కవాసకి నవంబర్ 2025లో రూ. 12.79 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసిన.. Z1100 బైకు మంచి ఆదరణ పొందింది. 2026 సంవత్సరానికి కేటాయించిన 20 యూనిట్లు లేదా 20 బైకులు బుక్ అయిపోయాయి. దీంతో కంపెనీ కూడా ఈ బైక్ కోసం బుకింగ్స్ నిలిపివేసింది. తరువాత బ్యాచ్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.
కవాసకి Z1100 బైక్ 1,099cc, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 134 bhp & 113 Nm టార్క్ అందిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ రెండు చివర్లలో అడ్జస్టబుల్ సస్పెన్షన్.. ప్రీమియం బ్రేకింగ్ హార్డ్‌వేర్ పొందుతుంది. ఇది డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V2, బీఎండబ్ల్యూ ఎస్ 1000 R, హోండా సీబీ1000ఆర్, ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


