సాక్షి, హైదరాబాద్: రేపటి మొదటి దశ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ జరిగినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని దేవి ప్రకటించారు. పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆమె బుధవారం మీడియాకు వెల్లడించారు.
రేపు మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక లేదంటే ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే అబ్జర్వర్ల, మైక్రో అబ్జార్వుల నియామకం జరిగింది. ఓటర్ స్లిప్ల్ లు పంపిణి దాదాపు పూర్తి అయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తి అయిందని వెల్లడించారామె.
సీఎం రేవంత్ రెడ్డిపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు పైనా ఆమె స్పందించారు. ఆ ఫిర్యాదును ఎన్నికల సంఘం ఎంసీసీ(Model Code of Conduct) కమిటీకి పంపాం. ఆ కమిటీ నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. రెండు సంవత్సరాల ప్రజా పాలన ఉత్సవాల కోసం అనుమతి అడిగారు. మేం అనుమతి ఇచ్చాం అని అన్నారామె.
👇
- మొత్తం మండలాలు నోటిఫై: 189
- గ్రామ పంచాయతీలు నోటిఫై: 4236
- వార్డులు నోటిఫై: 37,440
- పోలింగ్ స్టేషన్లు: 37,562
- ఫేజ్–1 ఓటర్ల సంఖ్య: 56,19,430
- పురుషులు: 27,41,070
- మహిళలు: 28,78,159
- ఇతరులు: 201
👇
పోలింగ్‌కు వెళ్లే GPలు: 3,834
పోలింగ్‌కు వెళ్లే వార్డులు: 27,628
సర్పంచ్ అభ్యర్థులు: 12,960
వార్డ్ మెంబర్ అభ్యర్థులు: 65,455
ROలు నియామకం: 3,591
పోలింగ్ సిబ్బంది: 93,905
మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడూ దశలకు)
వెబ్‌కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు: 3,461
బ్యాలెట్ బాక్సులు అందుబాటులో: 45,086
👉ఇక ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు.. సీజ్‌లు తదితర వివరాలను ఏడీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
- ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు: 3,214 FIRలు
- ప్రివెంటివ్ యాక్షన్‌లో బౌండ్ ఓవర్ వ్యక్తులు: 31,428
- డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాలు: 902
- సీజ్ చేసిన నగదు: ₹1,70,58,340
- సీజ్ చేసిన మద్యం: ₹2,84,97,631
- డ్రగ్స్ / నార్కోటిక్స్: ₹2,22,91,714
- విలువైన లోహాలు / ఆభరణాలు: ₹12,15,500
- ఇతర వస్తువులు: ₹64,15,350
మొత్తం సీజ్ విలువ: ₹7,54,78,535
రేపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ డబుల్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు.


