మయన్మార్ మరోసారి నెత్తురోడింది. గురువారం పశ్చిమ రఖైన్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై ఆదేశ ఆర్మీ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ నెలలో ఆదేశంలో మిలటరీ దాడి చేయడం ఇది రెండోసారి.
మయన్మార్‌లో హింసతో అట్టుడుకిపోతుంది. 2021లో నోబెల్ గ్రహిత ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టి ఆదేశ ఆర్మీ అధికారాన్ని హస్తగతం చేసుకున్ననాటి నుంచి ఆ దేశం అంతర్గత సంఘర్షణలతో అట్టుడుకుతుంది. ఆర్మీకి వ్యతిరేకంగా అక్కడి రెబల్ గ్రూపులు వారి హక్కులు, సంస్కృతి కాపాడుకోవడానికి ఆర్మీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ వారిపై ఉక్కుపాదం మోపుతుంది. ఈనెల 5వ తేదీన సగాయింగ్ ప్రాంతంలో ఓ టీషాపులో పుట్‌బాల్ మ్యాచ్ తిలకిస్తున్న ప్రజలపై ఆర్మీ బాంబులతో విరుచుకపడింది. ఈ ఘటనలో 18మంది మృతిచెందారు. ఆ ఘటన మరవకముందే తాజాగా మరో ఆసుపత్రిపై దాడి చేసింది.
రఖైన్ రాష్ట్రంలోని మ్రౌక్ యు టౌన్‌షిప్‌లోని ఓ ఆసుపత్రిపై ఆదేశ ఆర్మీ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో 34 మంది చనిపోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ఆర్కాన్ అనే రెబల్ గ్రూపు ఆధీనంలో ఉంది.
మయన్మార్ ఆర్మీ ప్రధానంగా ఆ దేశ ఆర్మీ రెబల్ గ్రూపు ప్రాంతాలే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. 2025 ప్రారంభం నుంచి నవంబర్ చివరి వరకూ సైనిక దళాలు 2,165 సార్లు వైమానిక దాడులు నిర్వహించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. డిసెంబర్ 28నుంచి మయన్మార్‌లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే అక్కడి ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్త్నున్నట్లు సమాచారం.


