పారిస్: ఫ్రెంచ్ అధ్యక్షుడి సతీమణిని ట్రోల్ చేసినందుకు గాను అక్కడి పారిస్ కోర్టు పదిమందికి జైలుశిక్ష విధించింది. బ్రిగెట్టి మేక్రాన్ పురుషుడు అంటూ కొంతమంది ఆన్‌లైన్‌లో వేదింపులకు గురిచేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేయగా తాజాగా ఆకేసును విచారించిన పారిస్ కోర్టు వారికి శిక్ష విధిస్తూ తీర్పుఇచ్చింది.
ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్‌ను 2024లో కొంతమంది ఆకతాయిలు ఆన్‌లైన్‌లో ట్రోల్ చేశారు. వాస్తవానికి బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడని ఆయన అసలు పేరు జీన్- మిచెల్-ట్రోగిక్స్ అని ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్‌పై కలత చెందిన మాక్రాన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పుకార్ల వల్ల తమ కుటుంబం ఎంతో బాధపడిందని ఆమె కుమార్తె తెలిపింది.
తాజాగా దీనిపై విచారించిన కోర్డు నిందితులు పదిమందికి ఎనిమిది నెలల జైలుశిక్షతో పాటు రూ. 63 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే వీరిలో కొంతమంది తాము కేవలం సరదాకు మాత్రమే అలా అన్నామని అనగా.. దేశ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబం గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని న్యాయమూర్తి వారిని హెచ్చరించారు.
అమెరికాలో కూడా ట్రంప్ అనుకూల జర్నలిస్టులు కాండేస్ ఓవెన్స్, టక్కర్ గ్రావెన్స్ అనే ఇద్దరు జర్నలిస్టులు బ్రిగిట్టే మాక్రాన్ పురుషుడే అని వ్యాఖ్యలు చేశారు. బ్రిగిట్టే తన సోదరుడు జీన్-మిచెల్-ట్రోగన్స్ వాస్తవానికి ఒక్కరేనని మిచెల్ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని బ్రిగిట్టేగా మారిందన్నారు. అయితే ఇవన్ని అసత్యపుకార్లని చాలా మంది కొట్టిపారేశారు.


