది.
దాదాపు 40 దేశాలకు అమెరికాలోకి వీసారహిత ప్రవేశం అందుబాటులో ఉంది. అక్కడి పౌరులు అగ్ర రాజ్యానికి వెళ్లాలంటే ఎల్రక్టానిక్ సిస్టం ఫర్ ట్రావెల్ అథరైజేషన్‌లో ఆన్ లైన్‌లో వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. ఆ పద్ధతిని ఇకపై మార్చనున్నారు. అభంతరాల స్వీకరణ, వారి అనంతరం 60 రోజుల్లో ఈ నిబంధనలన్నీ అమల్లోకి రానున్నాయి. దీనివల్ల అమెరికాకు పర్యాటకపరంగా నష్ట ఉండబోదని మీడియా ప్రశ్నలకు బదులు ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాకు వీసారహిత ప్రవేశ వెసులుబాటున్న 40 దేశాల్లో అత్యధికం యూరప్, ఆసియా దేశాలే.


