20 ఏళ్లుగా ప్రజా సేవలో తిరుపతయ్య కుటుంబం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సమత్ భట్టుపల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన తిరుపతయ్య కుటుంబం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి దాదాపు 20 ఏళ్లుగా ప్రజా సేవలో నిలకడగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ తిరుపతయ్య కాంగ్రెస్ తరఫున సమత్ భట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
2001 గ్రామపంచాయతీ ఎన్నికల్లో తిరుపతయ్య తల్లి సర్పంచ్‌గా గెలుపొందారు. ఆపై 2006 ఎన్నికల్లో తిరుపతయ్య గెలిచారు. ఇక 2013లోనూ వైసీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే, 2019లో పంచాయతీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య పోలెబోయిన శ్రీవాణి పోటీ చేసి గెలిచారు. ఇలా రెండు దశాబ్దాలుగా పంచాయతీ అధికారం నిరంతరం పోలెబోయిన కుటుంబం చేతుల్లోనే ఉంటుండగా.. తిరుపతయ్య మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు.


