హైదరాబాద్: “ప్రాణాంతక న్యూరో అత్యవసర పరిస్థితులను వేగంగా గుర్తించడం, వాటి చికిత్స” అనే అంశంపై సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా (సెమి) సహకారంతో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఎంకాన్ 2025 సదస్సును శనివారం విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ ఎమర్జెన్సీ ఫిజిషియన్లు, న్యూరాలజిస్టులు, ఇంటెన్సివిస్టులు, ఇతర విభాగాల వైద్యనిపుణులందరినీ ఒక చోటుకు చేర్చి, న్యూరో అత్యవసర కేసుల చికిత్సలో కొత్త టెక్నాలజీలు, ప్రస్తుతం ఉన్న ట్రెండ్లపై రోజంతా చర్చించారు.
ఈ వర్క్‌షాప్‌లో కేసుల వారీగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా న్యూరోసర్జరీ కేసుల్లో చాలావరకు అత్యవసరంగా చికిత్సలు చేయాల్సినవి ఉంటాయని, అలాంటి సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని చెప్పారు. ఇందులో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి..
ఎమర్జెన్సీ విభాగంలో తక్షణం న్యూరోకేసులపై అంచనా
ఎమర్జెన్సీ విభాగంలో స్ట్రోక్ కేసుల్లో సమయమే కీలకం
తీవ్రమైన న్యూరోమస్క్యులర్, వెన్నెముక అత్యవసర పరిస్థితులు
కోమా, మానసిక పరిస్థితిలో మార్పులు- ఈడీ ఆల్గరిథమ్
పిల్లల్లో న్యూరో అత్యవసర పరిస్థితులు, న్యూరో ఇమేజింగ్
న్యూరో రీహాబిలిటేషన్‌లో అత్యవసర పరిస్థితులు
ప్రమాదాల్లో మెదడుకు గాయాలు (టీబీఐ), మెదడులో ఒత్తిడి పెరిగితే చికిత్స
ఈ వర్క్‌షాప్ గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సీఈఓ, కార్యక్రమ ప్యాట్రన్ డాక్టర్ కె. హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ, “అత్యవసర చికిత్సలు అందించేందుకు సిద్ధంగా ఉండడమే చావు బతుకుల మధ్య తేడాను నిర్ణయిస్తుందని ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో మేం నమ్ముతాము. న్యూరో అత్యవసర పరిస్థితుల్లో సమస్యను వేగంగా గుర్తించడం, అన్ని విభాగాల సమన్వయంతో చికిత్స చేయడం చాలా కీలకం. ఎంకాన్ లాంటి సదస్సులతో ఎమర్జెన్సీ విభాగం వైద్యులు ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే సాక్ష్యాల ఆధారిత ప్రోటోకాల్స్ గురించి తెలుసుకోవచ్చు. సెమి భాగస్వామ్యంతో ఇంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తించినందుకు మేమెంతో గర్విస్తున్నాం” అని చెప్పారు.
ఎంకాన్ 2025 అకడమిక్ ఛైర్, ఈవెంట్ డైరెక్టర్ డాక్టర్ టి.ఎస్. శ్రీనాథ్ కుమార్ మాట్లాడుతూ, “న్యూరో అత్యవసర పరిస్థితులపై నిర్వహించిన ఈ ఎంకాన్ 2025 ప్రీకాన్ఫరెన్స్ అత్యున్నత ప్రమాణాలను సృష్టించింది. అత్యంత సంక్లిష్టమైన న్యూరోలాజికల్ భావనలను ప్రాక్టికల్‌గా, రోగులకు ఎమర్జెన్సీ వైద్యం ఎలా అందించాలో ఈ సెషన్‌లో అందరూ చాలా సమగ్రంగా వివరించారు. మన దేశంలో ఉన్న అన్ని ఆస్పత్రుల ఎమర్జెన్సీ విభాగాలలో న్యూరో క్రిటికల్ కేసులకు అత్యంత వేగంగా, నైపుణ్యంతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో చికిత్స చేయడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండేలా చేయాలన్నది మా లక్ష్యం” అని వివరించారు.
న్యూరో అత్యవసర కేసులలో సమస్యను త్వరగా గుర్తించడం, నిర్మాణాత్మక అంచనా, అన్ని విభాగాల సమన్వయంతో చికిత్స చేయడం ద్వారా ప్రతి నిమిషాన్నీ విలువైనదిగా భావించాలన్న విషయాన్ని ఈ సదస్సులో ప్రధానంగా చెప్పారు. వృత్తిపరమైన అవగాహనను ఎప్పటికప్పుడు పెంచుకోవడం, అందరితో కలిసి నేర్చుకోవడంపై దృష్టిపెట్టిన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సెమితో భాగస్వామ్యం ద్వారా దేశంలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తన నాయకత్వ స్థానాన్ని నిరూపించుకుంది.
ఈ సదస్సుకు సెమి జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పాటిబండ్ల సౌజన్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో విద్యా ప్రమాణాలను పెంపొందించడం, అకడమిక్ సహకారాల ద్వారా క్లినికల్ నైపుణ్యాన్ని పెంచడంలో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రంగనాథం పైడిపెద్దిగారి కూడా పాల్గొని ప్రత్యేకంగా ప్రసంగించారు. ఇంకా.. డాక్టర్ వై.మురళీకృష్ణ, డాక్టర్ నీలోఫర్ అలీ, డాక్టర్ వివేక్ పొట్లూరి తదితరులు పాల్గొన్నారు.


