పాకిస్తాన్ సైనిక చరిత్రలో అత్యంత నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్‌కు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించి మిలిటరీ కోర్టు. రావల్పిండిలో డిసెంబర్ 11 విడుదల చేసిన ISPR (ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్) గురువారం ఈ తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ అధికార నిర్మాణ లోపాలు, సైనిక అంతర్గత జవాబుదారీతనం విధానాలపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
ISPR ప్రకారం, దేశ భద్రత, ప్రయోజనాలకు నష్టం కలిగించడంతో పాటు, ప్రభుత్వ వనరులను కూడా ఫైజ్ హమీద్ దుర్వినియోగం చేశారని సైనిక కోర్టు విశ్వసించింది. కోర్టు ప్రతి అభియోగంపై హమీద్‌ను దోషిగా నిర్ధారించింది. దేశంలో రాజకీయ అస్థిరత వ్యాప్తికి సంబంధించిన అంశాలపై ఫైజ్ హమీద్ పాత్రపై దర్యాప్తు ఇంకా ముగియలేదని ISPR తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ కేసులను విడిగా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం భవిష్యత్తులో ఆయనపై మరిన్ని చట్టపరమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు
పాకిస్తాన్ సైన్యంలో అరుదైన విచారణ
FGCM చర్యలు ఆగస్టు 12, 2024న పాకిస్తాన్ ఆర్మీ చట్టం కింద ప్రారంభమై 15 నెలలకు పైగా కొనసాగాయి. ప్రాసిక్యూటర్లు నాలుగు ప్రధాన ఆరోపణలను కొనసాగించారు. వీటిలో రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం, రాష్ట్ర భద్రతకు హానికరమని భావించే విధంగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం, అధికారాన్ని మరియు రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేయడం మరియు వ్యక్తులకు తప్పుడు నష్టం కలిగించడం ఉన్నాయి.సుదీర్ఘమైన విచారణల అనంతరం డిసెంబర్ 11, 2025న 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ప్రక్రియ చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నొక్కి చెప్పింది . అలాగే హమీద్ తన సొంత రక్షణ బృందాన్ని ఎంచుకునే అనుమతి ఉందని అన్నారు. తీర్పుపై అప్పీల్ చేసుకునే హక్కు ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు


