మెరుగైన అంచనాలు ప్రకటించిన కేంద్రం
ఆర్‌బీఐ అంచనా 7.3 శాతం కంటే ఎక్కువ
న్యూఢిల్లీ: తయారీ, సేవల రంగాల బలమైన పనితీరుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని, ప్రపంచంలో వేగవంతమైన పెద్ద ఆర్థిక వ్యవస్థగా తన గుర్తింపును కొనసాగిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవ జీడీపీ స్థిర ధరల వద్ద 2025–26లో రూ.201.90 లక్షల కోట్లకు చేరుతుందని, 2024–25లో ఉన్న రూ.187.97 లక్షల కోట్ల కంటే 7.4 శాతం పెరుగుదల ఉంటుందని పేర్కొంది.
6.3–6.8 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చన్న గత అంచనాల కంటే ఇది ఎక్కువ. ఆర్‌బీఐ అంచనా 7.3 శాతం కంటే అధికం కావడం గమనార్హం. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించినప్పటికీ, దేశ ఆర్థిక వ్యవస్థ సెపె్టంబర్ త్రైమాసికంలోనూ బలమైన పనితీరు (8.2 శాతం) నమోదు చేయడం తెలిసిందే. కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ ఈ మేరకు తొలి ముందస్తు అంచనాలను విడుదల చేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. జీఎస్‌టీ సంస్కరణలతో 375 ఉత్పత్తులపై ధరలు దిగిరావడం, ఆదాయపన్ను కొత్త విధానంలో మినహాయింపులను గణనీయంగా పెంచడం, కార్మిక సంస్కరణలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం, ద్రవ్యోల్బణం దిగిరావడం, గ్రామీణ వినియోగం పుంజుకోవడాన్ని సానుకూలతలుగా గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ పేర్కొంది. స్థూల జోడించిన విలువ (జీవీఏ) 7.3 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4 శాతంగా ఉంది.
తయారీ 7 శాతం
తయారీ రంగం 7 శాతం వృద్ధిని సాధిస్తుందని (గత ఏడాది 4.5 శాతం) ప్రభుత్వం అంచనా వేసింది. సేవల రంగంలో వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 7.2 శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతానికి విస్తరిస్తుందని


