న్యూఢిల్లీ/జెరూసలేం: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించారు. ఈ సంభాషణలో నెతన్యాహూ, ప్రాంతీయ పరిస్థితులపై మోదీకి వివరాలు అందించారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్–ఇజ్రాయెల్ ఒకే వేదికపై నిలబడుతున్నాయని స్పష్టం చేశారు.
నేతన్యాహూ, గాజా-ఇజ్రాయెల్ ఘర్షణలు, ప్రాంతీయ భద్రతా సవాళ్లపై మోదీకి వివరించారు. ఈ పరిస్థితుల్లో భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యం మరింత కీలకమని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. మోదీ-నేతన్యాహూ సంభాషణ, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలపరచనుంది. రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతుందని అంచనా.
ఫోన్ సంభాషణలోనే ఇద్దరు నాయకులు త్వరలో ముఖాముఖి సమావేశం జరపాలని అంగీకరించారు. ఈ సమావేశం ద్వారా పశ్చిమ ఆసియా శాంతి, స్థిరత్వం కోసం కొత్త వ్యూహాలు రూపొందే అవకాశం ఉంది.
Spoke with my friend Prime Minister Netanyahu. We reviewed progress in the India-Israel Strategic Partnership and agreed to further strengthen our cooperation. Also reaffirmed our shared commitment to zero tolerance for terrorism. India supports all efforts aimed at achieving a…
— Narendra Modi (@narendramodi) December 10, 2025
ఇదిలా ఉంటే.. గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4,5 తేదీల్లో భారత్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరిచాయి. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు,ప్రధాని మోదీల మధ్య ఫోన్ సంభాషణ జరగడం చర్చాంశనీయంగా మారింది.


