న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది.
తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, అండమాన్ అండ్ నికోబార్, ఉత్తరప్రదేశ్,కేరళలో ఓటర్ల జాబితా సవరణ గడువు వారం రోజులకు పొడిగించింది. తమిళనాడు,గుజరాత్ (డిసెంబర్ 14), మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అండమాన్ అండమాన్ నికోబార్ దీవులు (డిసెంబర్ 18), ఉత్తర ప్రదేశ్ (డిసెంబర్ 26)కు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కాగా, గోవా, లక్షద్వీప్, రాజస్థాన్,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ గడువు ఈరోజు ముగిసింది.


