కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా.. వర్క్ చేయాలని పట్టుబడుతున్నాయి. తాజాగా ఒక ఉద్యోగికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మేనేజర్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు.
నా భార్య ప్రసవ వేదనలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా.. మేనేజర్ వర్క్ ఫ్రమ్ హాస్పిటల్ చేయమని అన్నారు. ఉద్యోగి ఆ విషయాన్ని రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. ''నా భార్య మా మొదటి బిడ్డ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. నేను మేనేజర్‌కు ఈ విషయం గురించి చెప్పి రెండు రోజులు మాత్రమే సెలవు అడిగాను. అయితే మేనేజర్ సానుభూతి చూపించడానికి బదులు, ఆసుపత్రి నుంచే వర్క్ చేయమని అన్నారు. మా బిడ్డపై ద్రుష్టి పెట్టాల్సిన సమయంలో నేను ఆసుపత్రి గదిలో నా ల్యాప్‌టాప్‌తో కూర్చోవడం సరైంది కాదు. నేను ఉద్యోగాన్ని వదులుకోలేను, ఎందుకంటే.. నా బాధ్యతలు పెరుగుతూనే ఉన్నాయి, నేను వాళ్లకు వ్యతిరేఖంగా మాట్లాడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారేమో అని భయంగా ఉందని'' అన్నారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు మేనేజర్‌పై ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ పని ఉంటుంది. ముందు మీ భార్యను చూడండి అని ఒకరు, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. నేను ఇండియాలో పనిచేయకపోవడం మంచిది అయిందని ఇంకొకరు అన్నారు. భార్య, బిడ్డ జీవితంలో చాలా కీలకం.. ఆ దిశగా ఆలోచించు అని మరొకరు అన్నారు.
ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!


