ఆధార్ కార్డు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే.. పేపర్‌లెస్ ఆధార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ కూడా ప్రవేశపెట్టింది. ఇపుడు తాజాగా.. ఆధార్ PVC కార్డు కోసం సర్వీస్ ఛార్జీని రూ.50 నుంచి రూ.75కి పెంచింది.
పెరిగిన PVC కార్డు సర్వీస్ ఛార్జీలలో.. ట్యాక్స్, డెలివరీ ఛార్జీలు ఉన్నాయి. 2020లో ఈ సేవ ప్రవేశపెట్టిన ధర పెంచడం ఇదే మొదటిసారి. 2026 జనవరి నుంచి ఆధార్ PVC పొందాలనుకుంటే వినియోగదారులు కొత్త ఛార్జీలు చెల్లించాల్సిందే. myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar మొబైల్ యాప్ అప్లై చేసుకొనే వినియోగదారులకు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. సంవత్సరం జనవరి 1 నుండి కొత్త ధర అమలులోకి వచ్చిందని UIDAI తెలిపింది.
ధర పెరుగుదలకు కారణం
పీవీసీ ఆధార్ కార్డు ధరల పెరుగుదలకు కారణం.. నిర్వహణ ఖర్చులు పెరగడం అని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొన్నేళ్లుగా.. ఆధార్ PVC కార్డ్ ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన మెటీరియల్స్, ప్రింటింగ్, సురక్షిత డెలివరీ, లాజిస్టిక్స్ ఖర్చు పెరిగింది. దీనివల్ల ఛార్జీలు పెంచినట్లు సంస్థ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!
ఆధార్ PVC కార్డును ఎలా ఆర్డర్ చేయాలి?
➤ఆధార్ PVC కార్డు కోసం myAadhaar వెబ్‌సైట్ లేదా mAadhaar యాప్ ఉపయోగించాలి.
➤యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. ఆధార్ నెంబర్ , క్యాప్చ ఎంటర్ చేసిన తరువాత.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ లాగిన్ అవ్వాలి.
➤లాగిన్ అయినా తరువాత.. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
➤ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు ఆప్షన్ ఎంచుకున్న తరువాత 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
➤ప్రాసెస్ పూర్తయిన తరువాత.. ఐదు పని దినాలలోపు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది.
Once you have placed an order for your #AadhaarPVCCard, within a few days your card is printed and sent through India Post’s Speed Post service, which is fast, secure, and trackable.
You can easily check the delivery status online.
To track the delivery status of your #Aadhaar… pic.twitter.com/ZFQOet6TU2— Aadhaar (@UIDAI) January 6, 2026


