బెంగళూరు పోలీసులు ఒక అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్‌ను ఛేదించారు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బందిగా నటిస్తూ వైట్‌ఫీల్డ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నటిస్తూ వందలాది విదేశీయులను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో 21 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 21 మంది సిబ్బందిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి పోలీసు కస్టడీకి తరలించారు. సైబర్ కమాండ్ స్పెషల్ సెల్ మరియు వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ విభాగం నుండి వచ్చిన అధికారులు నవంబర్ 14 - 15 తేదీలలో మస్క్ కమ్యూనికేషన్స్‌పై దాడి చేశారు. డెల్టా భవనం, సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్‌లోని ఆరవ అంతస్తులోని సంస్థ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు , ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కింగ్‌పిన్‌లు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అమెరికా, యూకేలలో 2022 నుండి ఈ దందా కొనసాగిస్తున్నారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.
ఆగస్టు నుండి ఈ ముఠా అమెరికా, యూకేలలో కనీసం 150 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని, ఒక్కొక్కరిని బిట్‌కాయిన్ ATMలలో దాదాపు పదివేల డాలర్లు (సుమారు రూ. 13.5 కోట్లు) డిపాజిట్ చేయమని బలవంతం చేసినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బాధిత కస్టమర్ల బ్యాంక్ వివరాలను సేకరించే ప్రక్రియలో ఉన్నామని ఒక సీనియర్ IPS అధికారి తెలిపారు. నిందితులు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బంది అని చెప్పి 'ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) ఉల్లంఘనలను' ఉల్లంఘించారంటూ బాధితులను భయపెట్టారు. ఈ నెపంతో, వారు నకిలీ భద్రతా పరిష్కారాలు , సమ్మతి విధానాల కోసం పెద్ద మొత్తాలను వసూలు చేశారు.
ఇదీ చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులు
మస్క్ కమ్యూనికేషన్స్ ఆగస్టులో నెలకు రూ.5 లక్షలకు 4,500 చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా వినియోగదారులను లక్ష్యంగా ని హానికరమైన ఫేస్‌బుక్ ప్రకటనలిచ్చారు.ఇవి ఇతర చట్టబద్ధమైన భద్రతా హెచ్చరికలు లేదా సేవా లింక్‌లాగానే ఉంటాయి. కనిపించకుండా ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది. ఒక వినియోగదారు ప్రకటనపై క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ నుండి వచ్చినట్లు మెసేజ్ పాప్ అప్ అవుతుంది. నకిలీ హెల్ప్‌లైన్ నంబర్‌కూడా డిస్‌ప్లే అవుతుందని దర్యాప్తు అధికారులు వివరించారు.
బాధితులు ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, వారి కంప్యూటర్ హ్యాక్ చేసి, IP చిరునామా,బ్యాంకింగ్ డేటా చోరీ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారు బిట్‌కాయిన్ ATMల ద్వారా బాధితులను భారీ మొత్తాలు చెల్లించమని బలవంతం చేశారు.
ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలు
మస్క్ కమ్యూనికేషన్స్ 83 మంది ఉద్యోగలున్నారు. వారిలో 21 మంది సాంకేతిక సిబ్బంది ఈ స్కామ్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వారికి నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు జీతాలు చెల్లించారు. ఇదిలా ఉండగా, అహ్మదాబాద్‌కు చెందిన రవి చౌహాన్ అనే వ్యక్తి సుమారు 85 మంది సిబ్బందిని నియమించగా, అతన్ని గత నెలలో అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 22కి చేరింది.


