చదువు పూర్తయిన తరువాత.. ఎవరైనా ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిందే. జాబ్ కోసం చాలా కంపెనీలకు అప్లై చేసుకుంటారు. ఇంటర్వ్యూలకు సైతం హాజరవుతారు. ఎవరైనా 500 కంటే ఎక్కువ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటారా?, వినడానికి బహుశా ఇది కొంచెం కొత్తగా అనిపించినా.. ఇది నిజం. ఇక కథనంలోకి వెళ్తే..
చికాగోకు చెందిన ఒక మహిళ ఉర్బానా ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన కొద్దికాలానికే ఉద్యోగాల కోసం అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆలా దాదాపు రెండేళ్లు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంది.

దాదాపు 800 రోజులు.. ఆమె 500 కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంది. కానీ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. ఉద్యోగాలను వెతుక్కునే సమయంలో.. ఆమె తన భర్త ఆదాయంపై ఆధారపడింది. 2025 జులైలో నిరాశ చెంది.. ప్లీజ్ హైర్ మీ అనే ఫొటోలతో పాటు.. వ్యక్తిగత వివరాలను కలిగి ఉన్న ఒక 'గ్రాఫిక్ ఫోటో'ను ఫేస్‌బుక్‌లోని ఒక పెద్ద చికాగో కమ్యూనిటీ గ్రూప్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ అతి తక్కువ కాలంలోనే వైరల్ కావడంతో.. చాలామంది జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు.
వచ్చిన జాబ్ ఆఫర్లతో ఒక ఫోటోగ్రఫీ స్టూడియో యజమాని కూడా ఉన్నారు, ఆమె కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రశంసించారు. ఆమెను పార్ట్-టైమ్ స్టూడియో మేనేజర్‌గా నియమించారు. ఈ ఉద్యోగం తన డిగ్రీకి సంబంధించినది కానప్పటికీ, ఆమె సంతృప్తి చెందిందని & సహాయక పని వాతావరణాన్ని విలువైనదిగా చెబుతుంది.
ఇదీ చదవండి: వరల్డ్ ఎకనామిక్ క్రాష్: ఇప్పుడే ప్లాన్ చేసుకోండి..


