50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం! | 50/30/20 Budget Rule Explained With Examples | Sakshi
Sakshi News home page

50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!

Nov 22 2025 4:07 PM | Updated on Nov 22 2025 4:49 PM

50/30/20 Budget Rule Explained With Examples

డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టేస్తారు.. కానీ పొదుపు చేయడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెరిగిపోతున్న ధరల వల్ల ఎక్కడ, ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోతోంది. అయితే 50/30/20 ఫార్ములాను అనుసరిస్తే ఎవరైనా.. డబ్బు పొదుపు చేయవచ్చు. ఈ ఫార్ములా గురించి ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

ఒక వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నప్పుడు పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే?, ఖర్చులు ఆటోమాటిక్‌గా పెరిగిపోతాయి. ఈ ఖర్చుల కోసం.. సంపాదించిన మొత్తం వెచ్చిస్తే?, భవిష్యత్ కోసం ఏమీ మిగలదు. కాబట్టి పొదుపు అవసరం.

ఏమిటీ 50/30/20 ఫార్ములా?
50/30/20 ఫార్ములా.. మీ ఆదాయాన్ని మూడు ఖర్చు భాగాలుగా విభజిస్తుంది. 50 శాతం అవసరాలకు, 30 శాతం కోరికలు (సరదా ఖర్చులు), 20 శాతం పొదుపు. ఈ ఫార్ములాను యూఎస్ సెనెటర్ ఎలిజబెత్ వారెన్ తన పుస్తకం "ఆల్ యువర్ వర్త్: ది అల్టిమేట్ లైఫ్‌టైమ్ మనీ ప్లాన్''లో వెల్లడించారు.

వివరంగా చెప్పాలంటే.. మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారనుకుందాం. అందులో 50 శాతం లేదా రూ. 50వేలు అవసరాలకు, అంటే రూమ్ రెంట్, కిరాణా సామాగ్రి, బీమా & ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. 30 శాతం లేదా రూ. 30వేలు సరదా ఖర్చులకు, అంటే.. హ్యాండ్‌బ్యాగులు, గడియారాలు, నగలు వంటివన్న మాట. 20 శాతం లేదా రూ. 20వేలు పొదుపు (స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి, మీ నైపుణ్యాన్ని బట్టి) చేయాలి. ఇలా విభజించుకుంటే.. మీరు తప్పకుండా పొదుపు చేయొచ్చు.

ఇదీ చదవండి: నెలకు ₹11వేలు ఆదాతో రూ. కోటి!: ఇదిగో ఫార్ములా

మీరు సంపాదించే డబ్బులో ఇంకా కొంత ఎక్కువ పొదుపు చేయాలంటే.. అనవసరమైనవి కొనుగోలు చేయడం లేదా ఖర్చు పెట్టడం మానేయాలి. ఆలా మిగిలిన డబ్బును కూడా మీరు సేవింగ్స్ చేసుకుంటూ పోతే.. పొదుపు తప్పకుండా పెరుగుతుంది. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే.. దాని గురించి తప్పకుండా కొంత సమాచారం తెలుసుకుండాలి, అనుభవం కూడా ఉండాలి. లేకుంటే నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుందన్న విషయం మర్చిపోవద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement