సరైన ఆదాయం పొందాలంటే.. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక ఉత్తమమైన మార్గం. 11-12-20 ఫార్ములా ప్రకారం.. ఇందులో పెట్టుబడి పెడితే.. కోటీశ్వరులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇదెలా సాధ్యమో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
11-12-20 ఫార్ములా
ఈ ఫార్ములా ప్రకారం.. నెలకు 11,000 రూపాయలు 20 ఏళ్లు పెట్టుబడిగా పెడితే, 12 శాతం రిటర్న్‌తో రూ. కోటి పొందవచ్చు.
20 సంవత్సరాలు.. నెలకు రూ. 11000 చొప్పును పెట్టుబడిగా పెడితే మొత్తం రూ. 26.40 లక్షలు అవుతుంది. 12 శాతం రిటర్న్స్ ఆశిస్తే.. మీరు చక్రవడ్డీ రూపంలో మరో రూ.83.50 లక్షల ఆదాయం పొందవచ్చు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన అసలు + వచ్చిన చక్రవడ్డీ రెండూ కలిపితే.. కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట. ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీకు వచ్చే రిటర్న్స్ బాగున్నప్పుడే.. ఎక్కువ ఆదాయం వస్తుంది.
మీ పెట్టుబడికి ఎక్కువ లాభం రావడానికి కారణం.. చక్రవడ్డీ. ఎందుకంటే మీ పెట్టుబడి కంటే.. ఎక్కువ వడ్డీ రూపంలోనే యాడ్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి.. ఆ పెట్టుబడికి వచ్చిన వడ్డీపై కూడా మీరు రిటర్న్స్ ఆశించవచ్చు. ఈ కారణంగానే మీరు 20 ఏళ్లలో భారీ ఆదాయం ఆశించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడికి లాంగ్ టర్న్ ఉత్తమమైన ఎంపిక.
NOTE: పెట్టుబడి పెట్టడం అనేది.. మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి పెట్టడానికి ముందు.. పెట్టుబడులను గురించి తెలుసుకోవడానికి, ఆర్ధిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికీ భారీ లాభాలు వస్తాయని చెప్పలేము. కొన్ని సార్లు కొంత నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి.


